అన్వేషించండి

Apple Store: ఇండియాలో తొలి ఆపిల్‌ స్టోర్‌ ప్రారంభం, సేల్స్‌ డోర్‌ ఓపెన్‌ చేసిన టిమ్‌ కుక్‌

ముంబయిలోని ఖరీదైన బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న మాల్‌లో ఈ స్టోర్‌ ఉంది.

Apple Mumbai Store Launch: భారతదేశంలో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్ ఇవాళ (మంగళవారం, 18 ఏప్రిల్‌ 2023) ముంబైలో ప్రారంభమైంది. ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (Apple CEO Tim Cook), ఉదయం 11 గంటలకు అధికారికంగా ఈ స్టోర్‌ను లాంచ్‌ చేశారు. దీని కోసమే ఆయన నిన్న ఇండియా చేరుకున్నారు. ఆపిల్‌ ముంబై స్టోర్‌ను యాపిల్‌ బీకేసీగా (Apple BKC) పిలుస్తున్నారు. ముంబయిలోని ఖరీదైన బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న మాల్‌లో ఈ స్టోర్‌ ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, నాణ్యమైన ఆపిల్‌ ఉత్పత్తులను అమ్మే ఈ స్టోర్‌ను చాలా నిరాడంబరంగా ప్రారంభించారు. మేళతాళాలు, రిబ్బన్ కటింగ్స్‌ లాంటివేమీ పెట్టుకోలేదు. నలుపు రంగ టీ షర్ట్‌ వేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చిన టిమ్‌ కుక్‌, సింపుల్‌గా బీకేసీ యాపిల్ స్టోర్‌ గేట్‌ను తెరిచి పట్టుకోవడంతో స్టోర్‌ లాంచ్‌ అయింది. అయితే, మీడియా హడావిడి బాగానే కనిపించింది. యాపిల్‌ సిబ్బంది పచ్చరంగు ఫుల్‌హ్యాండ్‌ టీ షర్ట్స్‌తో కనిపించారు. వందలాది మంది ప్రజలు, ఆపిల్ అభిమానులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్టోర్‌లో ఆపిల్‌ ఉత్పత్తుల అమ్మకం నేటి నుంచి ప్రారంభమైంది.

సోమవారం మధ్యాహ్నం ముంబై చేరుకున్న టిమ్‌ కుక్‌, ముకేష్ అంబానీ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌తో కలిసి వడ పావ్ తిన్నారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్‌.చంద్రశేఖరన్‌తో సహా కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులను కూడా ఆయన కలిశారని సమాచారం.

ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్‌ రెండో రిటైల్‌ స్టోర్‌ కూడా ఈ నెల 20న (గురువారం) దిల్లీలో ప్రారంభం కానుంది. దిల్లీ సాకేత్ ప్రాంతంలోని హై-ఎండ్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఆపిల్‌ స్టోర్‌ తలుపులు టిమ్‌ కుక్‌ అన్‌లాక్ చేస్తారు. ఈ స్టోర్‌ను యాపిల్‌ సాకేత్‌గా (Apple Saket) పిలుస్తున్నారు. 

రిటైల్ స్టోర్ అద్దె రూ. 42 లక్షలు
ముంబైలోని ఆపిల్‌ రిటైల్‌ స్టోర్‌ విస్తీర్ణం 20,806 చదరపు అడుగులు. దీనిని 133 నెలలకు లీజుకు తీసుకున్నారు. దిల్లీలో తెరవనున్న స్టోర్ దీని కంటే చిన్నది. అయితే రెండింటి లీజ్‌ ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ముంబై రిటైల్ దుకాణం అద్దె రూ. 42 లక్షలుగా తెలుస్తోంది.

US టెక్ దిగ్గజం భారతదేశంలో తన మొదటి ఆన్‌లైన్ స్టోర్‌ను 2020లోనే ప్రారంభించింది, ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు సాగిస్తోంది. ఆ తర్వాత త్వరలోనే రిటైల్ స్టోర్‌ను తెరుస్తారని అంతా భావించారు. అయితే.. దేశీయ అమ్మకాల్లో ఎక్కువ మొత్తాన్ని దేశీయంగా తయారు చేయని గ్లోబల్ కంపెనీలు తమ సొంత బ్రాండ్ అవుట్‌లెట్‌లను మన దేశంలో ప్రారంభించకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నియమాలు విధించింది. దీంతో పాటు కరోనా కూడా విజృభించింది. దీంతో ఈ రెండు స్టోర్లు చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉన్నాయి, ఎట్టకేలకు ముంబయి రిటైల్‌ స్టోర్‌ ఓపెన్‌ అయింది.

ప్రధాని మోదీతో భేటీ కోసం ప్రయత్నాలు
ముంబయి, దిల్లీ స్టోర్ ప్రారంభోత్సవాల మధ్య ఉన్న గ్యాప్‌లో, ప్రధాని నరేంద్ర మోదీతో టిమ్‌ కుక్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రధాని అప్పాయింట్‌మెంట్‌ కూడా అడిగారట. భారత్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, ఈ విభాగంలోకి వచ్చే కంపెనీలను ప్రోత్సహిస్తోంది. ఆపిల్‌ తయారీ భాగస్వాములైన ఫాక్స్‌కాన్‌ (Foxconn Technology Group), పెగాట్రాన్‌ (Pegatron Corp) కోసం బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను అందించింది.

చైనాను మించిన అసెంబ్లింగ్‌ కార్యకలాపాలు
2016లో ఆపిల్‌ CEO తొలిసారి భారత్‌కు వచ్చారు. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత భారత్‌లో అడుగు పెట్టారు. ప్రస్తుతం, భారతదేశ ఐఫోన్‌ల విక్రయాలు ఆల్ టైమ్ హైకి చేరాయి, మన దేశం నుంచి వార్షిక ఐఫోన్ ఎగుమతి బిలియన్ డాలర్లకు చేరుకుంది. బీజింగ్‌-వాషింగ్‌టన్‌ మధ్య సంబంధాలు చెడడంతో, చైనాను మించిన అసెంబ్లింగ్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆపిల్‌ కంపెనీ భారత్‌ వైపు చూస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Embed widget