అన్వేషించండి

HDFC Twins: ఏప్రిల్‌ 4 నుంచి రూ.2.51 లక్షల కోట్లు లాస్‌! మరింత పడిపోనుందా?

HDFC Twins: హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల విలీనం స్టాక్‌ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది! షేర్లు పతనం అవుతుండటంతో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మార్కెట్‌ విలువతో సమానమైన సంపదను మదుపర్లు నష్టపోయారు.

హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల విలీనం స్టాక్‌ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది! మెర్జింగ్‌ గురించి చెప్పిన రోజు నుంచీ వరుసగా ఈ రెండు కంపెనీల షేర్లు పతనం అవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 10 శాతం వరకు నష్టపోవడంతో దాదాపుగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మార్కెట్‌ విలువతో సమానమైన సంపదను మదుపర్లు నష్టపోయారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ విలీనమవుతాయని ఏప్రిల్‌ 4న మేనేజ్‌మెంట్‌ ధ్రువీకరించింది. ఆ రోజు షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఆ మరుసటి రోజు నుంచి అసలు కథ మొదలైంది. ఈ రెండు కంపెనీల షేర్లు వరుసగా నష్టపోతున్నాయి. ఏప్రిల్‌ 4న రూ.9,18,591 కోట్లుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ విలువ వరుస విక్రయాలతో రూ.1.67 లక్షలు నష్టపోయి ప్రస్తుతం రూ.7,51,421 కోట్లకు చేరుకుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.91,595 కోట్లు తగ్గి రూ.4,85,692 కోట్ల నుంచి రూ.3,94,097 కోట్లకు చేరుకుంది.

ఏప్రిల్‌ 4న రూ.14 లక్షల కోట్లుగా ఉన్న ఈ రెండు కంపెనీల మార్కెట్‌ విలువ మంగళవారం నాటికి రూ.11.45 లక్షల కోట్లకు తగ్గిపోయింది.  అంటే మొత్తంగా రూ.2.58 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. ఇది బజాజ్ ఫిన్‌సర్వ్‌ మార్కెట్‌ విలువ రూ.2.51 లక్షల కోట్ల కన్నా ఎక్కువే కావడం గమనార్హం. అయినప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ మార్కెట్‌ విలువ మూడో స్థానంలో ఉంది. రూ.17,81,205 కోట్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తొలి స్థానంలో ఉండగా రూ.12,89,011 కోట్లతో టీసీఎస్‌ రెండో స్థానంలో నిలిచింది.

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనం చాలామందిని కంగారు పెడుతోంది. ప్రస్తుతం వీటి మార్కెట్‌ విలువ తగ్గిపోయినా రెండేళ్ల లక్ష్యంతో కొనుగోలు చేయొచ్చని కొన్ని బ్రోకరేజ్‌ సంస్థలు చెబుతున్నాయి. మంగళవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు రూ.60 నష్టపోయి రూ.1335 వద్ద ముగిసింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ షేరు ధర రూ.123 తగ్గి రూ.2,140 వద్ద ముగిసింది.

Also Read: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌! 32 మందితో గ్రూప్‌ కాలింగ్‌, లార్జ్‌ ఫైల్‌ షేరింగ్‌

Also Read: వాట్సాప్‌ యూపీఐ వాడుతున్నారా? ఈ అప్‌డేట్‌ మీకోసమే!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HDFC Bank (@hdfcbank)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Embed widget