అన్వేషించండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంక్‌లకు సెలవులు - లిస్ట్‌ ఇదిగో

ఏప్రిల్ నెలలో.. మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి మొదలైన అనేక పర్వదినాలు, జయంతులు ఉన్నాయి.

Bank Holidays list in April: ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. నూతన ఆర్థిక సంవత్సరం (FY 2023-24) ప్రారంభంతో పాటే, ప్రజల జీవితాలు & జేబుల మీద ప్రత్యక్ష ప్రభావం చూపే అనేక మార్పులు కూడా మొదలవుతాయి. 2023 ఏప్రిల్‌లో బ్యాంకులు సగం రోజులు సెలవుల్లోనే ఉంటాయి. 

ఏప్రిల్‌లో 15 రోజుల పాటు బ్యాంకులు మూత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన లిస్ట్‌ ప్రకారం, 2023 ఏప్రిల్‌లో, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఇందులో వారాంతపు సెలవులు కూడా కలిసి ఉన్నాయి..

బ్యాంకుల సెలవుల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. కాబట్టి, ఖాతాదార్లను ఇబ్బందుల నుంచి రక్షించడానికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. వివిధ పండుగలు, ప్రముఖుల పుట్టిన రోజులు, శని, ఆదివారం సెలవులతో సహా ఏప్రిల్ నెలలో పక్షం రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఏప్రిల్ నెలలో.. మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి మొదలైన అనేక పర్వదినాలు, జయంతులు ఉన్నాయి. 

వచ్చే నెలలో, మీకు బ్యాంకుతో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందే జాగ్రత్త పడండి. ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవుల జాబితాను (Bank Holiday in April 2023) కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఇలా చేస్తే.. సెలవు రోజున బ్యాంకుకు వెళ్లి, మూసేసిన గేటును చూసి ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిన అవసరం ఉండదు.

ఏప్రిల్‌ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా:

ఏప్రిల్ 1, 2023- ఏడాది పాటు కొనసాగిన పద్దులను క్లోజ్‌ చేయాల్సిన అవసరం కారణంగా దేశవ్యాప్తంగా ‍‌(ఐజ్వాల్, షిల్లాంగ్, సిమ్లా, చండీగఢ్ మినహా) బ్యాంకుల గేట్లు మూసేస్తారు. ఆ రోజున బ్యాంకులు పని చేస్తాయి గానీ, ప్రజల లావాదేవీలు జరగవు.
ఏప్రిల్ 2, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 4, 2023- మహావీర్ జయంతి కారణంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీల్లో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 5, 2023- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కారణంగా హైదరాబాద్‌లో బ్యాంకులు మూసివేసి కనిపిస్తాయి.
7 ఏప్రిల్ 2023- గుడ్ ఫ్రైడే కారణంగా, అగర్తల, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
ఏప్రిల్ 8, 2023- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేసి కనిపిస్తాయి.
ఏప్రిల్ 9, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేసి కనిపిస్తాయి.
ఏప్రిల్ 14, 2023- డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కారణంగా, ఐజ్వాల్, భోపాల్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
ఏప్రిల్ 15, 2023- విషు, బోహాగ్ బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తల, గువాహతి, కోచి, కోల్‌కతా, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 16, 2023- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఏప్రిల్ 18, 2023 - షబ్-ఎ-ఖద్ర్ కారణంగా జమ్ము & శ్రీనగర్‌లోని బ్యాంకులను మూసివేస్తారు.
ఏప్రిల్ 21, 2023- ఈద్-ఉల్-ఫితర్ కారణంగా అగర్తల, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులను మూసివేస్తారు.
ఏప్రిల్ 22, 2023- ఈద్, నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 23, 2023- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఏప్రిల్ 30, 2023 – ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. అయితే, బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా చేయవలసి వస్తే ATMని ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Embed widget