Union Budget 2024: బడ్జెట్ ఎఫెక్ట్, భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు - ఇప్పుడు ధరెంతంటే?
Gold And Silver Prices Fall: కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో వీటి ధరలు భారీగా తగ్గాయి.
Gold and Silver Prices Today: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. 6% మేర పన్ను కోత విధిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు రూ.4 వేల వరకూ ధర తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మారిన పన్ను ప్రకారం చూస్తే Multi Commodity Exchangeలో 10 గ్రాముల బంగారం ధర రూ.72,838 నుంచి రూ.68,500కి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2,397.13 డాలర్లుగా ఉంది. ఇక వెండి ధరలూ భారీగానే తగ్గాయి. Multi Commodity Exchangeలో కిలో వెండి ధర రూ.88.995 ఉండగా కేంద్రం పన్ను తగ్గించిన తరవాత రూ.84,275 కి పడిపోయింది. బులియన్ మార్కెట్‌లో ఇది సానుకూల ప్రభావం చూపిస్తోందని కొందరు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పటి వరకూ బంగారం, వెండి, ప్లాటినంపై 16% మేర కస్టమ్స్ సుంకం వసూలు చేశారు. కానీ...ఈసారి బడ్జెట్‌లో ఈ ట్యాక్స్‌ని ఏకంగా 6% కి తగ్గించారు.
Basic Customs Duty ని 10% నుంచి 5% కి, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్‌ని 5% నుంచి 1%కి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. అయితే..ఈ ధరలు తగ్గడం వల్ల దేశీయంగా బంగారం, వెండికి విపరీతంగా డిమాండ్ పెరిగే అవకాశముంది. ఎప్పుడెప్పుడు బంగారం ధర తగ్గుతుందా అని ఎదురు చూసిన వాళ్లకి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. ఈ నిర్ణయం వల్ల వెంటనే మార్కెట్‌పైనా సానుకూల ప్రభావం కనిపించింది. ఇన్వెస్టర్లకూ ఊరట లభించింది. పెద్ద ఎత్తున ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. Sovereign Gold Bonds లాంటి డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లకూ మొగ్గు చూపిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇటు పసిడి ప్రియులతో పాటు అటు మార్కెట్‌కీ ఈ నిర్ణయం మంచి జోష్ ఇచ్చింది.