అన్వేషించండి

Axis Mutual Fund NFO: యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓను ప్రారంభించింది. కనీసం రూ.100తో ఇన్వెస్టిమెంట్ ప్రారంభించనున్న NFO గడువు జూలై 17 తో ముగియనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ కొత్తగా ప్రారంభమైంది.
  • నిఫ్టీ50 స్టాక్స్‌లో సమానంగా పెట్టుబడి పెడుతూ రీబ్యాలెన్స్ చేస్తుంది.
  • ఇది బ్లూ-చిప్ కంపెనీలలో పారదర్శక పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తుంది.
  • సాధారణ నిఫ్టీ కంటే మెరుగైన రాబడులకు ఈ ఫండ్ అనుకూలం.

ముంబై: భారత్‌లో అగ్రగామి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ (Axis Mutual Fund) తమ సరికొత్త సరికొత్త ఫండ్ ఆఫర్ (NFO) 'యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్'ను ఆవిష్కరించింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ స్కీమ్. ఇది నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్‌ను ఫాలో అవుతూ ఒక ప్రత్యేకమైన 'ఈక్వల్-వెయిటెడ్' వ్యూహం ద్వారా నిఫ్టీ 50 లోని భారత అగ్రగామి బ్లూ-చిప్ కంపెనీల వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఇన్వెస్టర్లకు కల్పిస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) 2026 జూలై 3న ప్రారంభం కాగా జూలై 17వ తేదీతో ముగుస్తుంది.

ఈ Axis Nifty50 Equal Weights Index Fund ఫండ్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ టీఆర్ఐకి అనుగుణంగా రాబడులను అందించడం లక్ష్యంగా పని చేస్తుంది. నిబంధనలకు కట్టుబడి ఇండెక్స్‌లోని మొత్తం 50 స్టాక్స్‌లో సమానంగా పెట్టుబడి పెడుతుంది. ఈ కేటాయింపును స్థిరంగా కొనసాగించడం కోసం ప్రతి 3 నెలలకోసారి పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడులు కేవలం కొన్ని కంపెనీల వైపే మొగ్గుచూపకుండా, ప్రతి స్టాక్‌పై సమానమైన ఫోకస్ ఉండేలా చూస్తుంది. ఈ క్రమబద్ధమైన, పారదర్శకమైన విధానం వల్ల ఎలాంటి వ్యక్తిగత అంచనాలకు అవకాశం ఉండదు.

Also Read: EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 

ఈ ఫండ్ లాంచ్ సందర్భంగా యాక్సిస్ ఏఎంసీ ఎండీ అండ్ సీఈఓ బి. గోప్‌కుమార్ మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లకు మరింత బ్యాలెన్స్‌డ్, వైవిధ్యభరితమైన విధానంలో భారత అగ్రగామి బ్లూ-చిప్ కంపెనీలలో భాగస్వామ్యం అయ్యే సరికొత్త అవకాశాన్ని కల్పించాలనేదే తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. సరళత, పారదర్శకతలను కాపాడుకుంటూనే, భిన్నమైన పెట్టుబడి అవసరాలకు ఉపయోగపడే పటిష్టమైన ఫండ్స్‌ను అందించడమే తమ వ్యూహమని స్పష్టం చేశారు. ఇన్వెస్టర్లు తమ ప్రధాన పోర్ట్‌ఫోలియోకు అదనంగా సమర్థవంతమైన మరియు వైవిధ్యభరితమైన ప్యాసివ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో ఇటువంటి విధానాలు దీర్ఘకాలంలో మంచి వాల్యూ ఇస్తాయని తాము నమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు.

నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఎందుకు?

సాధారణ నిఫ్టీ 50 ఫండ్‌లో పెద్ద కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ మాత్రం ఇండెక్స్‌లోని ప్రతి కంపెనీకి ఒకే విధమైన వెయిటేజీని కేటాయిస్తుంది. దీనివల్ల మొత్తం 50 కంపెనీలలో పెట్టుబడులు సరిగ్గా పంపిణీ అయి, కేవలం కొన్ని పెద్ద స్టాక్స్‌పైనే ఆధారపడటాన్ని తగ్గుతుంది. గత డేటా ప్రకారం, ఒకే రకమైన రిస్క్ ఉన్నప్పటికీ, నిఫ్టీ 50 టీఆర్ఐ తో పోలిస్తే నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ టీఆర్ఐ వివిధ సమయాల్లో మెరుగైన రాబడులు అందించింది. ఈక్వల్-వెయిట్ వ్యూహాలపై ఇన్వెస్టర్లలో ఆసక్తి వేగంగా పెరుగుతుండటంతో 2019-20లో సుమారు రూ.100 కోట్లుగా ఉన్న ఈ ప్యాసివ్ స్కీమ్‌ల ఆస్తుల నిర్వహణ (AUM), 2025-26 నాటికి దాదాపు రూ.10,000 కోట్లకు పెరిగింది. 

కనీస పెట్టుబడి ఎంత..

ఈ NFO స్కీమ్‌లో కనీస పెట్టుబడి రూ.100 నుండి ప్రారంభించవచ్చు. తక్కువ మొత్తంలోనూ ఇప్పుడు చేసే ఇన్వెస్ట్ మెంట్ భవిష్యత్తులో మెరుగైన రాబటి అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాట్‌మెంట్ జరిగిన 15 రోజుల్లోపు కనుక విత్‌డ్రా చేసుకున్నా లేదా వేరే ఫండ్‌లోకి మార్చుకుంటే 0.25 శాతం ఛార్జీ ఉంటుంది. 15 రోజుల తర్వాత చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. 

Note: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఏబీపీ దేశం ఎవరికీ పలానా స్టాక్, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని సూచించదు. కనుక ఏదైనా స్టాక్, మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. 

Frequently Asked Questions

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రారంభించిన కొత్త ఫండ్ ఏమిటి?

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ 'యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్' అనే కొత్త NFOను ఆవిష్కరించింది. ఇది నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్‌ను అనుసరించి పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ స్కీమ్.

ఈ ఫండ్ యొక్క పెట్టుబడి వ్యూహం ఏమిటి?

ఈ ఫండ్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్‌ను ఫాలో అవుతూ, ఇండెక్స్‌లోని 50 స్టాక్స్‌లో సమానంగా పెట్టుబడి పెడుతుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం తగ్గించడానికి ప్రతి 3 నెలలకోసారి పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేస్తుంది.

ఈ NFOకు సంబంధించిన పెట్టుబడుల సమయం ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు ముగుస్తుంది?

ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) 2026 జూలై 3న ప్రారంభమై, జూలై 17వ తేదీతో ముగుస్తుంది. ఇందులో కనీసం రూ.100 నుండి పెట్టుబడి ప్రారంభించవచ్చు.

సాధారణ నిఫ్టీ 50 ఫండ్ కంటే ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఎందుకు మంచిది?

నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఇండెక్స్‌లోని ప్రతి కంపెనీకి ఒకే విధమైన వెయిటేజీని కేటాయిస్తుంది. ఇది కొన్ని పెద్ద స్టాక్స్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, వైవిధ్యభరితమైన రాబడులను అందిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Personal Loan Guide: పర్సనల్ లోన్ అర్హత, వడ్డీ రేట్లు, ఈఎంఐ, డాక్యుమెంట్స్, రీపేమెంట్ పూర్తి వివరాలు
పర్సనల్ లోన్ అర్హత, వడ్డీ రేట్లు, ఈఎంఐ, డాక్యుమెంట్స్, రీపేమెంట్ పూర్తి వివరాలు
UPI Payment Rules 2026: వ్యాపారులు యూపీఐ పేమెంట్స్ నిరాకరించవచ్చా?.. కొత్త MDR రూల్స్ ఏం చెబుతున్నాయి?
వ్యాపారులు యూపీఐ పేమెంట్స్ నిరాకరించవచ్చా?.. కొత్త MDR రూల్స్ ఏం చెబుతున్నాయి?
Amazon Great Indian Festival 2026: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తేదీలు ఖరారు.. అక్టోబర్ 8 నుంచి సేల్ స్టార్ట్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తేదీలు ఖరారు.. అక్టోబర్ 8 నుంచి సేల్ స్టార్ట్
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
Tiger Tension: వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
Dementia Signs : మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
NATS Charity: దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేలా నాట్స్ సేవా కార్యక్రమాలు... 80 లక్షలతో 'సంబరంలో సేవ'
దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేలా నాట్స్ సేవా కార్యక్రమాలు... 80 లక్షలతో 'సంబరంలో సేవ'
Free Rice To Fishermen: మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఒక్కో కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఒక్కో కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
Embed widget