అన్వేషించండి

Airtel Data Plans: రూ.26కే ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ - 30 రోజుల వ్యాలిడిటీతో మరో 3 చౌక డేటా ఓచర్లు

Airtel New Recharge Plans: ఎయిర్‌టెల్ మూడు కొత్త డేటా ప్లాన్‌లను ప్రారంభించింది. రీఛార్జ్‌ చేస్తే 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతాయి.

Airtel New Prepaid Data Plans: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌, తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లను అందిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో, సరికొత్త ప్లాన్‌ను లాంచ్‌ చేసిందీ టెలికాం సర్వీసెస్‌ ప్రొవైడర్‌. అది.. రూ.26 ప్లాన్‌ (Airtel Rs 26 Plan). ధర చాలా తక్కువగా ఉన్నందున వినియోగదార్లను మెప్పిస్తోంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు 1.5 GB హై-స్పీడ్ డేటా పొందుతారు. కంపెనీ ఈ ప్లాన్‌ను తన 'డేటా ప్యాక్' లిస్ట్‌లో కూడా ఉంచింది. అయితే, ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 1 రోజు మాత్రమే. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లకు ఉచిత కాలింగ్ ప్రయోజనం కూడా ఉంటుంది. ముఖ్యంగా, అత్యవసర పరిస్థితుల్లో డేటా అవసరమయ్యే యూజర్ల కోసం ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్, తన డేటా ప్లాన్‌ల జాబితాలో రూ.22 ప్లాన్‌ను (Airtel Rs 22 Plan) కూడా చేర్చింది. ఈ ప్లాన్‌లో 1 GB డేటా వస్తుంది, దీని వ్యాలిడిటీ కూడా ఒక రోజు మాత్రమే.

తన ప్రి-పెయిడ్‌ యూజర్ల కోసం మరో 3 కొత్త ప్లాన్‌లను కూడా ఎయిర్‌టెల్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ మూడు డేటా ఓచర్‌ ప్లాన్‌లు. అంటే, మీరు ఈ ప్లాన్‌లను రీఛార్జ్‌ చేసుకుంటే డేటా బెనిఫిట్స్‌ వస్తాయి. ఇవి డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు కావని గుర్తుంచుకోండి. ఎందుకంటే, మీరు ఈ మూడు కొత్త డేటా ఓచర్ ప్లాన్‌లతో కూడా వ్యాలిడిటీ కూడా పొందుతారు. 

ఎయిర్‌టెల్ లాంచ్‌ చేసిన మరో మూడు కొత్త ప్లాన్‌ల వివరాలు:

ఎయిర్‌టెల్, తన యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మూడు కొత్త ప్లాన్‌లు - రూ. 161 ప్లాన్‌, రూ. 181 ప్లాన్‌, రూ. 351 ప్లాన్‌. ఈ మూడు ప్లాన్‌లతోనూ వినియోగదార్లకు 30 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అయితే..  ప్లాన్‌లో, వినియోగదార్లు ఉచిత SMS లేదా కాలింగ్‌కు సంబంధించిన ఏ సౌకర్యాన్నీ పొందరు. 

ఎయిర్‌టెల్ రూ. 161 ప్రి-పెయిడ్‌ ప్లాన్ (Airtel Rs 161 Plan)
ఎయిర్‌టెల్ ప్రారంభించిన కొత్త డేటా ఓచర్‌ ప్లాన్‌ల లిస్ట్‌లో ఇది నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ ప్లాన్‌ ఖరీదు 161 రూపాయలు. ఈ ప్లాన్‌తో మీరు 12GB డేటా పొందుతారు, దీని వాలిడిటీ 30 రోజులు.

ఎయిర్‌టెల్ రూ. 181 ప్రి-పెయిడ్‌ ప్లాన్ (Airtel Rs 181 Plan)
ఎయిర్‌టెల్ ప్రారంభించిన కొత్త డేటా ఓచర్‌ ప్లాన్‌ల జాబితాలో ఇది రెండోది. దీని ధర 181 రూపాయలు. ఈ ప్లాన్‌తో మీరు 15GB డేటా పొందుతారు, దీని వాలిడిటీ 30 రోజులు.

ఎయిర్‌టెల్ రూ. 361 ప్రి-పెయిడ్‌ ప్లాన్ (Airtel Rs 361 Plan)
ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ ప్రారంభించిన కొత్త డేటా ఓచర్‌ ప్లాన్‌ల లిస్ట్‌లో మూడోది. దీని ధర 361 రూపాయలు. ఈ ప్లాన్‌తో మీరు 50GB డేటా పొందుతారు, దీని వాలిడిటీ కూడా 30 రోజులు.

ఈ 3 ప్లాన్‌లలో రోజువారీ డేటా పరిమితి లేదు. అంటే, ఈ డేటా ప్లాన్స్‌లో ద్వారా అందుబాటులో ఉన్న మొత్తం డేటాను మీరు ఒకే రోజులో ఉపయోగించుకోవచ్చు లేదా 30 రోజుల చెల్లుబాటు వరకు క్రమంగా వాడుకోవచ్చు. ఇంతకుముందే చెప్పినట్లు ఈ ప్లాన్స్‌లో కాలింగ్ & SMS ఆప్షన్ లేవు. కాల్స్‌ చేయడానికి & SMSలు పంపడానికి ఇప్పటికే ఏదైనా పని చేస్తున్న ప్లాన్‌ ఉన్నవాళ్లు లేదా కాల్స్‌, SMSలు చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు ఈ మూడు కొత్త ప్లాన్‌లను ఉపయోగించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: లార్జ్‌ క్యాప్స్‌ ర్యాలీతో రికార్డ్‌ స్థాయిలో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు - 26000 చేరువలో నిఫ్టీ  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
Revanth Reddy: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
Revanth Reddy: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
YSRCP On Tirumala Laddu: తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Embed widget