News
News
X

Budget 2023-24: ప్రీ-బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్‌ సమావేశాలు, హాజరుకాని మంత్రి హరీష్ రావు!

Budget 2023-24: 2023-24 కేంద్ర బడ్జెట్ కు నిర్మలా సీతారామ్ కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

FOLLOW US: 
Share:

Budget 2023-24: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2023-24 కసరత్తు ప్రారంభమైంది. దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమావేశం జరుగుతోంది. 2024లో లోక్ సభ ఎన్నికలు జరుగనుండటంతో.. వచ్చే ఏడాది ప్రవేశ పెట్టే బడ్జెట్‌కు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పుల వంటి ఎన్నో అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ దిశగా నిర్మలా సీతారామన్ చర్చలు జరపుతున్నారు. ఇప్పటికే ఆమె పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ నిపుణులతో వర్చువల్ పద్ధతిలో మీటింగ్ లు జరిపారు. వాణిజ్య, వైద్య, విద్య, నీరు, పారిశుద్ధ్యం, తదితర రంగాల ప్రతినిథులతో సమావేశాలు జరిపారు. అంతే కాదు వాణిజ్య సంఘాలు, ఆర్థిక నిపుణులతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. 

మంత్రి హరీష్ రావు డుమ్మా! 

ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. అటు ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశానికి హాజరు కాగా.. తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మాత్రం బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది. సీఎం కేసీఆర్ ఏకంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంతో హరీష్ రావు బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర  ప్రభుత్వం  తెలంగాణపై  అమలు చేసిన ఆంక్షల కారణంగా సుమారు  40వేల కోట్లకు పైగా రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోయిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ తీసుకువచ్చిన ఆంక్షల కారణంగా ఈ పరిస్థితి నెలకొందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఎఫ్ఆర్‌బీఎం పరిమితిపై కోత విధించడం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల మేరకు నిధులు తగ్గాయి.  

కేంద్ర ఆంక్షలతో తెలంగాణకు ఆర్థిక కష్టాలు 

ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని రాష్ట్రాలు 0.5  శాతం నిధుల సేకరించవచ్చని కేంద్రం తెలిపింది. అయితే ఈ విషయమై కేంద్ర  ప్రభుత్వం విధించిన  ఆంక్షల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.6వేల  కోట్లను  నష్టపోయింది. అయితే దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదల వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. వాటిని పరిష్కరించే దిశగా వచ్చే ఏడాది బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. వీరందరి నుంచి సలహా- సూచనలు అందుకుని.. వాటన్నిటినీ క్రోడీకరించుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంటులో 2023- 24 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

జీఎస్టీ పరిహారం విడుదల 

రెండు తెలుగు రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార నిధులు కేంద్రం ఎట్టకేలకు విడుదల చేసింది. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం నిధులను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ కు రూ.682 కోట్లు విడుదల చేయగా, తెలంగాణకు రూ.542 కోట్లు విడుదల చేసింది. అయితే కేంద్రం ఆంక్షల కారణంగా తెలంగాణ రూ.40 వేల కోట్లు నష్టపోయిందని సీఎం కేసీఆర్ ఆరోపిస్తున్నారు. బీజేపీతో టీఆర్ఎస్ సంబంధాలు తెగతెంపులు అయ్యాక తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు విధించడం మొదలుపెట్టారని కేంద్రంపై తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. 

Published at : 25 Nov 2022 08:56 PM (IST) Tags: Nirmala Sitharaman Minsiter Harish Rao Budget 2023 Finance ministers

సంబంధిత కథనాలు

Stocks to watch 07 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - కొంప ముంచిన Tata Steel

Stocks to watch 07 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - కొంప ముంచిన Tata Steel

Petrol-Diesel Price 07 February 2023: జేబు గుల్ల చేస్తున్న పెట్రోల్‌ ధరలు, తిరుపతిలో మరీ దారుణం

Petrol-Diesel Price 07 February 2023: జేబు గుల్ల చేస్తున్న పెట్రోల్‌ ధరలు, తిరుపతిలో మరీ దారుణం

Gold-Silver Price 07 February 2023: బంగారం పైకి, వెండి కిందకు - ఇవాళ్టి రేటు ఇది

Gold-Silver Price 07 February 2023: బంగారం పైకి, వెండి కిందకు - ఇవాళ్టి రేటు ఇది

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్‌లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!

Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్‌లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!