అన్వేషించండి

Sadhguru: ప్రేమ మిమ్మల్ని బంధిస్తే కరుణ మీకు స్వేచ్ఛనిస్తుంది - సద్గురు

ప్రశ్న: ప్రేమకీ, కరుణకీ మధ్యనున్న తేడా ఏమిటి?

సద్గురు: మీరు మీలో పెంపొందించుకునే అన్ని భావోద్వేగాల్లోకి, కరుణ అనేది అతి తక్కువ బంధనాన్ని ఏర్పరుస్తుంది, అదే సమయంలో అది అత్యంత ఎక్కువ విముక్తిని కలిగించే భావోద్వేగం కూడా. మీరు కరుణ లేకుండా కూడా జీవించవచ్చు, అయితే ఎలాగూ మీరు భావోద్వేగాల్ని కలిగి ఉంటారు, కాబట్టి వాటిని వేరేలా కాకుండా, కరుణగా మలుచుకోవడం మంచిది, ఎందుకంటే మిగతా భావోద్వేగాలన్నీ
బంధనాలుగా మారే అవకాశం ఉంది. అయితే భావోద్వేగాల్లో విముక్తి కలిగించే ఒక పార్శ్వం = కరుణ, అది దేనితోనూ లేదా ఎవరితోనూ బంధనం ఏర్పరచదు. సాధారణంగా, మీ ప్రేమను నడిపించేది అనురక్తి. కరుణ అంటే అందరినీ ఇముడ్చుకునే అనురక్తి. ఒకవేళ అది ప్రత్యేకించి కొద్దిమంది పైనే అయితే దాన్ని అనురక్తి అంటాం. అదే అది అందరినీ అక్కున చేర్చుకునేదిగా అయితే, అది కరుణగా మారుతుంది. ప్రేమ మొదట్లో, ఒక విధమైన ఇష్టంతో మొదలవుతుంది, కాబట్టి అది మరొకరు లేదా మరొకటి మీతో మంచిగా ప్రవర్తించడం పై ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడూ వాళ్ళు ఎలా ఉన్నారో లెక్క కడుతూ ఉంటారు. లేదా ఇంకోలా చెప్పాలంటే, ఈ భావోద్వేగం పరిమితమైపోతుంది. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీతో మంచిగా ఉంటేనే, మీరు వాళ్ళను ప్రేమించడం కొనసాగిస్తారు. వాళ్ళు - మీరు ఏదైతే
చెడు అనుకుంటారో, ఆ విధంగా ప్రవర్తిస్తే, వాళ్ళని ప్రేమించలేరు.

కరుణతో ఉండటం వల్ల ఒక లాభమేమిటంటే, ఇతరులు చాలా చెడుగా ఉంటే, వాళ్ళు ఘోరమైన స్థితిలో ఉంటే, మీరు వారి పట్ల మరింత కరుణతో మెలగవచ్చు. కరుణ మిమ్మల్ని పరిమితం చేయదు. దానికి మంచి, చెడు అనే వ్యత్యాసాలు ఉండవు. కాబట్టి కచ్చితంగా కరుణ అనేది, ప్రేమ కంటే మరింత విముక్తిని ఇచ్చే భావోద్వేగం. సాధారణంగా ప్రేమ అనేది మరొకరి గురించి. అది ఎంతో అందంగా ఉండొచ్చు, కానీ అది వేరు చేస్తుంది. ఇద్దరు ప్రేమికులు కలిసి కూర్చున్నట్లయితే, వాళ్ళు మిగతా ప్రపంచాన్ని తమ నుంచి వేరుగా చూస్తారు. వాళ్ళు తమ సహవాసం తాలూకూ తమదైన కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. మౌలికంగా, ఇదొక రహస్యం లాంటిదన్న మాట.

మీరెప్పుడూ మీ రహస్యాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు, ఎందుకంటే ఆ రహస్యంలో మీరు ఎంతో విశిష్టమైన వ్యక్తిగా ఉంటారు - ఎవరికీ దాని గురించి తెలియదు. సాధారణంగా, చాలామంది విషయంలో, వారి ప్రేమలోని ఆనందం కేవలం ఈ రహస్యతే. ప్రేమలో పడినప్పుడు, వాళ్ళు దాన్ని వాళ్ళు ఎంతగానో ఆస్వాదిస్తారు, కానీ వారికి పెళ్ళైన మరుక్షణం, అది ప్రపంచానికి తెలిసిపోతుంది. అప్పుడిక అకస్మాత్తుగా, అన్ని ఊహాగానాలు పటాపంచలు అయిపోతాయి, ఎందుకంటే అది ఇక ఏమాత్రం రహస్యం కాదు. వారి గురించి అందరికీ తెలుసు. ప్రేమలో ఉండే ఈ రహస్యత, వారికి ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు మీ అనుభూతి నుంచి మిగతా ప్రపంచాన్నంతటినీ పక్కన పెడితే, అది బాధకు దారి తీస్తుంది. అది అనురక్తితో మొదలై, అనురక్తితోనే ముగిస్తే, మీరు మీ జీవితంలో అనేక ఇబ్బందుల్ని కొనితెచ్చుకుంటున్నట్లే - అది చిక్కుల్లో పడేస్తుంది. ఒకవేళ అది అనురక్తితో మొదలై, ఎల్లలు లేని కరుణగా పరిణమిస్తే, అది విముక్తుల్ని చేస్తుంది.

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Embed widget