News
News
వీడియోలు ఆటలు
X

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి వంటి పర్వదినాలు, జయంతులు ఈ నెలలో ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Bank Holidays list in April: 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీ స్థాయిలో సెలవులు వచ్చాయి, సగం రోజులు గేటు మూసేసి కనిపిస్తాయి.

ఏప్రిల్‌లో 15 రోజుల పాటు బ్యాంకులు మూత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన లిస్ట్‌ ప్రకారం, 2023 ఏప్రిల్‌లో, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఇందులో వారాంతపు సెలవులు కూడా కలిసి ఉన్నాయి.

బ్యాంకుల సెలవుల కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. కాబట్టి, ఖాతాదార్లను ఇబ్బందులు పడకుండా ముందే అప్రమత్తం చేయడానికి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. వివిధ పండుగలు, ప్రముఖుల పుట్టిన రోజులు, శని, ఆదివారం సెలవులతో సహా ఏప్రిల్ నెలలో పక్షం రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి వంటి పర్వదినాలు, జయంతులు ఈ నెలలో ఉన్నాయి. 

ఈ నెలలో మీకు బ్యాంకుతో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందే జాగ్రత్త పడండి. ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవుల జాబితాను (Bank Holiday in April 2023) కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఇలా చేస్తే.. సెలవు రోజున బ్యాంకుకు వెళ్లి, మూసేసిన గేటును చూసి ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిన అవసరం ఉండదు.

ఏప్రిల్‌ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా:

ఏప్రిల్ 1, 2023- ఏడాది పాటు (2022-23) కొనసాగిన పద్దులను క్లోజ్‌ చేయాల్సిన అవసరం కారణంగా దేశవ్యాప్తంగా ‍‌(ఐజ్వాల్, షిల్లాంగ్, సిమ్లా, చండీగఢ్ మినహా) బ్యాంకులకు సెలవు. ఈ రోజున బ్యాంకులు పని చేస్తాయి గానీ, ప్రజలకు సంబంధించిన సాధారణ లావాదేవీలను అనుమతించరు.
ఏప్రిల్ 2, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 4, 2023- మహావీర్ జయంతి కారణంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీల్లో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 5, 2023- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కారణంగా హైదరాబాద్‌లో బ్యాంకులు మూసివేసి కనిపిస్తాయి.
7 ఏప్రిల్ 2023- గుడ్ ఫ్రైడే కారణంగా, అగర్తల, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
ఏప్రిల్ 8, 2023- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేసి కనిపిస్తాయి.
ఏప్రిల్ 9, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేసి కనిపిస్తాయి.
ఏప్రిల్ 14, 2023- డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కారణంగా, ఐజ్వాల్, భోపాల్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
ఏప్రిల్ 15, 2023- విషు, బోహాగ్ బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తల, గువాహతి, కోచి, కోల్‌కతా, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 16, 2023- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఏప్రిల్ 18, 2023 - షబ్-ఎ-ఖద్ర్ కారణంగా జమ్ము & శ్రీనగర్‌లోని బ్యాంకులను మూసివేస్తారు.
ఏప్రిల్ 21, 2023- ఈద్-ఉల్-ఫితర్ కారణంగా అగర్తల, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులను మూసివేస్తారు.
ఏప్రిల్ 22, 2023- ఈద్, నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 23, 2023- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఏప్రిల్ 30, 2023 – ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. అయితే, బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా చేయవలసి వస్తే ATMని ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

Published at : 01 Apr 2023 12:26 PM (IST) Tags: Holiday Bank April 2023 list

సంబంధిత కథనాలు

Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్‌ ఎఫెక్ట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్‌ ఎఫెక్ట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?