అన్వేషించండి

160 Km భారీ రేంజ్‌తో వచ్చిన సరికొత్త Yamaha EC-06 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ - లాంచ్‌ డీటెయిల్స్‌ ఇవే!

Yamaha భారత్‌లో కొత్త EC-06 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఆవిష్కరించింది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 160 కి.మీ. రేంజ్‌ ఇస్తుంది. 4.5 కిలోవాట్‌ మోటార్‌, స్మార్ట్‌ కనెక్టివిటీతో ఈ స్కూటర్‌ ట్రెండ్‌ సెట్‌ చేయనుంది.

Yamaha EC 06 Electric Scooter Range, Features, Price: యమహా ఎట్టకేలకు భారత ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లోకి బలంగా అడుగు పెట్టింది. కొత్తగా ఆవిష్కరించిన Yamaha EC-06 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఒక్క ఫుల్‌ చార్జ్‌తో 160 కి.మీ. వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది. అద్భుతమైన డిజైన్‌, ఆధునిక టెక్నాలజీ, & స్మార్ట్‌ ఫీచర్లతో ఈ స్కూటర్‌ ప్రస్తుతం బజ్‌ క్రియేట్‌ చేస్తోంది.

పవర్‌ఫుల్‌ మోటార్‌ - మైలేజ్‌లో మాస్‌
Yamaha EC-06 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో 4.5 కిలోవాట్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ అమర్చారు, ఇది గరిష్టంగా 8.98 Hp పవర్‌ ఇస్తుంది. దీని 4 కిలోవాట్‌ గంటల లిథియం-అయాన్‌ బ్యాటరీ రోజువారీ ప్రయాణాలకు సరిపోయే స్థిరమైన రేంజ్‌ ఇస్తుంది. కంపెనీ ప్రకారం, EC-06 ని ఫుల్‌గా చార్జ్‌ చేస్తే 160 కి.మీ. (Yamaha EC 06 Electric Scooter Range) హాయిగా నడుపుకోవచ్చు.

చార్జింగ్‌ & రైడింగ్‌ మోడ్స్‌
Yamaha EC-06 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో హోమ్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. అంటే, ఇంట్లోనే సాధారణ ప్లగ్‌ ఈజీగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. సుమారు 9 గంటల్లో ఫుల్‌ చార్జ్‌ అవుతుంది. ఈ ఈ-స్కూటర్‌లో, రైడర్‌ అవసరాలకు అనుగుణంగా మూడు రైడింగ్‌ మోడ్స్‌ ఇచ్చారు. అలాగే, పార్కింగ్‌ సమయంలో సహాయపడే రివర్స్‌ మోడ్‌ కూడా ఉంది, ముఖ్యంగా పెద్దవాళ్లు & మహిళలకు ఈ ఫీచర్‌ చాలా ఉపయోగపడుతుంది. బండిని వెనక్కు తీసుకువెళ్లాలనుకున్నప్పుడు రైడర్‌ కిందకు దిగాల్సిన అవసరం లేదు, రివర్స్‌ మోడ్‌లో పెట్టి స్లోగా రైజ్‌ ఇస్తే చాలు.

స్మార్ట్‌ కనెక్టివిటీ & ఫీచర్లు
ఈ స్కూటర్‌లో ఉన్న సిమ్‌-బేస్డ్‌ కనెక్టివిటీ, ఇన్‌బిల్ట్‌ టెలీమాటిక్స్‌ యూనిట్‌ ద్వారా రియల్‌ టైమ్‌ డేటా యాక్సెస్‌, లోకేషన్‌ ట్రాకింగ్‌ వంటి సదుపాయాలు లభిస్తాయి. భవిష్యత్తులో రైడ్‌ అనలిటిక్స్‌, సర్వీస్‌ రిమైండర్లు కూడా అందించే అవకాశం ఉంది. అంటే, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్ల పరంగా టాప్‌లో ఉంది.

లుక్స్‌ & సేఫ్టీ
Yamaha EC-06 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిజైన్‌ క్లాసీగా ఉంది. LED హెడ్‌ల్యాంప్స్‌, టెయిల్‌ల్యాంప్స్‌, ఇండికేటర్లు అందంగా మెరుస్తున్నాయి. రైడర్‌ సేఫ్టీ కోసం ముందు & వెనుక డిస్క్‌ బ్రేకులు ఇచ్చారు. 24.5 లీటర్ల స్టోరేజ్‌ స్పేస్‌ కూడా ఉంది, సరుకులను ఈజీగా ఇంటికి తీసుకువెళ్లవచ్చు. ఇవన్నీ, EC-06 ని రోజువారీ వినియోగానికి సరైన ఆప్షన్‌గా నిలబెడతాయి.

ధర & డెలివెరీ టైమ్‌లైన్‌
యమహా ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా భారత మార్కెట్‌ కోసమే రూపొదించింది. యమహా ఇప్పుడు నిర్వహించిన ఈవెంట్‌ ఆవిష్కరణ (స్కూటర్‌ పరిచయం) మాత్రమే. ఈ బండి డెలివరీలు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభం కానున్నాయి. ధర వివరాలు కూడా అదే సమయంలో వెల్లడిస్తారు.

యమహా ఇప్పటి వరకు ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో వెనుకబడి ఉన్నప్పటికీ, EC-06 & Aerox-E తో ఇప్పుడు గేమ్‌ మార్చబోతోందని చెప్పవచ్చు. ఈ EC-06 స్కూటర్‌ స్మార్ట్‌ డిజైన్‌, శక్తిమంతమైన మోటార్‌, & భారీ రేంజ్‌తో యూత్‌ హార్ట్‌లో సీటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget