By: ABP Desam | Updated at : 23 Dec 2022 03:26 PM (IST)
Edited By: Arunmali
కేవలం 3 రోజుల్లో 61% పెరిగిన PSU ఫార్మా స్టాక్
BIBC Shares: ఇవాళ్టి (శుక్రవారం, 23 డిసెంబర్ 2022) ఇంట్రా డే నష్టాల్లోనూ, భారీ వాల్యూమ్‌ల మధ్య భారత్ ఇమ్యునోలాజికల్స్ & బయోలాజికల్స్ కార్పొరేషన్ (Bharat Immunologicals & Biologicals Corporation) షేర్లు 20 శాతం పెరిగాయి. BSEలో రూ. 44.85 వద్ద అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి.
ఇవాళ్టి ఇంట్రా డే ట్రేడ్‌లో మధ్యాహ్నం 12 గంటల సమయానికి, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ మొత్తం ఫ్లోటింగ్ ఈక్విటీలో 3.2 శాతానికి సమానమైన దాదాపు 1.4 మిలియన్ (14 లక్షలు) షేర్లు చేతులు మారాయి. ఇదే సమయానికి BSEలో 3,15,728 షేర్ల కొనుగోలు ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పోలిస్తే.. అదే సమయానికి S&P BSE సెన్సెక్స్ 1.1 శాతం క్షీణించి 60,159 వద్ద ఉంది.
3 రోజుల్లో 61% జంప్
గత మూడు రోజుల నష్టాల మార్కెట్‌లోనూ భారత్ ఇమ్యునోలాజికల్స్ & బయోలాజికల్స్ కార్పొరేషన్ షేర్లు ఏదురీది, ఇన్వెస్టర్లకు లాభాలు కురిపించాయి. ఈ మూడు ట్రేడింగ్ రోజుల్లో, డిసెంబర్ 20వ తేదీన ఉన్న రూ. 27.85 స్థాయి నుంచి స్టాక్ ధర ఇప్పటి వరకు 61 శాతం పెరిగింది. నవంబర్ 18వ తేదీన తాకిన రూ. 21 నుంచి రెట్టింపునకు పైగా (114 శాతం) ర్యాలీ చేసింది.
సెప్టెంబర్ 30, 2022 నాటికి... భారత్ ఇమ్యునోలాజికల్స్ & బయోలాజికల్స్ కార్పొరేషన్‌లో భారత ప్రభుత్వానికి 59.25 శాతం వాటా ఉంది.
ఓరల్ పోలియో వ్యాక్సిన్, జింక్ మాత్రలు, డయేరియా మేనేజ్‌మెంట్ కిట్స్, BIB స్వీట్ ట్యాబ్లెట్లను ఈ కంపెనీ తయారీ చేస్తుంది.
కంపెనీ భవిష్యత్ దృక్పథాన్ని భారత్ ఇమ్యునోలాజికల్స్ & బయోలాజికల్స్ కార్పొరేషన్ మేనేజ్‌మెంట్ FY22 వార్షిక నివేదికలో వివరించింది. కంపెనీ డైవర్సిఫికేషన్ మోడ్‌లో ఉందని, నోటి కలరా వ్యాక్సిన్ తయారీ ఫ్లాంటు నిర్మాణం సంపూర్ణ వేగంతో కొనసాగుతోందని పేర్కొంది. భారత దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ (కొవాగ్జిన్) ఉత్పత్తిని పెంచడానికి కూడా ఈ కంపెనీకి అనుమతి ఉంది.
చైనా, అమెరికా సహా కొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, BF 7 వేరియంట్ కలవర పెడుతుండడం, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం, కరోనా విషయంలో స్వయంగా ప్రధాన మంత్రి ప్రకటన చేయడం వంటి పరిణామాల నేపథంలో, ఈ స్టాక్ మీద ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 33 శాతం పడిపోయిన భారత్ ఇమ్యునోలాజికల్స్ షేర్ ధర, గత మూడు రోజుల స్పైక్‌తో బాగానే రికవర్ అయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Stock Market News: చారిత్రక పతనం నుంచి కోలుకున్న అదానీ షేర్లు - సెన్సెక్స్ 909, నిఫ్టీ 243 ప్లస్సు!
Fitch Ratings: జీవదానం చేసిన ఫిచ్ రేటింగ్స్ - కోలుకున్న అదానీ ఎంటర్ప్రైజెస్
3C Budget Stocks: స్టాక్ మార్కెట్లో మార్మోగుతున్న 3C మంత్రం, ఇప్పుడిదే ట్రెండ్
Cryptocurrency Prices: ఒక్కసారిగా క్రిప్టో మార్కెట్ల పతనం - భారీగా పడ్డ బిట్‌కాయిన్!
Home Tax benefits: నిర్మాణంలో ఉన్న ఇంటిని కొని EMIలు కడుతుంటే, పన్ను మినహాయింపు వర్తిస్తుందా?
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?