Jobs in Amazon: 20 లక్షల జాబ్స్ ఇచ్చే లక్ష్యంగా అమెజాన్ - ఫోకస్ అంతా ఈ రంగాలపైనే!

2025 నాటికి భారతదేశం నుండి మొత్తం ఎగుమతులను 20 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని యోచిస్తున్నట్లు అమెజాన్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది.

FOLLOW US: 

భారతదేశంలో ఇప్పటివరకు తాము 11.6 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష రీతిలో ఉపాధి, ఉద్యోగాలను సృష్టించామని అమెజాన్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 2025 నాటికి 20 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకోవడానికి తాము సన్నాహాలు చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఆదివారం ప్రకటించింది. అమెజాన్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ.. “11.6 లక్షలకు పైగా ఉద్యోగాలను మేం సృష్టించాం. సుమారు USD 5 బిలియన్ల ఎగుమతులు ప్రారంభించాం. భారతదేశంలో 40 లక్షల MSMEలు డిజిటలైజ్ చేశాము. వీటిలో ఐటీ, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, తయారీ, కంటెంట్ ఉత్పత్తి, ప్రతిభ అభివృద్ధి, ఇతర వ్యాపారాలు అన్నీ ప్రాతినిథ్యం వహిస్తాయి.’’ అని అన్నారు.

2025 నాటికి భారతదేశం నుండి మొత్తం ఎగుమతులను 20 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని యోచిస్తున్నట్లు అమెజాన్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. 2025 నాటికి, భారతదేశం నుండి USD 10 బిలియన్ల సంచిత ఎగుమతులకు వీలు కల్పిస్తుందని 2020లో అమెజాన్ ప్రకటించింది. కోటి MSMEలను డిజిటలైజ్ చేస్తామని 2020 జనవరిలో ప్రకటించింది. 

ఇది విక్రేతలు, చేతిపనులు, చేనేత కార్మికులతో పాటు పంపిణీ, లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లతో సహా 40 లక్షల MSMEలకు ప్రయోజనం చేకూర్చింది. ‘‘భారతదేశంలో డిజిటల్ పరివర్తన, సమకాలీన, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అమెజాన్ పెద్ద పాత్ర పోషిస్తున్నట్లు మేం ఆశిస్తున్నాం’’ అని తివారీ చెప్పారు. గత సంవత్సరం, అమెజాన్ USD 250 మిలియన్ల Amazon Sbhav వెంచర్ ఫండాను ఆవిష్కరించింది, ఇది టెక్నాలజీ - కేంద్రీకృత సంస్థలు, వ్యవస్థాపకులలో పెట్టుబడి పెట్టనుంది. అమెజాన్ ఇప్పటికే ఫండ్‌లో భాగంగా MyGlamm, M1xchange మరియు Small Case వంటి సంస్థలలో పెట్టుబడి పెట్టింది.

అమెజాన్​ పేర్కొంటున్న 11.6 లక్షల ఉద్యోగాల్లో కొన్ని నేరుగా సంస్థలో పనిచేసేవి కాగా మరికొన్ని దానికి అనుబంధంగా ఉండే రంగాలకు చెందినవి. డెలివరీ, లాజిస్టిక్స్​, రవాణా, ప్యాకేజింగ్​ మొదలైనవి ఈ దీనికి చెందినవే. గతేడాది జరిగిన వార్షికోత్సవంలో అమెజాన్​ సంభవ్​ వెంచర్​ పేరుతో వెంచర్​ క్యాపిటల్ ను కూడా ప్రారంభించింది. సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించే స్టార్టప్ లో పెట్టుబడులు పెడతామని పేర్కొంది. ఇప్పటికే మైగ్లామ్​, ఎం1 ఎక్స్​ఛేంజ్​, స్మాల్​ కేస్​ మొదలైన సంస్థల్లో పెట్టుబడి పెట్టింది. 

‘‘దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేస్తున్నాము. కాబట్టి భారత్​లో వ్యాపార రంగం వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించే టెక్నాలజీ, టూల్స్​ వంటివి అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని అమెజాన్​ ప్రతినిధి పేర్కొన్నారు. కేవలం గతేడాదిలో అమెజాన్.. ఐటీ, ఈ-కామర్స్​, లాజిస్టిక్స్​, తయారీ, కంటెంట్​ క్రియేషన్, స్కిల్​ డెవలప్మెంట్​ వంటి రంగాల్లో 1.35 లక్షల ఉద్యోగాలను సృష్టించింది.

Published at : 15 May 2022 10:25 PM (IST) Tags: Amazon Jobs Amazon nine years in India Amazon news jobs in india msme news in india

సంబంధిత కథనాలు

Petrol Price Today 1st July 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు - ఏపీలో అక్కడ మండుతున్న ధరలు

Petrol Price Today 1st July 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు - ఏపీలో అక్కడ మండుతున్న ధరలు

Gold Rate Today 1st July 2022: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 1st July 2022: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ

Maruti Suzuki Brezza 2022: రూ.8 లక్షల్లోపే కొత్త బ్రెజా - మోస్ట్ ప్రీమియం ఫీచర్లు, లుక్!

Maruti Suzuki Brezza 2022: రూ.8 లక్షల్లోపే కొత్త బ్రెజా - మోస్ట్ ప్రీమియం ఫీచర్లు, లుక్!

Delay In Mutual Funds Units: మీ MF యూనిట్లు ఆలస్యంగా క్రెడిట్‌ అయ్యాయని భయపడుతున్నారా?

Delay In Mutual Funds Units: మీ MF యూనిట్లు ఆలస్యంగా క్రెడిట్‌ అయ్యాయని భయపడుతున్నారా?

SBI Services Down: పూర్తిగా డౌన్ అయిన ఎస్‌బీఐ - విరుచుకుపడుతున్న వినియోగదారులు!

SBI Services Down: పూర్తిగా డౌన్ అయిన ఎస్‌బీఐ - విరుచుకుపడుతున్న వినియోగదారులు!

టాప్ స్టోరీస్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ

PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ