అన్వేషించండి

Car Graveyard America: అమెరికాలో కార్ల శ్మశానం - అన్నీ కొత్త కార్లే - వినడానికే వింతగా ఉంది కదూ - ఇవిగో ఫుల్ డీటైల్స్

Automotive History Costliest Scams: ఆటోమొబైల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన వోక్స్‌వ్యాగన్ డీజెల్‌గేట్ స్కామ్ కారణంగా అమెరికా ఎడారుల్లో లక్షలాది కార్లు శిథిలమైపోయాయి. స్మశానాన్ని తలపిస్తున్నాయి.

America Dieselgate Scandal :  మనుషులకు శ్మశానాలు ఉంటాయి. కార్లకు ఉంటాయా.. అంటే ఉంటాయని చెప్పక తప్పదు. ఈ శ్మశానాల్లో పాత మిలిటరీ బేస్‌లు, భారీ పారిశ్రామిక ప్రాంతాలలో మైళ్ల దూరం వరకు కేవలం కార్లే కనిపిస్తాయి. ఏదో షోరూమ్ పార్కింగ్ అనుకుంటే పొరపాటే. ప్రపంచ ప్రసిద్ధ ఆటోమొబైల్ దిగ్గజం  వోక్స్‌వ్యాగన్  ప్రతిష్టను మసకబార్చిన డీజెల్‌గేట్  ఉద్గారాల కుంభకోణానికి సజీవ సాక్ష్యాలు ఈ కార్ల స్మశానాలు. 2015లో వెలుగుచూసిన ఈ స్కామ్ తర్వాత, వోక్స్‌వ్యాగన్, ఆడి కంపెనీలకు చెందిన లక్షలాది డీజిల్ కార్లు రోడ్లపైకి రాకుండా ఇలా ఎడారుల్లో మూలనపడ్డాయి.

అసలు ఈ డీజెల్‌గేట్ స్కామ్ ఏమిటంటే..?

 వోక్స్‌వ్యాగన్ తన డీజిల్ కార్లలో ఉద్గారాల పరీక్షలను తారుమారు చేసే ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అమర్చింది. ల్యాబ్‌లో పరీక్షలు జరుగుతున్నప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ ఇంజన్ పనితీరును మార్చి, కాలుష్యం తక్కువగా వస్తున్నట్లు భ్రమింపజేసేది. కానీ, అదే కారు రోడ్డుపైకి వచ్చి సాధారణంగా నడుస్తున్నప్పుడు మాత్రం అనుమతించిన స్థాయి కంటే విపరీతమైన కాలుష్యాన్ని విడుదల చేసేది. ఈ మోసం బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా విచారణలు జరిగి, వోక్స్‌వ్యాగన్ సంస్థకు ఏకంగా 30 బిలియన్ డాలర్ల  అంటే సుమారు రూ. 2.5 లక్షల కోట్లు  పైగా జరిమానాలు, కోర్టు ఖర్చులు భరించాల్సి వచ్చింది. ఆటోమొబైల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన కార్పొరేట్ కుంభకోణంగా నిలిచింది.

కాలుష్య కారం అని  చెప్పి వెనక్కి తీసుకున్న  వోక్స్ వ్యాగన్ 

ఈ సంక్షోభం తీవ్రమవ్వడంతో అమెరికా ప్రభుత్వం వోక్స్‌వ్యాగన్ సంస్థను ఒక కఠినమైన ఒప్పందానికి ఆదేశించింది. దాని ప్రకారం.. కస్టమర్ల నుంచి ఆయా డీజిల్ కార్లను కంపెనీయే తిరిగి కొనుగోలు చేయాల్సి వచ్చింది  . దాంతో వేలాది మంది కస్టమర్లు పరిహారం తీసుకుని కార్లను కంపెనీకి ఇచ్చేశారు. అలా వోక్స్‌వ్యాగన్ చేతికి వచ్చిన లక్షలాది కార్లను ఉంచడానికి అమెరికాలోని పొడి వాతావరణం ఉండే ఎడారి ప్రాంతాలను ఎంచుకున్నారు, తద్వారా కార్లు త్వరగా తుప్పుపట్టకుండా ఉంటాయని భావించారు. అలా ఏళ్ల తరబడి ఆ కార్లన్నీ ఎడారి నిలువు  కాలంలో అలానే ఉండిపోయాయి.

అన్నీ కొత్త కార్లే

ఈ కార్లన్నీ పనికిరానివి లేదా తుక్కుగా మారినవి కావు. ఇవి ఆధునికమైనవి, నడపడానికి వీలైన కండిషన్‌లో ఉన్నవే. కానీ కేవలం కంపెనీ చేసిన సర్టిఫికేషన్ మోసం వల్ల ఇవి అనాథల్లా పడి ఉన్నాయి. అయితే, కాలక్రమేణా కొన్ని కార్లను నిబంధనల మేరకు రిపేర్ చేసి మళ్లీ మార్కెట్లో విక్రయించగా, మరికొన్నింటిని స్పేర్ పార్ట్స్ కోసం, పరిశోధనల కోసం వాడుకున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్లు ఆ ఎడారి లాట్లలో డీజెల్‌గేట్ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి.

ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడానికి ఓ కారణం 

ఈ డీజెల్‌గేట్ కుంభకోణం ఆటోమొబైల్ రంగాన్ని పూర్తిగా మార్చేసింది. డీజిల్ కార్లపై నమ్మకం కోల్పోయిన వోక్స్‌వ్యాగన్.. తన రూట్ మార్చి ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేగంగా వేసింది. వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఐడీ సిరీస్ వంటి ఈవీ కార్లను మార్కెట్లోకి తెచ్చింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోందంటే దానికి ఒక రకంగా ఈ డీజెల్‌గేట్ స్కామ్ ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు. కార్పొరేట్ సంస్థలు నమ్మకాన్ని కోల్పోతే ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాలో చెప్పడానికి ఈ కార్ల స్మశానాలే ప్రత్యక్ష ఉదాహరణ.

టాప్ హెడ్ లైన్స్

Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
Car Warranty: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
కారులో డాష్‌క్యామ్ పెట్టించాలనుకుంటున్నారా? మీ కారు వారంటీ పోతుందేమో తెలుసుకోండి!
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Kia Seltos సరికొత్త రికార్డ్‌.. 7 లక్షలు దాటిన అమ్మకాలు.. ఈ SUVకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా?
ఇండియాలో 7 లక్షల మంది కొన్న క్రేజీ SUV.. ధర మీ బడ్జెట్‌లోనే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget