అన్వేషించండి

PM Modi Uses Which Car: పీఎం కాన్వాయ్‌ వాహనాలు ఏ కంపెనీవి? వాటి సేఫ్టీ ఫీచర్స్ ఏంటీ? ఎవరైనా కొనుక్కోవచ్చా?

What is the vehicle of the prime minister of India: ప్రధానమంత్రి కాన్వాయ్‌లో ఎలాంటి వాహనాలు వాడుతుంటారు? వాటిని ఎక్కడ డిజైన్ చేస్తారు? వాటి ఖరీదు ఎంత ఉంటుంది? వాటిని సామాన్యులు కొనుక్కోవచ్చా?

How Many Cars In PM Convoy: రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్‌ల దేశాలకు, రాష్ట్రాలకు కీలకమైన వ్యక్తులు. వీళ్లకు ఏ మాత్రం ప్రమాదం లేకుండా భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అందుకే వీళ్లు వేసే ప్రతి అడుగులోనూ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రధానమంత్రి భద్రత విషయంలో మరింత కేర్ తీసుకుంటారు. ఆయన అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన కోసం ప్రత్యేక్ కాన్వాయ్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు వెళ్లేందుకు వీలు ఉండదు. ప్రతీదీ భద్రతాధికారుల ఆదేశాలతోనే జరుగుతుంది.  

భారత ప్రధానమంత్రికి ప్రపంచంలోనే టాప్ మోస్ట్ సెక్యూర్డ్‌ కాన్వాయ్‌ కేటాయిస్తారు. అత్యంత భద్రతతో కూడిన వాహనాలను ఇందులో ఉంచుతారు. అందులో ఉండే ఫీచర్స్‌ ఇతర విషయాలను చాలా గోప్యంగా ఉంటాయి. వీఐపీల భద్రత కోసం ఆయా కంపెనీలతో మాట్లాడి ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తారు. ప్రస్తుతం పీఎం నరేంద్రమోదీ కాన్వాయ్‌లో కూడా పది నుంచి ఇరవై అత్యంత భద్రత కలిగిన వాహనాలు ఉన్నాయి. ఆయనతో వెళ్లే కాన్వాయ్‌ ప్రాంతాన్ని బట్టి, మార్గాలను బట్టి, వెళ్లే ప్రోగ్రామ్‌ను బట్టి మారిపోతుంది. నివేదికల్లో ఇచ్చిన సమాచారం మేరకు అసలు ఆ వాహనాలు ఏ కంపెనీకి చెందినవి, వాటిలో ఉండే ఫీచర్స్‌ ఏంటో చూద్దాం. 

పీఎం కాన్వాయ్‌లో వాడే వాహనాల కంపెనీలు ఏంటీ?
 ప్రధానమంత్రి కాన్వాయ్‌లో ఉండే వాహనాలను వివిధ కంపెనీల నుంచి తీసుకుంటారు. ప్రస్తుతానికి పీఎం కాన్వాయ్‌లో ఉన్న వాహనాలు మెర్సిడెస్‌- బెంజ్‌కు చెందిన మెర్సిడెస్‌-మేబాచ్‌ఎస్‌ 650 గార్డ్స్‌. 2021 నుంచి పీఎం కాన్వాయ్‌లో వినియోగిస్తున్నారు. జాగ్వార్‌ ల్యాండ్ రోవర్‌ కంపెనీకి చెందిన ల్యాండ్ రోవర్ రేంజ్‌ సెంటినల్‌, బీఎండబ్ల్యూ7 సిరీస్‌760Li హై సెక్యూరిటీ ఎడిషన్‌, టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌, టాటా సఫారీలను కాన్వాయ్‌లో వాడుతున్నారు. 

ప్రధానమంత్రి కాన్వాయ్‌లో పది నుంచి 20 వరకు వాహనాలు ఉంటాయి. ఆయన పర్యటించే ప్రాంతం, అక్కడి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. సెన్సిటివ్ ఏరియాలో పర్యటిస్తే భారీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేస్తారు. అత్యంత భద్రత ఉన్న ప్రాంతాల్లో తిరిగితే నార్మల్‌ కాన్వాయ్‌తో వెళ్తారు.

 డికాయ్‌ వాహనం అంటే ఏంటీ?
ఈ వాహన శ్రేణిలో ప్రధానమంత్రి ప్రయాణించే వాహనం పుల్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం ప్రధానమంత్రి ప్రయాణించేందుకే మెర్సిడెస్‌-మేబాచ్‌ఎస్‌ 650 గార్డ్స్‌ లేదా రేజ్‌ రోవర్‌ సెంటినల్‌ను వినియోగిస్తారు. సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వాహనాలు ఒకేలా ఉండేలా చూస్తారు. వీఐపీ ఎందులో ఉన్నారో బయట వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడతారు. అంటే ఒక వాహనాన్ని డికాయ్‌గా యూజ్ చేస్తారు.  

ఏ వాహనం ఎలా ఉపయోగపడుతుంది? 
ఆయన ముందు వెనుక ఎస్పీజీ సెక్యూరిటీతో ఉండే వాహనాలు ఉంటాయి. దీని కోసం బీఎండబ్ల్యూ  లేదా టయోటా ఫార్చ్యునర్స్‌ వాడతారు. తర్వాత టాటా సఫారీలు వినియోగిస్తారు. వీటిలోనే అత్యంత కీలకమైన జామర్స్ వాడతారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే బాంబులను నిరోధించేందుకు ఈ జామర్స్ యూజ్ చేస్తారు. 

అంబులెన్స్ కూడా మెర్సిడెస్‌- బెంజ్‌ కంపెనీదే
ఈ కాన్వాయ్‌లో ఓ లేటెస్ట్ ఎక్యూప్డ్‌ అంబులెన్స్ ఉంటుంది. ఈ అంబులెన్స్‌ కూడా మెర్సిడెస్‌- బెంజ్‌ స్ప్రింటర్‌ వ్యాన్‌. శత్రువుల తూటాలను బాంబులను కూడా తట్టుకొని నిలబడే సత్తా ఈ వాహనానికి ఉంటుంది. 

ఈ వాహనాలతోపాటు దారి చూపేందుకు కొన్ని వాహనాలు ఉంటాయి. మరికొన్ని షాడో టీమ్స్ కోసం ఏర్పాటు చేస్తారు. ఇవి టయోటా ఇన్నోవా, ల్యాండ్ క్రూయిజర్‌ ప్రాడో సహా ఇతర వాహనాలను వాడుతుంటారు. 

వాహనాల ధర ఎంత ?
అత్యంత పటిష్టమైన భద్రతా ఫీచర్స్‌తో వీటిని డిజైన్ చేస్తారు. అందుకే వీటి రేటు కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. మెర్సిడెస్‌-మేబాచ్‌ఎస్‌ 650 గార్డ్స్‌ నార్మల్ ధర 12 కోట్లు. కానీ ప్రభుత్వం తమ అవసరాలకి అనుగుణంగా డిజైన్ చేయిస్తుంది. కాబట్టి హెచ్చుతగ్గులు ఉండవచ్చని కొన్ని మీడియా రిపోర్ట్స్‌ను బట్టి తెలుస్తుంది. 

ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ సెంటినల్‌ ధర 8 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఉంటుంది. దీన్ని కూడా కస్టమైజ్డ్‌గానే చేస్తున్నందు మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ 760Li హైసెక్యూరిటీ ఎడిషన్ ధర పది కోట్లకుపై మాటే. టయోటా ల్యాండ్ క్రూయిజర్‌ ధర రెండు కోట్ల నుంచి మొదలవుతుంది. దీనికి మరిన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు కాబట్టి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. టాటా సఫారీ కూడా నార్మల్ వాహనం ఖరీదు 20 లక్షల వరకు ఉంటుంది. జామర్స్ లాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారు కాబట్టి ఇది మరింత పెరుగుతుంది. 

ఈ వాహనాల్లో ఉండే సేఫ్టీ ఫీచర్స్ ఏంటీ?
ప్రధానమంత్రిలాంటి వీవీఐకి ఈ వాహనాలు యూజ్ చేస్తారు కాబట్టి భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడరు. అందుకే టాప్ నాచ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. 

మెర్సిడెస్‌-మేబాచ్‌ఎస్‌ 650 గార్డ్స్‌:- ఇది వీఆర్‌ 10 స్థాయి రక్షణ కలిగి ఉంటుంది. అంటే హార్డ్‌ స్టీల్‌ కోర్ బులెట్‌లను, ఏకే 47 దాడులను కూడా తట్టుకోగలదు. రెండు మీటర్ల దరంలో 15కేజీల TNT లాంటి ప్రమాదకరమైన పేలుడు జరిగినా సరే తట్టుకోగలదు. దీని కిందిభాగం బాంబు పేలుళ్లను నిరోధిస్తుంది. దీని గ్లాసెస్‌కు పాలీకార్‌బొనేట్‌ కోటింగ్ ఉంటుంది. ఏదైనా రసాయన దాడులు జరిగితే లోపల కాసేపు ఆక్సిజన్ సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. ఒకవేళ బాంబు పేళ్లలో మరేదైనా కారణంతో టైర్‌ పంక్చర్ అయినప్పటికీ ఫ్లాట్ టైర్స్‌తోనే 30కిలోమీటర్లు వెళ్లిపోవచ్చు. ఇది గరిష్టంగా గంటలకు 190కిలోమీటర్ల వేగంగా వెళ్లగలదు. ఇందులో ఇంటర్‌కామ్ సౌకర్యం కూడా ఉంది.  

లాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ సెంటినల్‌:-ఇది వీ8 రక్షణ ఇస్తుంది. 7.62mm అత్యంత తీవ్రమైన బులెట్లను, 15 కిలోల టీఎన్టీ పేలుడును కూడా తట్టుకోగలదు. ఈ వాహనం గ్లాసెస్‌ పటిష్ట భద్రత కలిగి ఉంటాయి. మందంగా ఉంటాయి. ప్రమాద సమయంలో డ్రైవర్ సైడ్ కిటికీ మాత్రమే ఓపెన్ అవుతుంది. స్మోక్ స్క్రీన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ ఎస్కేప్‌ ఫీచర్. ఈ వాహనంలో ఉన్న సన్‌రూఫ్‌ ద్వారా మోదీ ప్రజలకు అభివాదం చేస్తుంటారు. 

బీఎండబ్ల్యూ7 సిరీస్‌ 760Li: ఇది వీఆర్‌7 రక్షణ కలిగి ఉంది. ఏకే 47 దాడులు, 17 కిలోల టీఎన్టీ స్థాయి పేలుడు నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇందులో కూడా ఆక్సిజన్ సరఫరా, ఫ్లాట్‌ టైర్ రన్ ఫెసిలిటీ ఉన్నాయి. ఇది గరిష్టంగా గంటకు 210 కిలోమీటర్లు వెళ్లగలదు.  

టయోటా ల్యాండ్ క్రూయిజర్‌:- బుల్లెట్ ప్రూఫ్‌, బాంబు ప్రూఫ్‌తో కలిసి చేయించుకున్న వాహనం. ప్రధానమంత్రి కాన్వాయ్‌ను నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వీళ్లకు  ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. సినిమాల్లో చూపించిన 180 డిగ్రీల టర్నల్‌, జే టర్న్‌ తీసుకోవడంలో వీళ్లు దిట్ట. 

వాహనాలను సామాన్యులు కొనుక్కోవచ్చా
ప్రధానమంత్రి భద్రత కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనాలను సమాన్యులు కొనుక్కునే వీలు లేదు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇలాంటి మోడల్ వాహనాలు బయట మార్కెట్‌లో అమ్మడానికి వీలు ఉండదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
New MG Hector : హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!
హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Embed widget