News
News
వీడియోలు ఆటలు
X

Bank Holidays in May 2023: వచ్చే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు, హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో

2023 మే నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Bank Holidays list in May: 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండో నెల అయిన మే మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుంది. నెల ప్రారంభానికి ముందే, "మే నెలలో బ్యాంకులకు సెలవుల జాబితా"ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. 

సామాన్యుల జీవితంలో బ్యాంకులు అంతర్భాగం. డబ్బు లావాదేవీలు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు స్వీకరించడం, చెక్కులు డిపాజిట్ చేయడం వంటి చాలా పనులకు బ్యాంకులు అవసరం. బ్యాంకులకు సెలవు వస్తే ఖాతాదార్ల ముఖ్యమైన పనులు నిలిచిపోతాయి. మీకు కూడా మే నెలలో కొన్ని ముఖ్యమైన బ్యాంక్‌ పనులు ఉంటే, ఈ సెలవుల జాబితాను (May Bank Holiday List) గుర్తు పెట్టుకోండి. ఇలా చేస్తే.. సెలవు రోజున బ్యాంకుకు వెళ్లి, మూసేసిన గేటును చూసి ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిన అవసరం ఉండదు.

మే నెలలో బ్యాంకులు మూతబడే రోజుల సంఖ్య
2023 మే నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల కారణంగా వచ్చే సెలవులు కూడా కలిసి ఉన్నాయి. మే నెలలో.. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం, బుద్ధ పూర్ణిమ, మహారాణా ప్రతాప్ జయంతి వంటి కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. బ్యాంకు సెలవుల జాబితా ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంది. 

2023 మే నెలలో బ్యాంకులకు సెలవు రోజులు:

మే 1, 2023- మహారాష్ట్ర అవతరణ దినోత్సవం/మే డే సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పుర్, పనాజీ, పాట్నా, త్రివేండ్రంలలో బ్యాంకులను మూసివేస్తారు
మే 5, 2023- బుద్ధ పూర్ణిమ కారణంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, ముంబై, నాగ్‌పుర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులు పని చేయవు
మే 7, 2023- ఆదివారం కారణంగా, దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
మే 9, 2023- రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కారణంగా కోల్‌కతాలో బ్యాంకులు మూసివేసి కనిపిస్తాయి
మే 13, 2023- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మే 14, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మే 16, 2023- సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులు పని చేయవు
మే 21, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మే 22, 2023- మహారాణా ప్రతాప్ జయంతి కారణంగా సిమ్లాలో బ్యాంకులను హాలిడే
మే 24, 2023- కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలోని బ్యాంకులు పని చేయవు
మే 27, 2023- నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మే 28, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. అయితే, బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా చేయవలసి వస్తే ATMని ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

Published at : 26 Apr 2023 12:40 PM (IST) Tags: Bank holidays Bank Holiday list May 2023

సంబంధిత కథనాలు

Brand Value: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌ TCS, సెకండ్‌ ప్లేస్‌లో రిలయన్స్‌

Brand Value: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌ TCS, సెకండ్‌ ప్లేస్‌లో రిలయన్స్‌

GDP: భారత్‌ ఒక సూపర్‌ ఎకానమీ, అంచనాలను మించి 7.2% వృద్ధి రేటు

GDP: భారత్‌ ఒక సూపర్‌ ఎకానమీ, అంచనాలను మించి 7.2% వృద్ధి రేటు

Top 10 Headlines Today: బాలినేనితో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌

Top 10 Headlines Today: బాలినేనితో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌

Stocks Watch Today, 01 June 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Coal India, HDFC Life

Stocks Watch Today, 01 June 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Coal India, HDFC Life

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ