అన్వేషించండి

Adani Group: అదానీ సిమెంట్‌ బిజినెస్‌కు భారీ బూమ్‌ - ఏకంగా రూ.10,422 కోట్ల డీల్‌

Ambuja Cement Update: పెన్నా సిమెంట్‌ కొనుగోలు వల్ల దక్షిణ భారత్‌లో అదానీ సిమెంట్‌ వ్యాపారం మరింత బలోపేతం అవుతుంది. గ్రూప్‌లోని సిమెంట్‌ కంపెనీల సంఖ్య 4కు చేరుతుంది.

Ambuja Cement To Buy Penna Cement: అదానీ గ్రూప్‌ చైర్మన్ గౌతమ్ అదానీ, దేశంలో తన సిమెంట్‌ వ్యాపారాన్ని మరింత దూకుడుగా పెంచుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ను అదానీ కొనబోతున్నారు. అదానీ గ్రూప్‌లోని అంబుజా సిమెంట్స్‌ ఈ డీల్‌ కోసం రంగంలోకి దిగింది. పెన్నా సిమెంట్‌లో 100 శాతం వాటాను రూ. 10.422 కోట్లకు కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. 

డీల్‌ క్లోజ్‌ అయిన తర్వాత, అంబుజా సిమెంట్స్‌ వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి మరో 14 మిలియన్ టన్నులు పెరుగుతుంది, మొత్తం సామర్థ్యం ఏడాదికి 89 మిలియన్ టన్నులకు చేరుతుంది.

పెన్నా సిమెంట్‌తో డీల్ గురించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అంబుజా సిమెంట్స్‌ సమాచారం ఇచ్చింది. ఈ నెల 13న జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం నిర్వహించామని, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో (PCIL) 100 శాతం వాటా కొనుగోలు చేసేందుకు బోర్డ్‌ అంగీకరించిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

పెన్నా సిమెంట్, ప్రస్తుతం, ప్రమోటర్ పి ప్రతాప్‌ రెడ్డి & అతని కుటుంబ సభ్యుల చేతుల్లో ఉంది. ప్రతాప్‌ రెడ్డి కుటుంబం నుంచి పెన్నా సిమెంట్‌లో వాటాలను అంబుజా సిమెంట్స్‌ కొనుగోలు చేస్తుంది. ఈ డీల్‌కు అవసమైన రూ. 10.422 కోట్లను సొంత నిధుల నుంచి అంబుజా సిమెంట్స్‌ సమకూరుస్తుంది. అంటే, బాహ్య నిధుల సమీకరణ జోలికి వెళ్లదు. 

పెరగనున్న అదానీ సిమెంట్‌ మార్కెట్‌ షేర్‌
"అంబుజా సిమెంట్స్‌ మరింత వేగంగా వృద్ధి చెందడంలో పెన్నా సిమెంట్‌ కొనుగోలు ఒక కీలక ఘట్టంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం తర్వాత, దక్షిణ భారతదేశంలో అంబుజా సిమెంట్స్‌ ఉనికి మరింత బలోపేతం అవుతుంది. మొత్తం దేశంలో సిమెంట్ పరిశ్రమలో అగ్రగామిగా నిలుస్తుంది. దేశంలోని అన్ని మార్కెట్‌లో అంబుజా సిమెంట్స్‌ ఉనికి ఉంటుంది. భారతదేశవ్యాప్తంగా అంబుజా సిమెంట్ మార్కెట్ వాటా 2 శాతం పెరుగుతుంది, దక్షిణ భారతదేశంలో 8 శాతానికి పెరుగుతుంది.  వ్యాపార విస్తరణ లక్ష్యానికి అనుగుణంగా పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నాం. ఈ డీల్ పూర్తి కావడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది" - అంబుజా సిమెంట్స్‌ CEO అజయ్ కపూర్ 

పెన్నా సిమెంట్‌ కొనుగోలుతో చాలా లాభాలు
పెన్నా సిమెంట్‌ కొనుగోలు వల్ల అంబుజా సిమెంట్స్‌కు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం ఫ్యాక్టరీనే కాదు, పెన్నా సిమెంట్‌కు ఉన్న సున్నపు రాయి గనులు కూడా అంబుజా సిమెంట్స్‌ చేతిలోకి వెళ్తాయి. పెన్నా సిమెంట్‌కు  దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ఉనికి ఉంది. ఇది అంబుజా సిమెంట్స్‌కు కలిసి వస్తుంది. పెన్నా సిమెంట్‌కు శ్రీలంకలో ఒక అనుబంధ సంస్థ ఉంది. ఇది కూడా అంబుజా పరమవుతుంది. ఫలితంగా, భారత్‌తో పాటు శ్రీలంకలోనూ మార్కెట్‌ వాటా పెంచుకునే ఛాన్స్‌ అంబుజా సిమెంట్స్‌కు (అదానీ గ్రూపునకు) లభిస్తుంది. 

పెన్నా సిమెంట్‌కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్‌లో సిమెంట్‌ ఫ్లాంట్స్‌ ఉన్నాయి. ఏటా 14 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం దీని సొంతం. ఇంకా... కృష్ణపట్నంలో 2 మిలియన్‌ టన్నులు, జోధ్‌పూర్‌లో మరో 2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రెండు ఫ్లాంట్స్‌ నిర్మాణం జరుగుతోంది. మరో ఏడాదిలో వీటి నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభం అవుతుంది.

ప్రస్తుతం, అదానీ గ్రూపు చేతిలో మూడు సిమెంట్‌ కంపెనీలు (ACC లిమిటెడ్, అంబుజా సిమెంట్స్, సంఘీ ఇండస్ట్రీస్‌) ఉన్నాయి. ఇకపై పెన్నా సిమెంట్‌ కూడా ఈ లిస్ట్‌కు యాడ్‌ అవుతుంది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget