Budget 2023: బడ్జెట్ 2023- వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 20 లక్షల కోట్లకు పెంపు
Budget 2023: తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచనున్నట్లు తెలిపారు.
Budget 2023: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో మోదీ ప్రభుత్వం చివరి పూర్తి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో మంత్రి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచనున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 28 నెలల్లో80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామని చెప్పారు. వ్యవసాయ యాక్సిలరేటర్ ఫండ్ వ్యవసాయ స్టార్టప్ లను పెంచుతుంది. ఇది రైతులకు సహాయం చేస్తుంది. దీనివలన రైతులు, రాష్ట్రం, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం ఉంటుంది. పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమలపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచుతాం అని ఆర్థిక మంత్రి బడ్జెట్ సందర్భంగా తెలిపారు.
వచ్చే మూడేళ్లో కోటి మంది రైతులు సహజ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. 10వేల బయో ఇన్ పుట్ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం సూక్ష్మ ఎరువులపై దృష్టిసారిస్తామని చెప్పారు.
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు
- వ్యవసాయానికి సంబంధించిన స్టార్టప్ లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. యువ పారిశ్రామికవేత్తల ద్వారా అగ్రి- స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ ను ఏర్పాటు చేస్తారు.
- అమృత్ కాల్ కోసం బలమైన పబ్లిక్ ఫైనాన్స్, బలమైన ఆర్థిక రంగం, సాంకేతికతతో నడిచే విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఇందులో ప్రజల భాగస్వామ్యం సాధించడం కోసం సబ్ కా సాథ్, సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో రానున్నారు.
- వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచనున్నారు. దీనిపై బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి మాట్లాడుతూ.. వ్యవసాయ రుణాల ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడం ఆర్థికాభివృద్ధికి మంచిది. గ్రేటర్ డిజిటలైజేషన్ రుణాల ప్రాప్యతను మెరుగుపరుస్తుంది. అని అన్నారు.
- హైదరాబాద్‌లోని మిల్లెట్ ఇన్‌స్టిట్యూట్‌ను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని సీతారామన్ స్పష్టంచేశారు.
- ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. మిల్లెట్ల అవసరంపై అవగాహన కల్పించడం, ధాన్యం ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచడమే దీని లక్ష్యం.
మిలెట్స్‌కి గ్లోబల్ హబ్‌గా భారత్
శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు సహకారం అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్. పీఎం మత్య్స సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. త్వరలోనే భారత్...తృణధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మారుతుంది. మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాదు.. ఆహార భద్రతకూ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి.
2022 వ్యవసాయ బడ్జెట్ ఇలా..
సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులను ఆర్థిక మంత్రి ప్రోత్సహించారు. ప్రభుత్వం ద్వారా రసాయన మరియు పురుగుమందులు లేని వ్యవసాయాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టారు. గంగా నది పొడవునా 2022 కి.మీ వెడల్పు గల కారిడార్లలో రైతుల భూములపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం కోరింది. దీంతో పాటు 20 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5,25 కోట్లు వెచ్చించాలని కోరారు.