అన్వేషించండి

7th Pay Commission News : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు - కాసేపట్లో లడ్డూ లాంటి వార్త

7th pay Commission: కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఈ రోజు ఒక శుభవార్త వినే ఛాన్స్ ఉంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం పూర్తయిన వెంటనే ప్రకటన రావచ్చు.

3 Percent DA Hike Announcement Possible Today: కోట్లాది మంది ఉద్యోగుల నిరీక్షణకు ఈ రోజు (బుధవారం 16 అక్టోబర్‌ 2024) ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం, నిరీక్షణదార్లందరికీ దీపావళి కానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు, కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత, ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంపుపై ప్రకటన చేయవచ్చు.

చాలా కాలంగా ఎదురు చూపులు            
దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వం నుంచి డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. గత క్యాబినెట్ భేటీ తర్వాత జరిగిన బ్రీఫింగ్‌లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ డీఏ పెంపును ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతోందని ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లు గట్టిగా నమ్ముతున్నారు.

డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెంచొచ్చు?         
డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచడంపై నేటి కేబినెట్‌ భేటీలో చర్చిస్తారు. ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA) పేరిట, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌ (DR) పేరిట ఈ పెంపు ఉంటుంది. ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లకు అందుతున్న డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతంగా ఉంది. ఈ రోజు, 3 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేస్తే, ఈ హైక్‌తో కలిపి కొత్త DA 53 శాతం అవుతుంది.

మరో ఆసక్తికర కథనం: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో నష్టపోవద్దు - మీ డబ్బును పెంచే బెస్ట్‌ ఐడియాలు వేరే ఉన్నాయ్‌!       

కొత్త డియర్‌నెస్ అలవెన్స్ ఎప్పటి నుంచి అందుతుంది?      
కేంద్ర క్యాబినెట్ ఈ రోజు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచితే, ఈ ఏడాది జులై, ఆగస్టు & సెప్టెంబర్ బకాయిలతో పాటు ఈ మొత్తం ఉద్యోగులకు అందుతుంది. ఎందుకంటే DA పెంపును జులై 1, 2024 నుంచి లెక్కిస్తారు. కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను ఏడాదికి రెండుసార్లు - జనవరిలో ఒకసారి, జులైలో మరోసారి పెంచుతారు. డీఏ పెంపు ప్రకటన ఆలస్యమైతే, బకాయిలతో కలిపి ఉద్యోగులు & పెన్షనర్లకు చెల్లిస్తారు. సాధారణంగా, డియర్‌నెస్‌ అలవెన్స్‌ పెంపు ప్రకటన ఆలస్యం అవుతుంటుంది. ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం నుంచి ఉద్యోగులు & పెన్షనర్లను రక్షించడానికి కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు డియర్‌నెస్‌ అలవెన్స్‌ ఇస్తాయి.

దీపావళికి ముందు జీతం పెంపు   
ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ కొనసాగుతోంది. ఈ నెలాఖరులో దీపావళి పండుగ రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కరవు భత్యాన్ని (Dearness Allowance) పెంచితే, కోట్లాది మందికి ఈ రోజే దీపావళి గొప్ప బహుమతి లభిస్తుంది. దీపావళికి ముందే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రేట్లను పెంచి ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మరో ఆసక్తికర కథనం: గోల్డ్ బాండ్లలో రూపాయికి రూపాయి లాభం - ఈ ఇన్వెస్టర్లు వెరీ లక్కీ            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Embed widget