Bank Holidays: మార్చిలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు, హాలిడేస్ లిస్ట్ ముందే చూసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్ సెలవులను నిర్ణయిస్తాయి.
Bank Holidays List For March 2024: మార్చి నెల రాకముందే, ఆ నెలలోని బ్యాంక్ సెలవులను గుర్తించడం ముఖ్యం. వచ్చే నెలలో బ్యాంక్‌లు 14 రోజుల పాటు మూసి ఉంటాయి. ఆ 14 రోజుల్లో నేషనల్ పబ్లిక్ హాలిడేస్, కొన్ని ప్రాంతీయ సెలవులు, రెండు & నాలుగు శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్ సెలవులను నిర్ణయిస్తాయి.
మార్చి నెలలో మీకు బ్యాంక్‌లో పని ఉంటే, సెలవు రోజున బ్యాంక్‌కు వెళ్లి మీ సమయం వృథా చేసుకోకుండా, బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ప్రకారం ముందుగానే మీ పనిని ప్లాన్ చేసుకోవడం మంచిది.
2024 మార్చిలో బ్యాంక్ సెలవు రోజులు (Bank Holidays in March 2024):
మార్చి 01 (శుక్రవారం) ------ చాప్చార్ కుట్ ------ మిజోరంలో బ్యాంక్‌లకు సెలవు
మార్చి 03 ------ ఆదివారం ------ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 08 (శుక్రవారం) ------ మహా శివరాత్రి ------ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే
మార్చి 09 ------ రెండో శనివారం ------ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి
మార్చి 10 ------ ఆదివారం ------ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
మార్చి 17 ------ ఆదివారం ------ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 22 (శుక్రవారం) ------ బిహార్ దివస్ ------ బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు
మార్చి 24 ------ ఆదివారం ------ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
మార్చి 25 (సోమవారం) ------ హోలీ ------ కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సెలవు
మార్చి 26 (మంగళవారం) ------ యయోసాంగ్ రెండో రోజు/హోలీ ------ ఒడిశా, మణిపూర్, బీహార్‌లో బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 27 (బుధవారం) ------ హోలీ ------ బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు
మార్చి 29 (శుక్రవారం) ------ గుడ్ ఫ్రైడే ------ త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము & కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సెలవు
మార్చి 30 ------ నాలుగో శనివారం ------ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి
మార్చి 31 ------ ఆదివారం ------ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
బ్యాంక్ సెలవులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు
మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఈ సెలవుల వల్ల బ్యాంక్ సేవల్లో దాదాపుగా అంతరాయం ఉండదు. ఈ డిజిటల్ సర్వీస్‌లు 24 గంటలూ, భారతదేశం అంతటా కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్ ముందుగానే మీకు తెలియజేస్తుంది.
భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: మార్చిలో స్టాక్ మార్కెట్లకు 12 సెలవులు, మూడు సుదీర్ఘ వారాంతాలు