By: ABP Desam | Updated at : 24 Feb 2023 12:54 PM (IST)
Edited By: Arunmali
మార్చి నెలలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు
Bank Holidays March 2023: ఈ సంవత్సరంలో రెండో నెల (ఫిబ్రవరి) ముగియబోతోంది, మార్చి ప్రారంభం కానుంది. దేశ ప్రజలు చాలా ముఖ్యమైన పండుగలను మార్చిలో జరుపుకోబోతున్నారు. కాబట్టి, వచ్చే నెలలో బ్యాంకులకు చాలా సెలవులు రాబోతున్నాయి. మార్చి నెలలో, మీకు బ్యాంకుతో ముడిపడిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందే జాగ్రత్త పడండి. మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితాను (Bank Holiday in March 2023) కచ్చితంగా గుర్తు పెట్టుకోండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన లిస్ట్ ప్రకారం, మార్చి 2023లో, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఇందులో వారాంతపు సెలవులు కూడా కలిసి ఉన్నాయి.
మార్చి నెలలో హోలీ, శ్రీరామనవమి సహా ముఖ్య పండుగలు
హిందు మతానికి సంబంధించిన ముఖ్య పండుగల్లో హోలీ ఒకటి. పేరుకు హిందువుల పండుగ అయినా, అన్ని మతాల వాళ్లు ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా, ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. హోలీతో పాటు చైత్ర నవరాత్రి, తెలుగు కొత్త సంవత్సరం ఉగాది, మళయాళీల పెద్ద వేడుక గుడి పడ్వా, దేశవ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగల్లో ఒకటైన శ్రీ రామనవమి వంటి అనేక పర్వదినాలు మార్చి నెలలో రానున్నాయి. ఈ పండుగల సందర్భంగా... రాష్ట్రాల వారీగా సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. ఈ పర్వదినాలు కాకుండా... వారాంతపు సెలవులైన శని & ఆదివారాలు ఆ నెలలో 6 రోజులు ఉన్నాయి. మార్చి నెలలో ఏ రోజున బ్యాంకులు పని చేస్తాయో, ఏ రోజును సెలవు తీసుకుంటాయో ఇప్పుడు చూద్దాం.
మార్చి 2023లో బ్యాంక్ సెలవుల జాబితా:
మార్చి 03, 2023- చాప్‌చార్ కూట్ సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు
మార్చి 05, 2023 - ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 07, 2023- హోలీ / హోలిక దహన్ / ధులెండి / డోల్ జాత్రా / యాసోంగ్ సందర్భంగా బేలాపూర్, గువాహటి, కాన్పూర్, లక్‌నవూ, హైదరాబాద్, జైపూర్, ముంబై, నాగ్‌పుర్, రాంచీ, పనాజీలో బ్యాంకులను మూసివేస్తారు.
మార్చి 08, 2023 - అగర్తల, అహ్మదాబాద్, గాంగ్‌టక్, ఇంఫాల్, పట్నా, రాయ్‌పుర్, ఐజ్వాల్, భోపాల్, లక్‌నవూ, దిల్లీ, భువనేశ్వర్, చండీఘర్, దెహ్రాదూన్, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, సిమ్లాలో ధూలేటి/ డోల్ జాత్రా/ హోలీ సందర్భంగా బ్యాంకులకు సెలవు
మార్చి 09, 2023- హోలీ సందర్భంగా పట్నాలో మాత్రమే బ్యాంకులు పని చేయవు
మార్చి 11, 2023 - రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 12, 2023 - ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 19, 2023 - ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 22, 2023- గుడి పడ్వా/ ఉగాది/తెలుగు నూతన సంవత్సరం/ బిహార్ దివస్/ తొలి నవరాత్రి సందర్భంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పట్నా, జమ్ము, ముంబైలలో బ్యాంకులు పని చేయవు.
మార్చి 25, 2023 - నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 26, 2023 - ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మార్చి 30, 2023- శ్రీ రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్ అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్'. ఏ బ్యాంక్ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది.
అయితే, బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్ UPI సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా చేయవలసి వస్తే ATMని ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPIని ఉపయోగించవచ్చు.
April Rules: ఏప్రిల్ నుంచి మారే 7 రూల్స్ ఇవి, జేబులోని పర్సు మీదే వీటి కన్ను
UPI Payments: UPI Payments: యూపీఐ వాడితే ఏప్రిల్ 1 నుంచి ఛార్జీ చెల్లించాలి, కాకపోతే?
Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్!
Small Savings: కేవలం కొన్ని గంటలే - పొదుపు పథకాలపై శుభవార్త వినవచ్చు!
Ajay Banga: ప్రపంచ బ్యాంక్ చీఫ్ పదవికి ఏకైక నామినేషన్ - అజయ్ బంగాకు లైన్ క్లియర్
Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన
ట్విటర్ వేదికగా కేటీఆర్-బండి మాటల యుద్ధం- మధ్యలో కాంగ్రెస్ కౌంటర్!
NBK108 Dussehra Release : దసరా బరిలో బాలకృష్ణ సినిమా - రామ్, విజయ్, రవితేజ సినిమాలతో పోటీ
Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్