By: ABP Desam | Updated at : 15 Apr 2022 03:00 PM (IST)
Edited By: Ramakrishna Paladi
వాట్సాప్‌లో కొత్త ఫీచర్! 32 మందితో గ్రూప్ కాలింగ్, లార్జ్ ఫైల్ షేరింగ్
WhatsApp Communities Feature: ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) యూజర్లకు మరో అప్‌డేట్ ఇచ్చింది. సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొంది. గ్రూప్ కాలింగ్ సంఖ్యను 32కు పెంచుతున్నామని వెల్లడించింది. అలాగే 2జీబీకి పైగా సైజున్న ఫైల్స్‌ను షేర్ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తోంది.
ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్ కాల్‌లో కేవలం ఎనిమిది మందిని మాత్రమే యాడ్ చేసేందుకు వీలుంది. 1జీబీ కన్నా తక్కువ పరిమాణం గల ఫైల్స్‌ను మాత్రమే షేర్ చేసుకొనేందుకు వీలుండేది. లేటెస్టుగా గ్రూప్‌లోని చాట్‌ను ఎప్పుడైనా డిలీట్ చేసుందుకు అడ్మినిస్ట్రేటర్‌కు అవకాశం ఇస్తోంది. ఆ డిలీట్ చేసిన సంభాషణ గ్రూప్ మెంబర్లలో ఎవరికీ కనిపించదని వాట్సాప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
'గ్రూప్ చాట్స్‌ను (Group chat) సులభంగా ఆర్గనైజ్ చేసేందుకు, సమాచారం సులువుగా కనుగొనేందుకు వీలుగా వాట్సాప్‌ను మేం అప్‌డేట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు వేర్వేరు గ్రూపులను ఒకే కమ్యూనిటీ (Whats App community) కిందకు తీసుకురావచ్చు. ఉదాహరణకు ఒక పాఠశాలలో వేర్వేరు తరగతులకు వేర్వేరు గ్రూపులు ఉంటాయి. కానీ పాఠశాలలో చదువుతున్న పిల్లల తలిదండ్రులకు ఓవరాల్‌గా ఒకే కమ్యూనిటీ ఉంటుంది. అందులోనే అనౌన్స్‌మెంట్లు, ఇతర టూల్స్ అడ్మిన్స్‌కు అందుబాటులో ఉంటాయి' అని ఆ అధికారి తెలిపారు.
'వాట్సాప్ గ్రూపుల్లో మేం మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాం. రియాక్షన్స్, లార్జ్ ఫైల్ షేరింగ్, ఎక్కువ మందితో గ్రూప్ కాల్స్ వంటివి' అని మెటా ప్లాట్‌ఫామ్స్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఓ పోస్టు చేశారు.
ఇతర యాప్స్ వందలు, వేల మందితో చాట్స్ రూపొందించుకొనే అవకాశం ఇస్తున్నప్పటికీ తాము మాత్రం రోజువారీ జీవితాల్లో భాగమైన గ్రూపులకు సపోర్ట్ చేయడంపై ఫోకస్ చేస్తున్నామని వాట్సాప్ ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది.
Today we’re very excited to share our vision for a feature we’re calling WhatsApp Communities. This is new functionality we’re building to support the many organizations that use WhatsApp to communicate in a private and secure way. pic.twitter.com/LxEccdgJq8
— Will Cathcart (@wcathcart) April 14, 2022
We’ve heard from many workplaces, non-profits, and local organizations that have been using WhatsApp for their private communication, and there’s a lot we can improve to make WhatsApp work better for groups like these. pic.twitter.com/KkwhmUcoDI
— Will Cathcart (@wcathcart) April 14, 2022
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్, సిల్వర్ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్ ఇవి, కానీ జాగ్రత్త!
Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?
Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు