Latest News: ఆధార్ వివరాలను మరో 3 నెలలు వరకు 'ఫ్రీ'గా మార్చుకోవచ్చు
గడువును మరో మూడు నెలల వరకు, ఈ ఏడాది సెప్టెంబరు 14వ తేదీ వరకు పెంచారు.
Aadhaar Card Updation Latest News: ఆధార్ కార్డును పూర్తి ఉచితంగా అప్‌డేట్ చేసుకునే ఛాన్స్‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ (UIDAI) గతంలో ఇచ్చిన లాస్ట్ డేట్ ఈ నెల 14తో ముగిసింది. తాజాగా, ఆ గడువును మరో మూడు నెలల వరకు, ఈ ఏడాది సెప్టెంబరు 14వ తేదీ (14 సెప్టెంబర్ 2023) వరకు పెంచారు. ఆధార్ కార్డ్‌లోని మీ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా, పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, మీ అడ్రస్ మారినా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవడానికి మరో 3 నెలల సమయం దొరికింది.
UIDAI వెబ్‌సైట్ ప్రకారం, ఆధార్ కార్డ్‌లో కచ్చితమైన సమాచారం ఉండేలా తగిన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేసి, ఆధార్ కార్డ్ డిటైల్స్ అప్‌డేట్ చేయాలి. మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి, https://myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఉడాయ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లవచ్చు. ఆఫ్‌లైన్/ఆధార్ కేంద్రం/CSC కి వెళ్లి ఆధార్ సమాచారం అప్‌డేట్ చేయాలనుకుంటే మాత్రం రూ. 25 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
UIDAI పోర్టల్ ద్వారా, ఆన్‌లైన్‌లోనే, మీ ఇంటి చిరునామా, మీ పేరు మొదలైన సమాచారాన్ని ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేయవచ్చు. దీని కోసం వినియోగదార్లకు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ దగ్గర పెట్టుకోవాలి. మొబైల్ నంబర్‌లో OTP ద్వారా, మీరు చిరునామా మరియు ఇతర విషయాలను మార్చవచ్చు.
ఆధార్ కార్డ్ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలి?
ముందుగా myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ చేయండి
మీ పేరు/లింగం/పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్లు ఎంచుకోండి
ఆధార్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోండి
ఇప్పుడు చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి ఉన్న ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్ కాపీని అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను అప్‌లోడ్ చేయండి
ఇప్పుడు మీకు ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ (URN) వస్తుంది
ఆ నంబర్‌ను సేవ్ చేసుకోండి. ఆధార్ అప్‌డేషన్ స్టేటస్ తనిఖీ చేయడానికి ఆ నంబర్ ఉపయోగపడుతుంది
ఆధార్ అప్‌డేషన్ ప్రాసెస్‌ను ఎలా ట్రాక్ చేయాలి?
మీ ఆధార్ కార్డ్‌లో మార్పు కోసం మీరు రిక్వెస్ట్ చేసిన తర్వాత, మీకు URN నంబర్ వస్తుంది. అది మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా అందుతుంది. మీరు https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ వివరాల అప్‌డేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు.
డెమోగ్రాఫిక్ డేటాను ఎప్పుడు అప్‌డేట్ చేయాలి?
మన దేశంలో వివాహానంతరం మహిళ ఇంటి పేరు మారుతుంది. ఇలాంటి సందర్భంలో మార్పులు చేయాలి. అయితే, ఒక మహిళ ఉద్యోగం చేస్తున్నా/చేయాలని అనుకుంటున్నా, విద్యార్హత పత్రాల్లో ఉన్న ఇంటి పేరు ప్రకారమే ఉద్యోగ నియామకం జరుగుతుంది కాబట్టి, ఆమె ఆధార్ కార్డ్‌లో పుట్టింటి పేరునే కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఇప్పటికే భర్త ఇంటి పేరుతో మార్చుకున్నా, పదో తరగతి సర్టిఫికెట్‌ను ప్రూఫ్‌గా చూపి, పుట్టింటి ఇంటి పేరుకు మళ్లీ మారవచ్చు. పుట్టిన తేదీ, పేరు, చిరునామాలో తప్పులు దొర్లినా మీ ఆధార్ డిటెయిల్స్ అప్‌డేట్ చేయాలి.
ఇది కూడా చదవండి: బంగారాన్ని చౌకగా కొనే సువర్ణావకాశం, 5 రోజులే ఈ స్పెషల్ ఆఫర్