(Source: ECI/ABP News/ABP Majha)
Interim Budget 2024: 'ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితం' - బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
Union Budget 2024: రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కింద ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ మేరకు బడ్జెట్ - 2024 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు.
Nirmala Sitharaman Budget 2024 LIVE: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే, సమ్మిళిత వృద్ధికి దారితీసే ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ - 2024 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. ఆర్థిక విధానాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. 3 కోట్ల ఇళ్లు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తయిందని, వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కింద ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు.
'జన్ ధన్ ఖాతాల్లో డబ్బుతో రూ .2.7 లక్షల కోట్లు ఆదా'
జన్ ధన్ ఖాతాల్లో డబ్బు వేయడం ద్వారా రూ.2.7 లక్షల కోట్లు ఆదా అయ్యాయని, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అత్యున్నత స్థాయిలో ఉందని, ఇదిదేశానికి కొత్త దిశను, కొత్త ఆశలను ఇచ్చిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశ ఆర్థిక పురోగతిలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, వర్గాలు సమిష్టిగా లబ్ధి పొందేలా మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్థిక రంగాన్ని మరింత పటిష్ఠం చేసి, మరింత సులభంగా ఆపరేట్ చేయగలుగుతున్నాం. దేశ ద్రవ్యోల్బణంతో ఎదుర్కొన్న కఠిన సవాళ్లను అధిగమించి ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టాయి.