అన్వేషించండి

Telangana Budget 2022-23: రూ. 2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌, దళిత బంధుపై స్పెషల్ ఫోకస్

ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తూ, కేంద్రం తీరు ఎత్తిపొడుస్తూ తెలంగాణ సాధించిన ప్రగతిని వివరిస్తూ సాగింది హరీష్‌ రావు ప్రసంగం. బడ్జెట్‌ 2022ను ప్రవేశపెట్టిన ఆయన ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టంగా తేల్చేశారు.

తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్‌ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి తక్కువ కాలంలోనే దేశంలో కెల్లా అగ్రగామిగా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తోందన్నారు ప్రసంగంలోని ముఖ్యాంశాలు 2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యవయం రూ. 1.89 కోట్లుగా కాగా క్యాపిటల్ వ్యయం రూ. 29.728 కోట్లుగా తేల్చారు.

తెలంగాణ బడ్జెట్‌ 2022-23 స్వరూపం ఇదే

తెలంగాణ బడ్జెట్ -  రూ. 2,56,958.51 కోట్లు

వ్యవసాయ రంగానికి- రూ. 24,254 కోట్లు

ఆసరా పెన్షన్లకు -  రూ. 11728 కోట్లు

కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌కు -  రూ. 2750 కోట్లు

డబుల్ బెడ్రూమ్ ల కోసం-  రూ. 12000 కోట్లు

దళితబంధు -  రూ. 17వేల 7వందల కోట్లు.

మన ఊరు- మన బడి -  రూ. 7289  కోట్లు.

ఎస్టీల సంక్షేమం కోసం -  రూ. 12565 కోట్లు

పట్టణ ప్రగతి కోసం -  రూ. 1394 కోట్లు

బిసి సంక్షేమం కోసం -  రూ. 5698కోట్లు

బ్రాహ్మణుల సంక్షేమం కోసం-  రూ. 177 కోట్లు

పల్లె ప్రగతి -  రూ. 3330 కోట్లు

ఫారెస్ట్ యూనివర్సిటీకి -  రూ. 100 కోట్లు

హరితహారానికి -  రూ. 932 కోట్లు

రోడ్లు, భవనాల కోసం -  రూ. 1542 కోట్లు

గత పాలకులపై విమర్శలు

బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన సందర్భంగా సమైక్య రాష్ట్ర పాలకులపై విమర్శలు చేశారు హరీష్‌రావు. సమైక్య రాష్ట్రంలో ద్వితీయ పౌరులుగా ఉండేవాళ్లమని గుర్తు చేశారు.  నిధుల కోసం అడుక్కోవాల్సి వచ్చేదన్నారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత అలాంటి సమస్య లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా ప్రగతి పథంలో తీసుకెళ్తున్నామన్నారు హరీష్‌ రావు. నాటి పాలనను చీకటి రోజులుగా చెప్పుకొచ్చారాయన. 

దేశానికి ఆదర్శం 

తెలంగాణ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని వందకు వంద శాతం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారన్నారు హరీష్‌. ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్న పాలన దేశంలోని చాలా రాష్ట్రాలకు ఆదర్శమని అభిప్రాయపడ్డారు. 

కడుపు నోరు కట్టుకొని పాలన

ఆర్థిక క్రమశిక్షణతో అవినీతి ఆస్కారం లేకుండా టీఎస్‌ ఐపాస్‌, టీఎస్‌ బీపాస్‌, ధరణి, డిజిటల్‌ నగదు బదిలీ వంటి పాదరదర్శక విధనాలు అమలు చేసి సంపద పెంచామని గుర్తు చేశారు హరీష్‌రావు. పరిపాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజీలేని వైఖరి అవలంభించిందన్నారు తెలంగాణ ఆర్థికమంత్రి. ప్రతి పథకం ప్రయోజనం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతుందన్నారు. 

టింగు..టింగు, టింగు.. 

దరఖాస్తు పెట్టాల్సిన పని లేకుండా ఆఫీసులు చుట్టూ కాగితాలు పట్టుకొని తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతుందన్నారు హరీష్‌. ఆసరా పింఛన్ కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ పథకం ఏదైనా హైదరాబాద్‌లో మీట నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతుందన్నారు హరీష్‌రావు. 

నేడు తెలంగాణ ఆచరించింది.. రేపు దేశం అనుసరిస్తుంది. 

ఇవాళ తెలంగాణ అనుసరిస్తున్న విధానాలనే రేపు దేశం అమలు చేస్తోందన్నారు హరీష్‌. బడ్జెట్‌ అంటే అంకెల సముదాయం కాదన్న ఆయన.. ప్రజల ఆశలు, ఆకాంక్షలు వ్యక్తీకరించాలని గుర్తు చేశారు. ఆ దిశగానే తమ బడ్జెట్‌ ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

ఆది నుంచి తెలంగాణపై కేంద్రం వివక్ష

రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు హరీష్‌. కాళ్లల కట్టె పెట్టినట్టు ఉందన్నారాయన. ప్రగతి శీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకం లేకపోగా నిరుత్సాహం కలిగించే విధానాలు అవలబిస్తోందన్నారు. 

పదే పదే కుంగదీస్తున్నారు. 

తెలంగాణ పురిటిలో ఉన్నప్పటి నుంచి కేంద్రం ఎదురుదాడి మొదలైందని ఘాటు విమర్శలు చేశారు. ఆవిర్భావ వేడుకలు చేసుకోకు ముందే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించేసి మొదటి దెబ్బకొట్టారన్నారు. అప్పటి నుంచి సమయం వచ్చినప్పుడుల్లా దెబ్బ తీస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ పదే పదే ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్. 

తెలంగాణలో అమలు పరచవలసిన ఐటీఐఆర్‌ను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వ తీరని అన్యాయం చేసిందన్నారు హరీష్‌. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. కోఆపరేటివ్‌ ఫెడరలిజం అంటూనే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను కభళిస్తోందని మండిపడ్డారు హరీష్‌రావు. 

పైస ఇవ్వలేదు

నీతి ఆయోగ్‌  సిఫార్స్ చేసినా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు పైస నిధులు విధల్చలేదన్నారు హరీష్‌. ఆర్థిక సంఘాల సిఫార్సులను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇచ్చే నిర్ధిష్ట గ్రాంట్లు 2362 కోట్ల రూపాయలు విడుదల చేయలేదని గుర్తు చేశారు. 

కరోనా టైంలో అంతే 

కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో అందరికీ తెలిసిందే. ఆ సమయంలోనూ కేంద్రం రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని చెప్పారు హరీష్‌. న్యాయ సమ్మతంగా దక్కాల్సిన నిధుల్లో కూడా కోతలు పెట్టిందని మండిపడ్డారు. కంటితుడుపుగా రుణపరిమితి పెంచుతూ దానికి కూడా షరతులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణలకు లంకె పెడుతూ రాష్ట్రాల మెడపై కత్తి పెట్టరిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ మీటర్లు తెలంగాణలో పెట్టేది లేదన్నారు హరీష్‌రావు. 

ప్రతిబడ్జెట్‌లో అన్యాయం

మొన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు హరీష్‌రావు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా 
ఇవ్వలేదన్నారు. రుణాలు తెచ్చుకొని అభివృద్ధి చేసుకుందామన్నా సరే కేంద్రం అడ్డం పడుతుందన్నారు. 

ఆదాయంపై దొంగ దెబ్బ

కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తం నుంచి న్యాయబద్దంగా 41శాతం రాష్ట్రాలకు రావాల్సి ఉందన్నారు హరీష్‌ రావు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఈ వాటాను కుదించడానికి కేంద్రం సెస్సుల రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటుందన్నారు హరీష్‌. సెస్సుల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఉందని గుర్తు చేశారు. ఇలా రాష్ట్రాలకు రావాల్సిన 11.4 శాతం ఆదాయానికి కేంద్రం గండి కొడుతోందన్నారు హరీష్‌. ఈ విధానాలను రాజ్యాంగ బద్ద సంస్థులు తప్పుబడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. 

ప్రతికూల పరిస్థితుల్లో ప్రగతి పథం

ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రపథంలో తీసుకెళ్తున్నామన్నారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు. ఆర్థికంగా బలమైన శక్తిగా మారేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా 50వేల కోట్ల రూపాయలను రైతులకు పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇది మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని చివరకు కేంద్రం కూడా ఈ పథకాన్ని కాపీ చేసి అమలు చేస్తుందన్నారు. 

రైతులకు భరోసా

ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఎలాంటి ప్రీమియం లేకుండానే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని అలా ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఇలా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా 2022-23 బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు హరీష్‌రావు. 

ప్రగతిలో దేశం కంటే ముందు వరుసలో

2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ 4,51,580 కోట్ల రూపాయలని.. ఇప్పుడు అది 11, 54, 860 కోట్లకు చేరిందన్నారు హరీష్‌. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటు జాతీయి సగటు కంటే ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. కరోనా విపత్తుతో దేశం సహా అన్ని రాష్ట్రాల్లో నెగెటివ్‌ గ్రోత్‌ రేటు ఉంటే తెలంగాణ మాత్రమే 2.2 శాతం పాజిటవ్‌ వృద్ధి రేటుతో ఉందన్నారు ఆర్థికమంత్రి. 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి ని సాధించామన్నారు హరీష్. ఇలా వృద్ధి సాదిస్తున్న తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రగామిగా ఉందన్నారు. 

దేశాభివృద్ధికి చేయూత

గత ఆర్థిక సంవత్సరంలో  తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధి రేటు స్థిర ధరల వద్ద 11.2 ఉంటుందని అంచనా వేశామన్నారు. ఇప్పుడు ఆ వృద్ధి రేటు 19.1 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు హరీష్‌.  దేశ జీడీపీలో తెలంగాణ వాట 2014-15లో 4.06 శాతంగా ఉంటే 2021-22 నాటికి 4.97 శాతానికి పెరిగిందన్నారు. ఏడేళ్లలో దేశ జీడీపీకి ఒక శాతం అదనపు వాటా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తు చేశారు. 

 దారి చూపిన ద్వితీయ, తృతీయ రంగాలు

తెలంగాణలో 2021-22లో పారిశ్రామిక, సేవా రంగాలు అద్భుతమైన ప్రగతి సాధించాయి. ద్వితీయ రంగం ప్రస్తుత ధర వద్ద 21.5శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. గత ఏడాది వృద్ది -0.3శాతంగా ఉంది. సేవా రంగం సైతం 18.3 శాతం వృద్ధి రేటు సాధించింది. గతేడాది ఈ వృద్ధి 0.9శాతం మాత్రమే. 

తలసరి ఆదాయంలో భేష్

తెలంగాణ ఆర్థికంగా వృద్ధి సాధించడంతోపాటు జీవన ప్రమాణాలు పెరుగుదల ఆనందం కలిగిస్తోందన్నారు హరీష్‌రావు. 2౦14-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24, 104 రూపాయలు. నాటి దేశ తలసరి ఆదాయమైన 86, 647 రూపాయలకంటే 43 శాతం ఎక్కువ. 2021-22 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 2, 78, 833 రూపాయలకు పెరిగిందని తెలిపారు. జాతీయ సగటు  ఆదాయం 2, 78, 833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన 1,49, 848 రూపాయల కంటేో 86 శాతం అధికం. జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రోజురోజుకు పెరుగుతోందన్నారు హరీష్‌. 

202-21లో రాష్ట్ర తలసరి ఆదాయం 18.8 శాతం వృద్ధి రేటు సాధించగా, జాతీయ వృద్ధి 18.1 శాతంగా నమోదైంది. 2014-15లో దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ.. 202౦-21 వచ్చే సరికి అగ్రస్థానానికి చేరింది.

దళిత బంధుకు భారీగా నిధుల 

పేదల జీవితాలు మెరుగుపడినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న హరీష్‌.. ఆ దిశగానే తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్పెషల్ ఫోకస్ చేసిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని అనుసంధానం చేసుకొని దేశానికే తలమానికంగా మారమని పేర్కొన్నారు. 

ఏళ్లు గడుస్తున్నా  దళిత జాతి ఇంకా  అణగారిన వర్గంగానే ఉందన్నారు హరీష్‌. గత పాలకులు తీసుకొచ్చిన పథకాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వాలేదన్నారు హరీష్‌. రాజ్యాంగం అందించిన రిజర్వేషన్‌తో కొంతమంది విద్యను, ఉపాధిని పొందగలుగుతున్నా.. ఇంకా దళిత వాడలు పేదరికానికి ఆనవాళ్లుగానే ఉన్నాయని గుర్తు చేశారు. మిగిలిపోయిన మెజార్టీ దళిత జనానికి చేదోడుగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోందని చెప్పారు. 


తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితుల అభి వృద్ధి, సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు హరీష్‌. షెడ్యూల్‌ కులాలు, తెగల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తి  మించి నిధులు కేటాయిస్తున్న సంగతి వివరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఆ నిధులను తర్వాత ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దళితులకు కేటాయించిన నిధులు ఎక్కడ ఎలా ఖర్చు చేశామో ప్రతి సభ్యుడికి ఇచ్చామన్నారు.

ఎన్ని చేస్తున్నప్పటికీ దళితుల ప్రగతి ఇంకా చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్‌రావు. అంబేద్కర్‌ ఆశయాలను స్ఫూర్తితో దళిత జాతి ప్రగతి కోసం దళిత బంధు అనే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు హరీష్. దళిత జాతి అనుభవిస్తున్న పేదరికాన్ని అందమొందించే ఆయుధంగా తెలంగాణ దళిత బంధు ఉపయోగపడుతుందన్నారు. 

దళిత బందు కేవలం పథకమే కాదన్న హరీష్‌, వారి ఆత్మగౌరవమని, అభివృద్ధికి దిక్సూచిగా అభివర్ణించారు. గత ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను బ్యాంకు లింకేజీలు, కొలాటరల్‌ సెక్యూరిటీలతో ముడి పెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదగన్న హరీష్‌, ఎలాంటి ఆటంకాల్లేకుండానే నేరుగా పది లక్షలను వారి అంకౌట్లలో వేస్తున్నామన్నారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదన్నారు. 

దళిత బంధు పథకం ద్వారా మార్చి నెలాఖరు నాటికి 4వేల కోట్ల రూపాయలతో దాదాపు 40వేల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుందన్నారు హరీష్‌. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంతోపాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారగొండ మండలాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11, 800 కుటుంబాలను దళిత బంధు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణించింది. దశళ వారీగా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు దళిత బంధు ప్రయోజనాలు అందివ్వడం ప్రభుత్వ లక్ష్యం. 

2022-23 వార్షిక బడ్జెట్‌లో దళిత బంధు పథకం కోసం 17, 700 కోట్ల రూపాయలను హరీష్‌ రావు ప్రతిపాదించారు. 

దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైనప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోకుండా దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకంలో రిజర్వేషన్ తీసుకొచ్చి దళితులకు ప్రాధాన్యత ఇచ్చామంది ప్రభుత్వం. ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకునే వైన్‌షాపులు, బార్‌షాపులు, వివిధ రకాల కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget