న్యూ Yamaha XSR 155: యంగ్ రైడర్స్ ఎక్కువగా అడిగే 6 ప్రశ్నలకు క్లియర్ కట్ ఆన్సర్స్, మీకు ఈ విషయాలు తెలియాలి!
Yamaha XSR 155 ఇంజిన్, ఫీచర్లు, ABS, మైలేజ్, రైడింగ్ పొజిషన్, ఆకర్షణీయమైన స్క్రాంబ్లర్ & కేఫే రేసర్ కిట్లతో ఎలా ఉంటుందో ఈ గైడ్‌లో యువత కోసం సింపుల్‌గా వివరించాం.

Yamaha XSR 155 Review: యమహా XSR 155... ఈ పేరు వినగానే యువ రైడర్స్‌లో ఒక స్పెషల్ హైప్ కనిపిస్తోంది. ఈ కంపెనీకి R15, MT-15 మోడళ్లతో 155cc సెగ్మెంట్‌లో ఇప్పటికే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌పై నియో-రెట్రో స్టైల్‌తో వచ్చిన XSR 155 యూత్ మైండ్‌కి బాగా సరిపోతుంది. అయితే... ఈ బైక్ కొనుక్కోవాలంటే ముందు మీ డౌట్స్ క్లియర్ కావాలి కదా?. అందుకే XSR 155 గురించి తరచుగా ఎక్కువగా అడిగే 6 ముఖ్య ప్రశ్నలకు (Yamaha XSR 155 FAQs) ఇక్కడ క్లియర్ అండ్ స్ట్రెయిట్ సమాధానాలు.
1) XSR 155 ఇంజిన్ ఎంత పవర్ ఇస్తుంది?
యమహా, XSR 155 బైక్‌కు కూడా, R15 & MT-15 లో ఉన్న అదే 155cc లిక్విడ్-కూల్డ్ VVA ఇంజిన్ ఇచ్చింది. ఈ ఇంజిన్ ఇస్తున్న పవర్ - 18.4hp @ 10,000rpm & 14.2Nm టార్క్ @ 7,500rpm.
యమహా XSR 155 మోటార్ సైకిల్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పైగా స్లిప్ అండ్ అసిస్టెంట్ క్లచ్ ఉండటం వల్ల యువ రైడర్స్‌కి గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. నగర ట్రాఫిక్‌లోనూ, హైవేలోనూ ఇంజిన్ రెస్పాన్స్ నిజంగా క్రిస్ప్‌గా ఉంటుంది.
2) డ్యూయల్-చానెల్ ABS & ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయా?
ఉన్నాయి. XSR 155లో డ్యూయల్-చానెల్ ABS + ట్రాక్షన్ కంట్రోల్ స్టాండర్డ్‌గా వస్తాయి. ఇది యంగ్ రైడర్స్‌కి రోడ్ గ్రిప్, బ్రేకింగ్ సేఫ్టీలో పెద్ద ప్లస్ పాయింట్. Hunter 350 వంటి రైవల్స్‌తో పోలిస్తే, XSR 155 ఈ పాయింట్‌లో స్ట్రాంగ్ అడ్వాంటేజ్ కలిగి ఉంది.
3) మైలేజ్ ఎలా ఉంటుంది?
యమహా XSR 155 ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. అయినా, ఇంజిన్ చాలా మంచి ఎఫిషియెన్సీ ఇస్తుంది. MT-15 టెస్టుల్లో వచ్చిన మైలేజ్: సిటీలో 51.8 kmpl. హైవే మీద 56.4 kmpl. XSR 155 కూడా ఇదే ఇంజిన్ ఉపయోగించే కారణంగా అలానే మైలేజ్ ఇవ్వొచ్చు. ఈ లెక్కన, పూర్తి ట్యాంక్‌తో 500 km రేంజ్ వస్తుందని అంచనా.
4) 5’7’’ కన్నా తక్కువ హైట్ ఉన్నవారికి సూట్ అవుతుందా?
XSR 155 సీట్ హైట్ 810mm. ఇది కొంచెం హైట్‌గా ఉంటుంది. 5 అడుగుల 7 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న రైడర్స్‌కు ఫుల్ ఫుట్-టచ్ కష్టం కావచ్చు. హైట్ ఉన్నవారికి స్లిమ్ ట్యాంక్, నారో డిజైన్ వల్ల రైడ్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. షార్ట్ రైడర్స్ కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే బండిని హ్యాండిల్ చేయగలరు.
5) స్క్రాంబ్లర్, కేఫే రేసర్ కిట్లు ఏంటి?
యమహా XSR 155 కోసం కంపెనీ రెండు కస్టమ్ కిట్లు ఇచ్చింది, అవి స్క్రాంబ్లర్, కేఫే రేసర్.
Scrambler Kit (₹24,850). దీనిలో...
- బార్ ఎండ్ మిరర్స్
- రబ్బర్ ట్యాంక్ పాడ్స్
- సీట్ కవర్
- ఫ్లైస్క్రీన్
- అడ్జస్టబుల్ లీవర్స్
- నంబర్డ్ సైడ్ ప్యానెల్స్
- స్టైల్ లైసెన్స్ ప్లేట్ హోల్డర్
Café Racer Kit (₹28,180). దీనిలో...
- స్పోర్టీ సీట్
- హెడ్‌ల్యాంప్ కౌల్
- లీవర్ ప్రొటెక్టర్లుతో
- సైడ్ ప్యానెల్స్
- అడ్జస్టబుల్ లీవర్స్
ఈ కిట్లు యూత్ స్టైల్ లెవల్‌ను నిజంగా పెంచేస్తాయి.
6) XSR 155 ధర ఎంత?
ఈ బండి నాలుగు కలర్స్‌లో లభిస్తుందో, అవి: గ్రే, రెడ్, గ్రేయిష్ గ్రీన్, బ్లూ. అన్ని కలర్స్‌కు ఒకే ధర - ₹1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ). ఈ ధర MT-15 కంటే ₹5,000 తక్కువ. అంటే Yamaha 155cc లైనప్‌లో కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్ ఇదే.
హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ వంటి బిజీ తెలుగు నగరాల ట్రాఫిక్‌లో XSR 155 బైక్ చాలా కంఫర్ట్‌గా హ్యాండిల్ అవుతుంది. సిటీ రైడ్‌తో పాటు హైవే ట్రిప్స్ కోసం కూడా యూత్‌కి బాగా సూట్ అవుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















