By: ABP Desam | Updated at : 27 Jun 2022 08:07 PM (IST)
అరబిందో ఫార్మాకు సెబీ హెచ్చరిక లేఖ
Aurobindo Pharma : హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా చతాలా విషయాలను దాచేస్తోందని... నిజాలను చెప్పడం లేదని స్టాక్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ( SEBI ) హెచ్చరిక లేఖను జారీ చేసింది. అరబిందో ఫార్మాస్యూటికల్స్‌లో యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( USFDA) ఆడిట్ నిర్వహించింది. కంపెనీకి హైదరాబాద్ సమీపంలోని జడ్చర్లలో ఉన్న తయారీ ప్లాంట్‌ను తనిఖీ చేసింది.ఈ ఆడిట్‌లో వెలుగు చూసిన అంశాలను విధిగా సెబీకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే అరబిందో ఫార్మా కేవలం తనిఖీలు జరిగాయన్న సమాచారం మాత్రమే ఇచ్చారు. అసలు ఆ తనిఖీల్లో ఏం గుర్తించారన్నదన్నది చెప్పలేదు. దీన్ని సెబీ సీరియస్‌గా తీసుకుంది. హెచ్చరిక లేఖను జారీ చేసింది. పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.
పోస్టాఫీస్ స్కీమ్స్‌లో పొదుపు చేస్తున్న వారికి గుడ్ న్యూస్- ఆ పథకాల వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్
అయితే యూఎస్‌ఎఫ్‌డీఏ జడ్చర్లలో ఉన్న తయారీ ప్లాంట్‌ను తనిఖీ చేసిన తర్వాత ఆరు అభ్యంతరాల్ని వ్యక్తం చేసిందని ఫార్మా వర్గాలుచెబుతున్నాయి. ఓరల్ ఔషధాల్ని తయారు చేసే ఈ ప్లాంట్‌లో మే 2 నుంచి 10 వరకూ ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలను నిర్వహించిన మీదట ఆరు అభ్యంతరాలతో కూడిన ’ఫారమ్ 483’ను జారీ చేసినట్లుగా తెలు్సతోంది. ఎఫ్‌డీఏ గుర్తించిన లోపాల్ని నిర్ణీత సమయంలోగా కంపెనీ సరిచేయాల్సి ఉంటుంది. విటమిన్ బి12 లేమితో ఏర్పడే రుగ్మతల చికిత్సకు ఉపయోగించే సైనోకోబాలమిన్ ఇంజెక్షన్లను అమెరికా మార్కెట్ నుంచి అరబిందో ఫార్మా సబ్సిడరీ రీకాల్ చేసినట్టు ఎఫ్‌డీఏ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే వివరాలేమీ అరబిందో ఫార్మా అధికారికంగా సెబీకి తెలియచేయలేదు.
రమ్మంటే రాజీనామా చేస్తారని ఐటీ కంపెనీల భయం! WFH వదలని ఉద్యోగులు!
భారత్ ప్లాంట్లలో తయారు చేసే మెడిసిన్స్ అమెరికా మార్కెట్లలో అమ్మకాలు సాగించాలంటే యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి తీసుకోవాలి. భారత్ వెలుపల ఉన్న ప్లాంట్లలో కూడా యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బృందం తనిఖీలు చేస్తుంది. లోపాలను గుర్తిస్తుంది. వాటిని సరి చేసుకోవాల్సి ఉంటుంది. తీవ్రమైన లోపాలు గుర్తిస్తే ఆ మందులు అమెరికాలో అమ్మకుండా నిషేధం విధిస్తారు. భారత ఫార్మా కంపెనీలకు అమెరికా కీలకమైన మార్కెట్ కావడంతో యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్టులు కీలకం.
డేటింగ్ యాప్‌లో అమ్మాయితో లవ్వు! పనిచేస్తున్న బ్యాంకుకే కన్నమేసిన ఉద్యోగి!
యూఎస్‌ఎఫ్‌డీఏ రిపోర్టుల్లో లోపాలు బపయటపడితే అది బయటకు తెలిస్తే స్టాక్ మార్కెట్‌లో షేర్ల ధరలపై ప్రభావం చూపుతుంది. అందుకే అరబిందో యాజమాన్యం సెబీకిపూర్తి వివరాలు చెప్పడానికి వెనుకడుగు వేస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Petrol-Diesel Price 01 October 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Gold-Silver Price 01 October 2023: కొండ దిగొస్తున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Bank Locker Rule: లాకర్లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?
Balakrishna : గిరిజనుల హక్కుల కోసం ఎన్బికె పోరాటం
Jagan Adani Meet: జగన్తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ
/body>