Budget 2025: పాకిస్థాన్ ప్రధాని సమర్పించిన భారతదేశ బడ్జెట్ - 'పేదల బడ్జెట్'గా ఖ్యాతి
Union Budget 2025: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్ సమర్పిస్తారు.

India's Poor Man Budget And First Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget sessions of Parliament 2025) ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 2025 ఫిబ్రవరి 01న, 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం దేశ సాధారణ బడ్జెట్ (Budget For FY 2025-26) సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ కోసం సామాన్యులు, సంపన్నులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, వృద్ధులు.. ఇలా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే, భారతదేశ బడ్జెట్ చారిత్రాత్మక సందర్భంలో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ను గుర్తు చేసుకుందాం. విచిత్రం ఏంటంటే.. ఈ బడ్జెట్‌ను పాకిస్థాన్ మొదటి ప్రధానమంత్రి అయిన లియాఖత్ అలీ ఖాన్ (Liaquat Ali Khan) సమర్పించారు.
భారతదేశ తొలి బడ్జెట్
భారతదేశపు మొట్టమొదటి బడ్జెట్‌ను, ఆంగ్లేయుల పరిపాలన కాలంలో, జేమ్స్ విల్సన్ 18 ఫిబ్రవరి 1860న సమర్పించారు. ఆ తరువాత, భారత స్వాతంత్ర్య పోరాటం చిట్టచివరి దశకు చేరుకున్న సమయంలో, భారతదేశంలో కాంగ్రెస్ & ముస్లిం లీగ్ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు, భారతీయుల నాయకత్వంలోనూ బడ్జెట్ సమర్పించడం ప్రారంభమైంది. అప్పుడే లియాఖత్ అలీ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. లియాఖత్ అలీ ఖాన్, మధ్యంతర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, 02 ఫిబ్రవరి 1946న భారత బడ్జెట్ సమర్పించారు.
మరో ఆసక్తికర కథనం: బండి కదలాలంటే బడ్జెట్ బూస్ట్ కావాలి - ఆటోమొబైల్ సెక్టార్ కోర్కెల లిస్ట్ ఇదీ
పేదల బడ్జెట్‌గా ప్రఖ్యాతి
లియాఖత్ అలీ ఖాన్ బడ్జెట్‌ను 'పేదల బడ్జెట్' (Budget of the poor) అని చరిత్ర గుర్తు పెట్టుకుంది. ఈ బడ్జెట్‌లో పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను లియాఖత్ అలీ ఖాన్ ప్రకటించారు. తన దృష్టి సమాజంలోని బడుగు బలహీన వర్గాల పైన ఉందని, తన బడ్జెట్ ద్వారా పేదల ప్రగతికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి.. దేశం స్వాతంత్ర్య పోరాటం విజయం వైపు పయనిస్తున్న సమయంలో, బ్రిటిష్ పాలన అంతం అయ్యే సమయం ఆసన్నమైనప్పుడు, భారతదేశం ఆర్థికంగా కష్టకాలంలో ఉంది. ఆ సమయంలో, లియాఖత్ అలీ ఖాన్ పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పేదల బడ్జెట్ సమర్పించారు.
ఆర్థిక మంత్రిగా లియాఖత్ అలీ ఖాన్ పదవీకాలం చాలా తక్కువ వ్యవధిలో ముగిసింది. దేశ విభజన తర్వాత, ఆయన పాకిస్థాన్‌లో భాగం అయ్యారు, పాకిస్థాన్ మొదటి ప్రధాన మంత్రి (First Prime Minister of Pakistan) అయ్యారు. అయినప్పటికీ, లియాఖత్ అలీ ఖాన్ సమర్పించిన బడ్జెట్ భారత రాజకీయ, ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మిగిలిపోయింది. అతని అభిప్రాయాలు & విధానాలు ఆనాటి పేద వర్గానికి ప్రతీకలుగా & ప్రేరణగా నిలిచాయి.
మరో ఆసక్తికర కథనం: పొలాల్లో బంగారం పండేలా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు! - వ్యవసాయ బడ్జెట్ అంచనాలివి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

