News
News
X

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్: మంత్రి హరీష్ రావు

తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతుంటే... ఒక్క రూపాయి కూడా రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తోందన్నారు హరీష్‌రావు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలిపారు. సంక్షేమానికి అభివృద్ధి రెండు జొడేద్దులుగా సమపాళ్లలో బడ్జెట్‌ కూర్పు ఉండబోతోందన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతుంటే... ఒక్క రూపాయి కూడా రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తోందన్నారు హరీష్‌రావు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోందని అభిప్రాయపడ్డారు. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచిందన్నారు. సభలో నేను, మండలి లో ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ ప్రవేశ పెడుతారన్నారు. బడ్జెట్ నిన్న కేబినేట్ ఆమోదంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించిందన్నారు. 

జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయానికి మంత్రి హరీష్‌ రావు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న వేళ ఆ బడ్జెట్ కాపీలను తీసుకెళ్లి దేవుడి సన్నిధిలో పెట్టారు. 

మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. అందుకే ఈసారి ప్రవేశ పెట్టే బడ్జెట్‌ వాటిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఈసారి బడ్జెట్‌ 3 లక్షల కోట్లకు పైగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. రుణ మాఫీకి కూడా భారీగా నిధులు ఇస్తున్నట్టు సమాచారం. 

కేంద్రం పన్నుల వాటా తగ్గిపోతున్న వేళ సొంతంగా నిధులు వేటను సాగిస్తోంది ప్రభుత్వం. భూముల అమ్మకాలు, పన్నుల పెంపు ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల్లో తెలంగాణ వాటా   2.10 శాతం. ఈ ప్రకారం రూ.21,470 కోట్లు తెలంగాణకు వస్తాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు.. ఇతర గ్రాంట్స్ కూడా కలిపి రాష్ట్రానికి రూ.38 వేల కోట్లు మాత్రమే  అందనున్నాయి. అప్పుల పరిమితిపై కూడా కేంద్రం నియంత్రణ విధించనుంది. ఈ ఏడాది కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులను కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిబంధనల ప్రకారం రావాల్సిన అప్పులను కూడా నియంత్రించడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే.. బడ్జెట్‌లో ఎంత మేర అప్పులను లక్ష్యంగా పెట్టుకున్నా.. వాటి లక్ష్యం మేర బహిరంగ మార్కెట్ రుణాలను సాధించుకోవడం అంత తేలిక కాదు. 

స్వల్పంగా వివిధ రకాల పన్నుల పెంపు ఉండే చాన్స్ ! 

భూముల అమ్మకంపై ఎక్కువ ఆశలు ! 

హైదరాబాద్ శివార్లలో భూములను వేలం వేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకుంది.  ఈ సారి జిల్లాల్లో కూడా భూములు వేలం వేయాలన్న ఆలోచన చేస్తోంది.  నిరుపయోగ భూములు 32 జిల్లాల్లో గుర్తిం చిన వివరాల సేకరణ, అమ్మకం, రాజీవ్‌ స్వగృహ ఇండ్లు, కార్పొ రేషన్‌ పరిధిలోని భూముల అమ్మకం, దిల్‌కు సంబంధించిన భూములపై ఉన్న కేసును పరిష్కరించుకుని వీటి విక్రయాలు నిర్వహించి ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.  తెలిసింది. అదేవిధంగా పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలు, వన్‌టైం సెటిల్‌మెంట్లకు ఉన్న అవకాశాలు, కేంద్రం వద్ద ఉన్న బకాయిలను వసూలు చేసుకునే అవకాశాలతో బడ్జెట్‌లో అంచనాలను ప్రతిపాదించనున్నట్లుగా తెలుస్తోంది. 

Published at : 06 Feb 2023 09:16 AM (IST) Tags: Telangana Budget Telangana Budget 2023 FM T Harish Rao Speech Budget for Schemes

సంబంధిత కథనాలు

AP Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట, దేనికెంత కేటాయించారంటే?

AP Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట, దేనికెంత కేటాయించారంటే?

2 లక్షల 79 వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌- రెవెన్యూ లోటు 22,316 కోట్లుగా పేర్కొన్న బుగ్గన

2 లక్షల  79  వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌- రెవెన్యూ లోటు  22,316 కోట్లుగా పేర్కొన్న బుగ్గన

బడ్జెట్‌ 2023-24కు ఏపీ కేబినెట్ ఆమోదం- అన్ని వర్గాలకు, అభివృద్ధికి ప్రాధాన్యత ఉంటుందన్న బుగ్గన

బడ్జెట్‌ 2023-24కు ఏపీ కేబినెట్ ఆమోదం- అన్ని వర్గాలకు, అభివృద్ధికి ప్రాధాన్యత ఉంటుందన్న బుగ్గన

PM Modi: ప్రైవేటు కంపెనీలకు ఈ రంగం ఒక బంగారు గని - ప్రధాని మోదీ

PM Modi: ప్రైవేటు కంపెనీలకు ఈ రంగం ఒక బంగారు గని - ప్రధాని మోదీ

Mahila Samman Saving Certificate: మహిళలకు మరో కొత్త పథకం! రెండేళ్లే డిపాజిట్‌ 7.5% వడ్డీ - ఈ తేదీ నుంచే స్టార్ట్‌!

Mahila Samman Saving Certificate: మహిళలకు మరో కొత్త పథకం! రెండేళ్లే డిపాజిట్‌ 7.5% వడ్డీ - ఈ తేదీ నుంచే స్టార్ట్‌!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !