అన్వేషించండి

Zuckerberg: సిబ్బంది దెబ్బకు మార్క్‌ జుకర్‌బర్గ్‌ మైండ్‌ బ్లాంక్‌, ఈ కష్టం ఏ బాస్‌కు రాకూడదు

మెటా సిబ్బందిలో ముప్పావు శాతం మందికి జుకర్‌బర్గ్‌ నాయకత్వం మీద నమ్మకం లేదు.

Mark Zuckerberg: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ల పేరెంట్‌ కంపెనీ మెటా (Meta) ఉద్యోగులు, ఆ కంపెనీ CEO మార్క్‌ జుకర్‌బర్గ్‌కు (Mark Zuckerberg) మైండ్‌ బ్లాంక్‌ అయ్యే షాక్‌ ఇచ్చారు. ఆ దెబ్బకు, అసలే తెల్లగా ఉండే బాస్‌ ఫేస్‌ మరింత పాలిపోయి ఉండవచ్చు. 

కంపెనీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ఈ ఏడాదిని 'ఇయర్‌ ఆఫ్‌ ఎఫీషియన్సీ'గా (year of efficiency) జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. అందులో భాగంగా, ఇటీవలి కాలంలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. కొందరు ఉద్యోగులను సంస్థ నుంచి తప్పించారు.

ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి చాలా సుప్రసిద్ధ టెక్ కంపెనీలు దశల వారీగా తమ సిబ్బందిని తొలగిస్తూ వచ్చాయి. ఇందులో మెటా పేరు కూడా ఉంది. ఖర్చులను తగ్గించుకోవడానికి మెటా కూడా వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గత ఏడాది నవంబర్‌లో, కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 13 శాతం  లేదా 11 వేల ఉద్యోగాలకు (Meta Layoffs) కోత పెట్టిన జుకర్‌బర్గ్‌, ఈ ఏడాది మార్చిలో మరో 10 వేల మందిని ఇంటికి పంపారు. ఈ నేపథ్యంలో, కంపెనీలో అంతర్గతంగా ఒక సర్వే జరిగింది. జుకర్‌బర్గ్‌ గురించి సిబ్బంది ఏమనుకుంటున్నారు, కంపెనీని నడిపే సత్తా ఆయనకు ఉందా, జకర్‌బర్గ్‌ నాయకత్వం మీద నమ్మకం ఉందా వంటి ప్రశ్నలను ఆ సర్వేలో అడిగారు. ఆ ప్రశ్నలకు ఎవరూ ఊహించని సమాధానాలు చెప్పారు మెటా ఉద్యోగులు.

26 శాతం మంది ఉద్యోగులకు జుకర్‌బర్గ్ అంటే ముద్దు           
వాల్ స్ట్రీట్ జనరల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, మెటా సిబ్బందిలో ముప్పావు శాతం మందికి జుకర్‌బర్గ్‌ నాయకత్వం మీద నమ్మకం లేదు. కేవలం 26 శాతం మంది మాత్రమే జుకర్‌బర్గ్‌ లీడర్‌షిప్‌ మీద విశ్వాసంతో ఉన్నారు. చివరి రౌండ్ లేఆఫ్‌లకు ముందు, ఈ ఏడాది ఏప్రిల్ 26 - మే 10వ తేదీల మధ్య ఈ సర్వేను నిర్వహించారు. అంతకుముందు, 2022 అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేలో, జుకర్‌బర్గ్‌ను నమ్మిన వాళ్లు దాదాపు 31 శాతంగా ఉన్నారు. తాజాగా, మరో 5 శాతం మంది నమ్మకాన్ని కంపెనీ CEO కోల్పోయారు.

74 శాతం మంది ఉద్యోగుల్లో ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు?         
కంపెనీ తొలగించిన వేల మందిలో ఎక్కువ శాతం సిబ్బంది పని దొంగలు కాదు, సమర్థులు అన్నది ఉద్యోగుల మాట. అయినా, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా వాళ్లకు పింక్‌ స్లిప్స్‌ వెళ్లాయి. దీంతో, పని చేసే వాళ్లను కూడా తీసేయడమేంటని ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా, టాప్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకం పోవడమే కాదు, మిగిలిన ఉద్యోగుల్లో అభద్రత భావం, మానసిక ఒత్తిడి పెరిగిందని తాజా నివేదిక వెల్లడించింది. ఈ తొలగింపుల కారణంగానే కంపెనీలోని 74 శాతం మంది ఉద్యోగులు జుకర్‌బర్గ్ నాయకత్వం పట్ల సంతోషంగా లేరని అంతర్గత సర్వే ద్వారా స్పష్టమైంది. అయితే.. మెటా ఉద్యోగుల్లో 43 శాతం మంది తమ పనికి విలువ ఉందని భావిస్తున్నారట.

మరో ఆసక్తికర కథనం:  బ్యాంక్‌ లాకర్‌ రూల్స్‌ - సింగిల్‌గా కావాలా, జాయింట్‌గా కావాలా? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget