By: ABP Desam | Updated at : 09 Aug 2023 01:07 PM (IST)
అదానీ విల్మార్ నుంచి బయటకొచ్చే ఆలోచనలో అదానీ
Adani Group: బిలియనీర్ బిజినెస్ మ్యాన్ గౌతమ్ అదానీకి సంబంధించి, ఒక పెద్ద వార్త దలాల్ స్ట్రీట్‌లో చక్కర్లు కొడుతోంది. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మార్‌లో తన వాటాను అమ్మకానికి పెట్టాలని ఆలోచిస్తోంది. సింగపూర్‌నకు చెందిన విల్మార్ ఇంటర్నేషనల్ లిమిటెడ్-అదానీ ఎంటర్‌ప్రైజెస్ కలిసి, అదానీ విల్మార్‌ను జాయింట్ వెంచర్‌గా (JV) ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీలో 44 శాతం వాటాను సెల్ చేయాలని అదానీ ఎంటర్‌ప్రైజెస్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోంది. విల్మార్ ఇంటర్నేషనల్‌కు కూడా అదానీ విల్మార్‌లో 44 శాతం వాటా ఉంది.
ప్రస్తుత షేర్ ప్రైస్ ప్రకారం అదానీ షేర్ల విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చు. ఈ డబ్బును, తన ప్రధాన వ్యాపారానికి (కోర్ బిజినెస్) మూలధన సమీకరణగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉపయోగించుకుంటుందని సమాచారం.
సెల్లింగ్ డీల్ ఓకే అయిన తర్వాత కూడా అదానీ విల్మార్ నుంచి గౌతమ్ అదానీ పూర్తిగా బయటకు వెళ్లకపోవచ్చు. ఆ కంపెనీలో మైనారిటీ స్టేక్‌ను అదానీ, అతని ఫ్యామిలీ మెయిన్‌టైన్ చేస్తారని తెలుస్తోంది.
డీల్ ఓకే కావచ్చు, కాకపోవచ్చు
44 శాతం వాటా విక్రయానికి సంబంధించిన చర్చలు ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయని, అనుకున్న రేటు రాకపోతే అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు మార్కెట్‌లో చెప్పుకుంటున్నారు.
ఇవాళ (బుధవారం, 09 ఆగస్టు 2023) మధ్యాహ్నం 12.45 గంటల సమయానికి అదానీ విల్మార్ షేర్ ధర రూ.15.50 లేదా 3.94% తగ్గి, రూ.377.45 వద్ద ఉంది. అదే సమయానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర రూ.28.15 లేదా 1.14% లాభంతో రూ.2,502.70 వద్ద కదులుతోంది.
37% YTD లాస్
అదానీ విల్మార్ షేర్లు, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 37% పైగా పడిపోయాయి. గత ఆరు నెలల్లో 14 శాతం పైగా నష్టపోయాయి. ఈ కంపెనీ మార్కెట్ విలువ సుమారు 6.2 బిలియన్ డాలర్లు.
2022లో, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా మార్కెట్‌లోకి వచ్చిన అదానీ విల్మార్, ఆ సమయంలో 36 బిలియన్ రూపాయలు ($435 మిలియన్లు) సేకరించింది. ఈ కంపెనీలో దాదాపు 88% షేర్లు అదానీ & విల్మార్ దగ్గరే ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీల్లో, లిస్టింగ్ తేదీ నుంచి ఐదు సంవత్సరాల లోపు, కనీసం 25% షేర్లు పబ్లిక్ దగ్గర ఉండాలన్నది సెబీ రూల్.
అదానీ విల్మార్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ. వంట నూనెలు, గోధుమ పిండి, బియ్యం, పప్పులు, చక్కెర సహా అనేక ముఖ్యమైన వంటగది ఉత్పత్తులను అమ్ముతోంది. ఇది, ITC లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ వంటి కంపెనీలతో పోటీ పడుతోంది.
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో, అదానీ విల్మార్‌కు 790 మిలియన్ రూపాయల నష్టం వచ్చింది. ముడి వంట నూనెల ధరలు తగ్గడం, ఎక్కువ రేటు దగ్గర సరకు కొనడం వంటివి నష్టానికి కారణంగా మేనేజ్‌మెంట్ చెప్పింది.
మరో ఆసక్తికర కథనం: రిలయన్స్‌లో రిజిగ్నేషన్ల సునామీ, 1.67 లక్షల మంది ఔట్ - 'టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ' ఇదే!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Petrol-Diesel Price 01 October 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Gold-Silver Price 01 October 2023: కొండ దిగొస్తున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
/body>