Income Tax: ఆదాయంలో 50% పన్ను కట్టేందుకే 12 గంటలు పనిచేస్తున్నా!!
Income Tax: తమ జీతంలో 50 శాతం వరకు ఆదాయపన్ను చెల్లించేందుకే సరిపోతోందని కొందరు చిరాకు పడుతున్నారు. దీనిపై ఫ్లిఫ్‌కార్ట్‌కు చెందిన ఓ ఉద్యోగి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Income Tax:
ఐటీఆర్ ఫైలింగ్‌లో టీమ్‌ఇండియా రికార్డులు సృష్టిస్తోంది. పన్ను చెల్లింపుదారులు ఈసారి వేగంగా ఫైలింగ్ చేస్తున్నారు. అయితే మరోవైపు కొందరు తమ జీతంలో 50 శాతం వరకు ఆదాయపన్ను చెల్లించేందుకే సరిపోతోందని చిరాకు పడుతున్నారు. దీనిపై ఫ్లిఫ్‌కార్ట్‌కు చెందిన ఓ ఉద్యోగి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
'ఈ రోజు నేను రూ.5000 సంపాదించాను. ఇందులో 30 శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. మిగిలిన డబ్బుతో కెఫిన్ కలిపిన పానీయాలు కొనుగోలు చేద్దామని అనుకున్నాను. కానీ అందుకోసం 28 శాతం పన్ను చెల్లించాలి' అని సంచిత్ గోయల్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. బెంగళూరులోని ఈ-టెయిలర్ కంపెనీలో అతడు కేటగిరీ మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు తెలిపింది. 'నా మొత్తం ఆదాయంలో 50 శాతం వరకు ప్రభుత్వానికి పన్ను చెల్లించేందుకే రోజూ 12 గంటలకు పైగా పనిచేస్తున్నట్టు నాకర్థమైంది' అని అతడి లింక్డ్‌ఇన్ బయోలో పెట్టుకున్నాడు.
Today I earned Rs 5000.
— Sanchit Goyal (@sanchitg14) July 15, 2023
I had to give 30% to the Government as tax.
I thought of buying some caffeinated beverages from the remaining money & had to give 28% as tax.
I realized I am working 12 hrs a day just to pay 50%+ of my income to the Government. #IncomeTax
ఇరవై రూపాయల చాక్లెట్ల పైనా ప్రభుత్వానికి 27.5 శాతం వరకు జీఎస్టీ వస్తోందని సంచిత్ అంటున్నాడు. '20 రూపాయల చాకోబార్‌పై ప్రభుత్వానికి వచ్చే సంపాదన. కస్టమర్ నుంచి 18 శాతం అంటే రూ.3.6 వరకు జీఎస్టీ వసూలు చేస్తుంది. చక్కెరపై 18 శాతం జీఎస్టీ అంటే 36 పైసలు, కోకోపై 18 శాతం జీఎస్టీ అంటే 90 పైసలు, పాలపై 12 శాతం జీఎస్టీ అంటే 60 పైసలు, క్రీమ్‌పై ఐదు శాతం అంటే పది పైసలు జీఎస్టీ ఉంటుంది. చివరకు ఒక్కో చాకోబార్‌పై 27.5 శాతం అంటే రూ.5.5 వరకు ప్రభుత్వానికి జీఎస్టీ వస్తోంది' అని సంచిత్ మరో ట్వీట్ చేశాడు.
సంచిత్ ఆదాయం ఎంతో ట్వీట్‌లో చెప్పలేదు. అతడి సంపాదన, ఏ పన్ను శ్లాబ్‌లోకి వస్తారో వివరించలేదు. కొన్ని రోజులుగా చాలామంది ఆదాయపన్నుపై ఇలాంటి ట్వీట్లను వైరల్ చేస్తున్నారు. మొత్తంగా అతడి ట్వీట్‌కు ఐదు లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. 'మౌలిక సదుపాయాల కల్పనకు కాకుండా వసూలు చేస్తున్న పన్నుల్లో ఎక్కువ భాగం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, అక్కర్లేని ఉచిత హామీలకు వెళ్తుందని తెలిస్తే మీ రక్తం కచ్చితంగా ఉడుకుతుంది' అని సతీశ్ రెడ్డి అనే వ్యక్తి అతడికి బదులు ఇచ్చాడు.
Tax earned by Government on Rs 20 choco-bar:
— Sanchit Goyal (@sanchitg14) July 18, 2023
18% GST by end customer - Rs 3.6
Calculated on unit economics-
18% on Sugar - Rs 0.36
18% on Cocoa - Rs 0.9
12% on Condensed Milk - Rs 0.6
5% on Cream - 0.1
Total #GST earned - Rs 5.5 which is close to 27.5% of the final cost.#tax
'కేసినోలో ఆడితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది' అని రమణ అనే వ్యక్తి ట్వీట్ చేయగా 'నాకు తెలుసు. రిస్క్ మొత్తం నాదే అయినా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. ప్రభుత్వం ఏమైనా నా రిస్క్‌లో భాగం పంచుకుంటుందా? గెలిస్తే పన్ను కట్టాలి. ఓడితే మొత్తం నాకే నష్టం' అని సంజయ్ బదులిచ్చాడు. ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: ఆషాఢంలో వెండి రికార్డు! ఇక శ్రావణంలో కిలో రూ.85,000 చేరడం పక్కా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial