News
News
X

Bank Employees: బ్యాంక్‌ సిబ్బందికి గుడ్‌ న్యూస్‌, జనానికి బ్యాడ్‌ న్యూస్ - వారానికి 5 రోజులే పని!

ఆ ఒక్కటీ అడక్కు అంటూ ఇంతకాలం తాత్సారం చేసిన 'ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్', ఎట్టకేలకు బ్యాంక్‌ యూనియన్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

FOLLOW US: 
Share:

Bank Employees: ఈ వార్త బ్యాంక్‌ సిబ్బందికి గుడ్‌ న్యూస్‌, జనానికి మాత్రం బ్యాడ్‌ న్యూస్‌. ఎందుకంటే, అన్ని బ్యాంకులు వారంలో ఐదు రోజులే (5-day work week for bank employees) పని చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, బ్యాంకులతో తరచూ పని ఉండే వ్యక్తులు, సంస్థలకు ఇది ఇబ్బందికర పరిస్థితే.

ప్రస్తుతం, నెలలోని ప్రతి ఆదివారంతో పాటు, ఆ నెలలోని రెండో శనివారం, నాలుగో శనివారాల్లో బ్యాంకులు పని చేయడం లేదు.

రెండో శనివారం & నాలుగో శనివారం అంటూ లెక్కలు వద్దు, ఏ వారంలోనైనా ఐదు రోజులు మాత్రమే పని చేస్తామని బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు కొన్ని సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ ఒక్కటీ అడక్కు అంటూ ఇంతకాలం తాత్సారం చేసిన 'ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్' (Indian Banks Association - IBA), ఎట్టకేలకు బ్యాంక్‌ యూనియన్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

షరతులు వర్తిస్తాయట!
ఒకవేళ, వారానికి ఐదు రోజుల పని దినాలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పుకుంటే, ఒక చిన్న మెలిక పెట్టే ఛాన్స్‌ ఉంది. వారంలో రెండో శనివారం, నాలుగో శనివారం సెలవులు పోగా.. ఒకటో శనివారం, మూడో శనివారాల్లో పూర్తి పని గంటల పాటు ఇప్పుడు బ్యాంకులు పని చేస్తున్నాయి. ఒకవేళ వారంలో ఐదు రోజుల పనికి ఒప్పుకుంటే, ఆ పని గంటలు పోతాయి కాబట్టి వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేయవచ్చు. కోల్పోయిన గంటలను భర్తీ చేయడానికి, వారంలో మిగిలిన ఐదు రోజుల్లో, పని గంటలను ప్రతిరోజూ 50 నిమిషాలు పెంచే అవకాశం కనిపిస్తోంది.

"వారానికి ఐదు రోజుల పని డిమాండ్‌ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సానుకూలంగా పరిశీలిస్తోంది" అని 'ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్' (All India Bank Officers Association) జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజన్ ఒక జాతీయ మీడియాకు వెల్లడించారు.

ఐదు రోజుల పని డిమాండ్‌కు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఓకే చెబితే, ఆ తర్వాత ఆ ప్రతిపాదన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుతుంది. అక్కడ కూడా ఆమోదముద్ర పడితే, ఆ తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India - RBI) వద్దకు వెళుతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా ఒప్పుకుంటే, కేంద్ర బ్యాంక్‌ విధించే షరతులకు లోబడి వారానికి ఐదు రోజుల పని విధానం బ్యాంకుల్లో అమలవుతుంది.

గతంలోనూ ఇదే డిమాండ్‌
ఇదే విషయంపై, గత సంవత్సరం, 'ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్' (All-India Bank Employees Association) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఒక లేఖ రాసింది. వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయడానికి రోజువారీ పని గంటలను మరో 30 నిమిషాలు పెంచవచ్చని, ప్రతి రోజూ అదనంగా 30 నిమిషాలు పని చేయడానికి దేశవ్యాప్తంగా బ్యాంక్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆ లేఖలో పేర్కొంది.

దేశాన్ని తీవ్రంగా భయపెట్టిన కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలోనూ బ్యాంక్‌ సిబ్బంది నుంచి ఈ డిమాండ్‌ మరోమారు తెరపైకి వచ్చింది. ప్రజల తాకిడి ఎక్కువగా ఉండే బ్యాంకుల్లో ఎక్కువ రోజులు పని చేస్తే తాము కూడా కొవిడ్‌ బారిన పడతామని, పని రోజులను వారానికి ఐదు రోజులకు పరిమితం చేయాలని అప్పట్లోనూ యూనియన్లు డిమాండ్‌ చేశాయి. కానీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అప్పుడు కూడా ఆ డిమాండ్‌ను తిరస్కరించింది. బ్యాంక్‌ సిబ్బంది పోరాటం, ఎదురుచూపులు ఫలించి ఇప్పుడు ఆ డిమాండ్‌ ఆచరణలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు భిన్నంగా, మహమ్మారి సమయంలో, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (Life Insurance Corporation -  LIC) తన ఉద్యోగులకు వరం ప్రకటించింది. వారంలో ఐదు రోజుల విధానాన్ని LIC అమలు చేసింది.

Published at : 01 Mar 2023 06:25 PM (IST) Tags: Indian Banks' Association Bank Employees 5 Days Work

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.75వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.75వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Stock Market News: ఆఖరి రోజు అదుర్స్‌! రిలయన్స్‌ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్‌

Stock Market News: ఆఖరి రోజు అదుర్స్‌! రిలయన్స్‌ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్‌

April Rules: ఏప్రిల్‌ నుంచి మారే 7 రూల్స్‌ ఇవి, జేబులోని పర్సు మీదే వీటి కన్ను

April Rules: ఏప్రిల్‌ నుంచి మారే 7 రూల్స్‌ ఇవి, జేబులోని పర్సు మీదే వీటి కన్ను

UPI Payments: UPI Payments: యూపీఐ వాడితే ఏప్రిల్‌ 1 నుంచి ఛార్జీ చెల్లించాలి, కాకపోతే?

UPI Payments: UPI Payments: యూపీఐ వాడితే ఏప్రిల్‌ 1 నుంచి ఛార్జీ చెల్లించాలి, కాకపోతే?

Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్‌!

Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్‌!

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి