News
News
X

PAN Card History: మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయిందన్న డౌట్‌ ఉందా?, హిస్టరీని ఇలా చెక్‌ చేసుకోవచ్చు

మీకు తెలీకుండానే అజ్ఞాత వ్యక్తులు మీ పేరు మీద రుణాలు తీసుకునే ప్రమాదం ఉంది.

FOLLOW US: 
Share:

PAN Card History: మన దేశంలో పాన్ కార్డ్ & ఆధార్ కార్డ్ వినియోగం చాలా వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో అన్ని ఆర్థిక సంబంధ పనుల కోసం ఉపయోగించే ముఖ్యమైన రుజువు పాన్‌ కార్డ్‌. ముఖ్యమైనది కాబట్టి, ఈ కార్డ్‌లోని వివరాలను గోప్యంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. చాలా మంది ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోకుండా, పాన్ కార్డును సరిగ్గా పట్టించుకోరు. ఆ అలసత్వం కారణంగా పాన్ దుర్వినియోగం అవుతుంది. మీకు తెలీకుండానే అజ్ఞాత వ్యక్తులు మీ పేరు మీద రుణాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఆ ప్రతికూల ప్రభావం మీ జేబు మీద, మీ కుటుంబం మీద పడుతుంది. కొన్ని సార్లు పోలీస్‌ కేస్‌ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను నివారించాలంటే, మీ పాన్ కార్డు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.

పాన్ కార్డ్ చరిత్రను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలంటూ, పాన్ కార్డ్ హోల్డర్లు అందరికీ ఆదాయపు పన్ను శాఖ తరచూ సలహా ఇస్తూనే ఉంటుంది. మీరు ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌ ద్వారానే పాన్ కార్డ్ చరిత్రను తనిఖీ చేయవచ్చు. పాన్‌ హిస్టరీని చెక్‌ చేసుకోవడం వల్ల, ఆ కార్డ్‌ ఎప్పుడెప్పుడు, ఏయే సందర్భాల్లో ఉపయోగించడం జరిగిందో మీకు అర్ధం అవుతుంది. ఒకవేళ మీకు లావాదేవీ జరిగి ఉంటే, మీరు తక్షణం తదనుగుణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 

మీ పాన్ కార్డ్ చరిత్రను తనిఖీ చేయాలనుకుంటే, ఇదిగో సులభమైన ప్రక్రియ:

1. ముందుగా https://www.cibil.com/ వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి.
2. తర్వాత, గెట్ యువర్ సిబిల్ స్కోర్ (CIBIL Score) మీద క్లిక్ చేయండి.
3. సిబిల్‌ స్కోర్‌ను తనిఖీ చేయడానికి ముందు, ఇక్కడ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఎంచుకుని నిర్దిష్ట మొత్తం చెల్లించాలి.
4. ఆ తర్వాత, మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి అవసరమైన అన్ని వివరాలను పూరించాలి.
5. ఆపై లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ జనరేట్ చేసుకోవాలి.
6. తర్వాత, 'ఇన్ కమ్ ట్యాక్స్ ఐడీ'ని ఎంచుకోవాలి.
7. ఇప్పుడు, మీ పాన్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి, వెరిఫై యువర్ ఐడెంటిటీ ఆప్షన్‌ మీద క్లిక్ చేయాలి.
8. దీని తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. వాటి తర్వాత మీ సిబిల్‌ స్కోర్ ఎంతో మీకు తెలుస్తుంది.
9. దీనితో పాటు, మీరు మీ పాన్ కార్డ్ ఉపయోగించి ఎన్ని లోన్లు తీసుకున్నారో పాన్ కార్డ్ చరిత్రలో మీరు చూస్తారు.

పాన్ కార్డ్ దుర్వినియోగంపై ఫిర్యాదు చేయవచ్చు
మీ పాన్ కార్డ్ చరిత్రను తనిఖీ చేసినప్పుడు, మీకు అసలు సంబంధం లేని, మీరు చేయని ఏదైనా తప్పుడు లావాదేవీ మీకు కనిపిస్తే వెంటనే దాని గురించి ఆదాయ పన్ను విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదును నమోదు చేయడానికి,  https://incometax.intelenetglobal.com/pan/pan.asp లింక్‌ ద్వారా ఐటీ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లవచ్చు. ఇక్కడ, అడిగిన అన్ని వివరాలను మీరు పూరించాలి. దీని తర్వాత ఫిర్యాదును నమోదు చేయండి. దీంతో, మీ కంప్లయింట్‌ రిజస్టర్‌ అవుతుంది, దాని మీద తగిన చర్యను అధికారులు చేపడతారు.

Published at : 26 Dec 2022 02:57 PM (IST) Tags: Pan Card Income Tax IT department Pan Card Fraud Pan Card Misuse

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price 05 February 2023: రాజమండ్రిలో చమురు మంట, పెద్ద నోటు ఉంటేనే పెట్రోల్‌ బంక్‌కు వెళ్లండి

Petrol-Diesel Price 05 February 2023: రాజమండ్రిలో చమురు మంట, పెద్ద నోటు ఉంటేనే పెట్రోల్‌ బంక్‌కు వెళ్లండి

Gold-Silver Price 05 February 2023: కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు - కొనాలనుకునే వాళ్లకు మంచి అవకాశం

Gold-Silver Price 05 February 2023: కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు - కొనాలనుకునే వాళ్లకు మంచి అవకాశం

ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్‌ యూజర్లు, "నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌" రికార్డ్ ఇది

ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్‌ యూజర్లు,

LIC WhatsApp Services: 11 రకాల ఎల్‌ఐసీ సేవల్ని వాట్సాప్‌ నుంచే పొందొచ్చు, మీరు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు

LIC WhatsApp Services: 11 రకాల ఎల్‌ఐసీ సేవల్ని వాట్సాప్‌ నుంచే పొందొచ్చు, మీరు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు

Credit Card Charges: అద్దె బాదుడు లిస్ట్‌లో IDFC ఫస్ట్ బ్యాంక్, ఛార్జీలు వర్తిస్తాయ్‌

Credit Card Charges: అద్దె బాదుడు లిస్ట్‌లో IDFC ఫస్ట్ బ్యాంక్, ఛార్జీలు వర్తిస్తాయ్‌

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!