అన్వేషించండి

Share Market Closing Today: లార్జ్‌ క్యాప్స్‌ ర్యాలీతో రికార్డ్‌ స్థాయిలో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు - 26000 చేరువలో నిఫ్టీ

Sensex And Nifty At New All-time Highs: భారత స్టాక్ మార్కెట్ మార్కెట్ విలువ ఈ రోజు రూ.4.29 లక్షల కోట్లు పెరిగింది, తొలిసారిగా రికార్డు స్థాయిలో రూ.476 లక్షల కోట్లను తాకింది.

Stock Market Closing On 23 September 2024: ఈ వారంలో మొదటి రోజు (సోమవారం, 23 సెప్టెంబర్‌ 2024) భారతీయ స్టాక్ మార్కెట్‌కు చారిత్రాత్మకంగా (Stock markets at record levels) మారింది. సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయిలో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 85000 రికార్డు స్థాయికి 20 పాయింట్ల దూరంలో ఆగింది. ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ కూడా చారిత్రక గరిష్ఠ స్థాయి 26000కి 44 పాయింట్ల దూరంలో ఉంది. ఈ రోజు బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ షేర్లలో బలమైన కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ 384 పాయింట్లు, నిఫ్టీ 148 పాయింట్లు జంప్‌ చేశాయి.

ఇంట్రా-డే ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్‌ తాజా జీవితకాల గరిష్ట స్థాయి 84,980.53 మని ‍(Sensex at fresh all-time high) క్రియేట్‌ చేసింది. NSE నిఫ్టీ కూడా 25,956 (Nifty at fresh all-time high) వద్ద లైఫ్‌టైమ్‌ హైని టచ్‌ చేసింది.

ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 384.30 పాయింట్లు లేదా 0.45% పెరిగి 84,928.61 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 148.10 పాయింట్లు లేదా 0.57% లాభంతో 25,939.05 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ 84,651.15 వద్ద, నిఫ్టీ 25,872.55 వద్ద ఓపెన్‌ అయ్యాయి.

పెరిగిన & పడిపోయిన షేర్లు
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో... 21 షేర్లు లాభాల్లో, 9 షేర్లు నష్టాలతో ముగిశాయి. టాప్‌ గెయినర్స్‌లో.... మహీంద్రా & మహీంద్రా 3.18%, SBI 2.35%, భారతీ ఎయిర్‌టెల్ 2.26%, హెచ్‌యుఎల్ 1.54%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.49%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.42%, అదానీ పోర్ట్స్ 1.24%, టాటా స్టీల్ 1.22%, ఎన్‌టీపీసీ 1.03 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.98 శాతం పెరుగుదలతో ముగిశాయి. టాప్‌ లూజర్స్‌లో... ఐసీఐసీఐ బ్యాంక్ 1.25 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.05 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.97 శాతం, టెక్ మహీంద్రా 0.89 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.49 శాతం, ఇన్ఫోసిస్ 0.48 శాతం, టీసీఎస్ 0.41 శాతం, ఎల్‌అండ్ టీ 0.30 శాతం, పవర్ గ్రిడ్‌ 0.30 శాతం, JSW స్టీల్ 0.01 శాతం క్షీణతతో క్లోజ్‌ అయ్యాయి.

సెక్టార్ల వారీగా చూస్తే..
నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్ సెక్టార్లు లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లు పతనాన్ని చవిచూశాయి. నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 503 పాయింట్ల జంప్‌తో రికార్డు స్థాయిలో 60,712 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 216 పాయింట్ల లాభంతో ముగిసింది.

మార్కెట్ క్యాప్‌
స్టాక్ మార్కెట్ ఈ రోజు కూడా రికార్డు స్థాయిలో ముగియడంతో స్టాక్ మార్కెట్ విలువ సరికొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. బీఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాప్ తొలిసారిగా రికార్డు స్థాయిలో రూ.476 లక్షల కోట్ల వద్ద (market capitalization of indian stock market) ముగిసింది. క్రితం సెషన్‌లో ఇది రూ.471.71 లక్షల కోట్ల వద్ద ఉంది. అంటే, నేటి సెషన్‌లో మార్కెట్ క్యాప్‌లో రూ.4.29 లక్షల కోట్ల జంప్‌ నమోదైంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget