అన్వేషించండి

Cement Sector: ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? - ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?

సెప్టెంబర్, అక్టోబరులో దాదాపు 20 శాతం పెరిగిన సిమెంట్ ధర, నవంబర్‌లో తగ్గుముఖం పట్టింది.

Cement Sector Outlook: సొంత ఇల్లు ఒక అందమైన కల. 'కల' అని ఎందుకు అంటాం అంటే.. అందరి విషయంలో ఇది వాస్తవ రూపంలోకి రాదు. సొంత ఇల్లు కొనడం/కట్టడం (building own house) అంటే సగటు భారతీయుడికి ఒక పెద్ద పండుగ. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి తమ పూర్తి జీవితపు పొదుపును పెట్టుబడిగా పెడతారు. చాలా ఎక్కువ మంది అప్పు (home loan) చేస్తుంటారు.

ఇంటి నిర్మాణంలో ఎక్కువ ఖర్చయ్యే సామగ్రిలో సిమెంట్‌ ఒకటి. సిమెంట్‌ రేట్లు ఎప్పుడూ అస్థిరంగా ఉంటాయి, ఇంటి నిర్మాణ వ్యయంలో తేడా చూపిస్తాయి.

సిమెంట్ రంగంలో ఏకీకరణ (Consolidation in the cement sector)
కొన్నాళ్లుగా, సిమెంట్‌ రంగం కన్సాలిడేషన్‌ స్టేజ్‌లో ఉంది. అంటే.. పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలకు మంచి రేటు ఇచ్చి కొంటున్నాయి/విలీనం చేసుకుంటున్నాయి. తద్వారా అవి మరింత బడా కంపెనీలుగా మారుతున్నాయి. అధిక రుణాలు, తక్కువ లాభదాయకత కూడా చిన్నపాటి కంపెనీలను నిలవనీయడం లేదు. బడా సంస్థల ధాటికి అవి పోటీ పడలేకపోతున్నాయి, చివరగా తమ వ్యాపారాన్ని పెద్ద కంపెనీలకు అమ్మేస్తున్నాయి. ఇలా... సిమెంట్‌ రంగం నుంచి చిన్న కంపెనీలు క్రమంగా కనుమరుగు కావచ్చని మార్కెట్‌ భావిస్తోంది. 

బలమైన బ్యాలెన్స్ షీట్లు కలిగిన బడా సిమెంట్ కంపెనీలు, విలీనం/కొనుగోళ్ల ద్వారా మార్కెట్‌లో వాటాను పెంచుకోవడానికి లేదా నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. తాజాగా, బర్న్‌పూర్ సిమెంట్ ఆస్తులను అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయడం దీనికి ఉదాహరణ. అంతేకాదు, కేసోరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను అల్ట్రాటెక్ సిమెంట్ త్వరలోనే కొనుగోలు చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కేసోరామ్ ఇండస్ట్రీస్ వెబ్‌సైట్ ప్రకారం, దాని సిమెంట్ సామర్థ్యం సంవత్సరానికి 10.75 మిలియన్ టన్నులు (MTPA).

ఇటీవలి మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, దేశంలోని నాలుగు పెద్ద సిమెంట్ కంపెనీలు అల్ట్రాటెక్ సిమెంట్‌, అంబుజా సిమెంట్స్ + ACC, శ్రీ సిమెంట్, దాల్మియా భారత్‌ మొత్తం మార్కెట్ వాటా బలంగా పెరిగింది. 2013 ఆర్థిక సంవత్సరంలో, ఈ నాలుగు కంపెనీల ఉమ్మడి మార్కెట్‌ షేర్‌ దాదాపు 53 శాతంగా ఉంది.

2024-27 కాలంలో, తమ ప్రస్తుత సామర్థ్యాన్ని మరో 70 శాతానికి పైగా పెంచుకోవాలని ఈ నాలుగు పెద్ద కంపెనీలు యోచిస్తున్నాయి. దీనివల్ల, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి వాటి మార్కెట్ వాటా దాదాపు 65 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా. మార్కెట్‌లో ఉనికిని నిలబెట్టుకోవడం కష్టంగా మారే పరిస్థితులు తరుముకురావడంతో చిన్న కంపెనీలు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఈ మార్పులు సిమెంట్ ధరలను ఎలా మారుస్తాయి?
సిమెంట్ రంగంలో జరుగుతున్న ఏకీకరణ వల్ల, ఈ విభాగంలో ఉత్పత్తుల ధరలు ప్రభావితం కావడమే కాదు, సిమెంట్ ధరను నిర్ణయించే ట్రెండ్‌ను కూడా మార్చే అవకాశం ఉంది. కనీసం 3, 4 తరాల పాటు చెక్కుచెదరని ఇంటిని కట్టాలనుకుంటే, సిమెంట్ నాణ్యతలో ప్రజలు రాజీ పడరు. నాణ్యమైన సిమెంట్‌ కోసం పెద్ద సిమెంట్ కంపెనీలను మాత్రమే నమ్ముతారు.

నవంబర్‌లో తగ్గిన సిమెంట్ రేట్లు
ప్రస్తుతం, డ్రీమ్ హౌస్ నిర్మించుకోవడానికి సరైన అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్, అక్టోబరులో దాదాపు 20 శాతం పెరిగిన సిమెంట్ ధర, నవంబర్‌లో తగ్గుముఖం పట్టింది. వివిధ కారణాల వల్ల దిల్లీ-NCR ప్రాంతంలో నిర్మాణ పనులు తగ్గాయి. కాలుష్యం కారణంగా, అక్కడి ప్రభుత్వం కూడా నిర్మాణ పనులను నిషేధించింది.

ఇప్పుడు సిమెంట్ ధరలు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం, 50 కిలోల సిమెంట్ బ్యాగ్ సగటు ధర (Average cost of a cement bag) రూ.382. జులై-సెప్టెంబర్‌ కాలంలో, దేశంలో వర్షాకాలం కారణంగా నిర్మాణ పనులు తక్కువగా ఉంటాయి, సిమెంట్‌కు డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం వల్ల ధర తగ్గింది. దక్షిణ భారతదేశంలో, సిమెంట్ ధర అత్యధికంగా బస్తాకు రూ.396కి చేరుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా అక్కడ నిర్మాణ పనులపై కొన్ని ఆంక్షలు విధించడంతో డిమాండ్ తగ్గింది.

భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయి?
డిసెంబరు మధ్యకాలం నుంచి సిమెంట్‌ రేట్లు పెరగడం ప్రారంభమవుతుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అప్పటికి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడం, దిల్లీలోనూ నిర్మాణాలపై నిషేధం క్రమంగా ఎత్తివేస్తుడడంతో సిమెంట్‌కు డిమాండ్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని అంటున్నారు. కాబట్టి, ఇల్లు కట్టుకోవడానికి ఇదే సరైన సమయం, ఆలస్యం చేస్తే నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget