By: ABP Desam | Updated at : 27 Feb 2023 12:57 PM (IST)
Edited By: Arunmali
₹7 లక్షల కోట్ల మార్క్ కూడా మటాష్
Adani Stocks: గౌతమ్ అదానీ కంపెనీల స్టాక్స్‌లో నాన్ స్టాప్ సెల్లింగ్ జరుగుతోంది. గ్రూప్‌లో (Adani Group Stocks) ఉన్న 10 లిస్టెడ్ స్టాక్స్‌లో, ఇవాళ (సోమవారం 27 ఫిబ్రవరి 2023) 9 స్టాక్స్ రెడ్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో, 10 స్టాక్స్ మొత్తం మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్ల మార్కు నుంచి దిగువకు పడిపోయింది.
2023 జనవరి 24న, అణుబాంబు లాంటి రిపోర్ట్‌ను అదానీ గ్రూప్ మీదకు హిండెన్‌బర్గ్ ప్రయోగించింది. ఆ విస్ఫోటనం తాలూకు వేడి ఇప్పటికీ నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది, అదానీ షేర్ల ధరలు ఆవిరవుతూనే ఉన్నాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో... అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) ఎప్పటిలాగే 5% నష్టపోయి, వాటి లోయర్ సర్క్యూట్ పరిమితుల్లో లాక్ అయ్యాయి.
గత నెల రోజుల వ్యవధిలో, అదానీ స్టాక్స్ మొత్తం విలువ 60% పైగా దిగజారింది. విడివిడిగా చూస్తే, ఈ నెల రోజుల్లో కొన్ని కౌంటర్లు 80% పైగా పడిపోయాయి.
పెట్టుబడిదార్ల శాంతపరిచేందుకు ఒప్పించేందుకు సమ్మేళనం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, హిండెన్‌బర్గ్ పేలుడు నివేదికను విడుదల చేసిన తర్వాత అదానీ స్టాక్‌లలో అమ్మకాలు ఒక నెల పాటు నాన్‌స్టాప్‌గా ఉన్నాయి.
ఇవాళ లాభపడిన ఒకే ఒక్క స్క్రిప్
ఇన్వెస్టర్లకు ఒక మంచి వార్త చెప్పిన అదానీ పోర్ట్స్ (Adani Ports) షేర్లు మాత్రమే ఇవాళ గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. కేవలం 329 రోజులలో 300 MMT కార్గోని హ్యాండిల్ చేసినట్లు అదానీ పోర్ట్స్ ప్రకటించింది, అంతకుముందు సంవత్సరంలోని
354 రోజుల స్థాయిని బీట్ చేసినట్లు ప్రకటించింది. ఈ వార్త తర్వాత, అదానీ పోర్ట్స్ షేర్ ధర 1% పెరిగి రూ. 564.95 వద్ద ట్రేడవుతోంది.
ఇప్పుడు F&O ట్రేడర్లు ఏం చేయాలి?
వచ్చే నెల ఎక్స్‌పైరీస్‌లో "లాంగ్ స్ట్రాంగిల్" (Long strangle) తీసుకోవడమే ప్రస్తుతం అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ప్లే చేయడానికి ఉన్న ఏకైక మార్గంగా 'హెడ్జ్' ఫౌండర్ & సీఈఓ రాహుల్ ఘోస్ చెబుతున్నారు.
"అదానీ స్టాక్స్ చాలా అస్థిరంగా కదులుతున్నాయి. వాల్యుయేషన్ డ్రైవర్స్ & టెక్నికల్ పారామీటర్ల కంటే వార్తల వల్లే ఎక్కువగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ March Expiry 1300 PEని, April Expiry 1500 CEని ట్రేడర్లు బయ్ చేయవచ్చు. ట్రేడ్ ఒక డైరెక్షన్‌లో 10% మూవ్ అయ్యాక, March యూనిట్‌లను విక్రయించవచ్చు. ఈ స్టాక్ ఆప్షన్స్ ప్రీమియంలు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయి, IV పూర్తిగా కూల్ కాలేదు" అని రాహుల్ ఘోస్ చెప్పారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!
Paytm on UPI charges: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల్లేవ్ - అదంతా తప్పుడు సమాచారమే!
Stock Market News: ఈక్విటీ మార్కెట్లో ఈ జోష్ ఎక్కడిదీ! భారీగా పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ
Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?
Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న టాక్స్ రూల్స్ - లాభమో, నష్టమో తెలుసుకోండి
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!