By: ABP Desam | Updated at : 28 Sep 2023 09:35 AM (IST)
అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు
Bank Holidays list in October 2023: మన దేశంలో ఫెస్టివల్ సీజన్ ప్రారంభం అయింది. అక్టోబర్ నెలలో గాంధీ జయంతి, దసరా వంటి ముఖ్యమైన జాతీయ సందర్భాలు, ప్రధాన పండుగలు ఉన్నాయి. కాబట్టి, ఆ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్, సహకార బ్యాంకులకు కూడా హాలిడేస్ ఉన్నాయి. వచ్చే నెలలో మీకు బ్యాంక్‌లో మీకు ఏ పని ఉన్నా బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ సేవ్ చేసుకోండి, ఆ లిస్ట్ ప్రకారం మీ పనిని ప్లాన్ చేసుకోండి.
అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవులు 1వ తేదీన ఆదివారంతో మొదలై 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతితో ముగుస్తాయి. బ్యాంకు సెలవులు ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ కస్టమర్ల కోసం, ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఆ లిస్ట్‌లో ఉంటాయి.
2023 అక్టోబర్ నెలలో బ్యాంకుల సెలవు రోజులు:
1 అక్టోబర్ 2023- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
2 అక్టోబర్ 2023- గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
8 అక్టోబర్ 2023- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
14 అక్టోబర్ 2023- రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులను మూసేస్తారు
15 అక్టోబర్ 2023- ఆదివారం, దేశం మొత్తం బ్యాంకులకు సెలవు
18 అక్టోబర్ 2023- కటి బిహు కారణంగా గువాహతిలో బ్యాంకులు పని చేయవు
21 అక్టోబర్ 2023- దుర్గాపూజ/మహా సప్తమి కారణంగా అగర్తల, గువాహతి, ఇంఫాల్, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు
22 అక్టోబర్ 2023- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
24 అక్టోబర్ 2023- దసరా, హైదరాబాద్, ఇంఫాల్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
25 అక్టోబర్ 2023- దుర్గాపూజ (దసాయి) కారణంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులను మూసివేస్తారు
26 అక్టోబరు 2023- దుర్గాపూజ (దసాయి)/ప్రవేశ దినం గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్‌లలో బ్యాంకులు పని చేయవు
27 అక్టోబర్ 2023- దుర్గాపూజ (దసాయి) రోజున గాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు
28 అక్టోబర్ 2023- నాలుగో శనివారం, దేశం మొత్తం బ్యాంకులకు సెలవు
29 అక్టోబర్ 2023- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
31 అక్టోబర్ 2023- సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని బ్యాంకులకు సెలవు
బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్ అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్'. ఏ బ్యాంక్ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPIని ఉపయోగించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!
EV Range Tips: ఎలక్ట్రిక్ కారు రేంజ్ పెంచాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
LIC Policy: ఆడపిల్ల పెళ్లి కోసం దిగులొద్దు, ఈ పాలసీ తీసుకుంటే ఎల్ఐసీ మీకు రూ.31 లక్షలు ఇస్తుంది!
Tax Notice: ఇల్లు కొన్నాక 20 శాతం TDS కట్టమంటూ నోటీస్ వచ్చిందా, తప్పు ఎక్కడ జరిగిందో అర్ధమైందా?
Coca Cola Liquor: కోకా కోలా నుంచి మొదటి లిక్కర్ బ్రాండ్ - రేటెంత, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
TSPSC Chairman Resigns: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
/body>