By: ABP Desam | Updated at : 23 Mar 2023 08:28 PM (IST)
Edited By: Ramakrishna Paladi
హిండెన్‌బర్గ్ రిపోర్టు ( Image Source : Twitter )
Hindenburg Research:
షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ (Hindenburg) ఈసారి అమెరికా కంపెనీనే టార్గెట్ చేసింది. ట్విటర్ కో ఫౌండర్ జాక్ డోర్సీ స్థాపించిన యూఎస్ మొబైల్ పేమెంట్స్ కంపెనీ బ్లాక్‌పై (Block payments App) విమర్శలతో కూడిన రిపోర్టును విడుదల చేసింది.
ప్రస్తుతం బ్లాక్ మార్కెట్ విలువ 44 బిలియన్ డాలర్లు. అంతకు ముందు స్క్వేర్ పేరుతో వ్యాపారం నిర్వహించేది. బ్యాంకింగ్ సేవలకు దూరమైన, బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోలేని వారికి తేలికైన, మ్యాజికల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ద్వారా సాధికరత కల్పించడమే ధ్యేయంగా ప్రకటించింది.
NEW FROM US:
Block—How Inflated User Metrics and "Frictionless" Fraud Facilitation Enabled Insiders To Cash Out Over $1 Billionhttps://t.co/pScGE5QMnX $SQ
(1/n)— Hindenburg Research (@HindenburgRes) March 23, 2023
వివిధ వయసుల్లోని యూజర్ల ద్వారా బ్లాక్ క్రమపద్ధతిలో ప్రయోజనం పొందిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. కంపెనీ ప్రకటించిన మ్యాజికల్ టెక్నాలజీలో గొప్పేమీ లేదని, కస్టమర్లు, ప్రభుత్వాన్ని మోసగించడమే దీని లక్ష్యమని వివరించింది. నిబంధనలు పాటించదని పేర్కొంది. అధిక ఫీజులు, రుణాలు, తప్పుడు గణాంకాలతో ఇన్వెస్టర్లను మోసగించిందని తెలిపింది. కరోనా మహమ్మారి తర్వాత బ్లాక్ క్యాష్ యాప్ ఎదుగులను చూసి విశ్లేషకులు ఉత్సాహం చూపించారని వెల్లడించింది. వాస్తవ యూజర్ల సంఖ్యను ఎక్కువ చెప్తోందని, కస్టమర్లను చేర్చుకొనేందుకు పెడుతున్న ఖర్చు తక్కువగా చూపిస్తోందని ఆరోపించింది.
'తాము సమీక్షించిన ఖాతాల్లో 40-75 శాతం నకిలీవేనని మాజీ ఉద్యోగులు అంచనా వేశారు. ఇందులో మోసం ఉందన్నారు. లేదా ఒకే వ్యక్తికి ఎక్కువ అకౌంట్లు ఉండొచ్చన్నారు' అని హిండెన్‌బర్గ్ తెలిపింది. కరోనా టైమ్‌లో పెరిగిన యూజర్ల సంఖ్య, ఆదాయంలో నకిలీ ఖాతాలు, చెల్లింపుల వాటాను చెప్పలేదంది. బ్లాక్‌స్టాక్ 18 నెలల్లో ఒక్కసారిగా 639 శాతం పెరిగిందని వెల్లడించింది. ఊహించని విధంగా ధరలు పెరగడంతో జాక్ డోర్సీ, సహ వ్యవస్థపకుడు మెక్‌కెల్వే కలిసి వందకోట్ల డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారని ప్రకటించింది. సీఎఫ్‌వో అమృతా అహుజా, లీడ్ మేనేజర్ బ్రియాన్ గ్రాసడోనియా మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారని తెలిపింది.
We also think Jack Dorsey has built an empire—and amassed a $5 billion fortune—professing to care deeply about demographics he is taking advantage of.
— Hindenburg Research (@HindenburgRes) March 23, 2023
Having sold shares near the top, he's ensured he'll be fine regardless of the outcome for everyone else.https://t.co/JSJtjx0MkD
బ్లాక్ కంపెనీ షేర్లను తాము షార్ట్ సెల్లింగ్ చేశామని హిండెన్ బర్గ్ ప్రకటించింది. దాంతో గురువారం మార్కెట్లు తెరవగానే షేర్లు 19 శాతం పతనమయ్యాయి. ఈ ఆరోపణలపై బ్లాక్ ఇంకా స్పందించలేదు. కాగా హిండెన్ బర్గ్ ఎలాంటి నివేదికలు విడుదల చేయరాదని గతంలోనే ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా తమ లాభం కోసం నివేదికలు ఇస్తున్నారని తెలిపింది. కంపెనీపై కొన్ని కేసులూ నమోదయ్యాయి.
We think Block has misled investors on key metrics, and embraced predatory offerings and compliance worst-practices in order to fuel growth and profit from facilitation of fraud against consumers and the government. (42/n)
— Hindenburg Research (@HindenburgRes) March 23, 2023
Cryptocurrency Prices: ఆదివారం లాభాల్లోనే! బిట్‌కాయిన్ @రూ.22.43 లక్షలు
IT Scrutiny Notice: ఇన్‌కమ్ టాక్స్ నోటీసులకు స్పందించడం లేదా! కొత్త గైడ్‌లైన్స్‌తో పరేషాన్!
Germany Economic Recession: రెసెషన్లో జర్మనీ - భారత్‌కు ఎంత నష్టం?
Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?
Cryptocurrency Prices: మిక్స్‌డ్ నోట్‌లో క్రిప్టోలు - బిట్‌కాయిన్‌కు మాత్రం ప్రాఫిట్!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!