అన్వేషించండి

India's Auto Retail Hits All Time High: దూసుకుపోతున్న ఆటో రంగం.. చరిత్రలో తొలిసారి 3 కోట్ల మార్కు రికార్డు స్థాయి అమ్మకాలతో హిస్టరీ !

2025-26 ఆర్థిక సంవత్సరం ఇండియ‌న్ ఆటోమొబైల్ రంగం 2.96 కోట్ల యూనిట్ల విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రాక్టర్లు, ప్యాసింజర్ వాహనాలు భారీ వృద్ధిని నమోదు చేశాయి.

India's Auto Retail Hits All Time High Sales: ఇండియ‌న్ ఆటో రిటైల్ రంగం గ‌త ఆర్థిక సంవత్సరం లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 2,96,71,064 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 13.30 శాతం భారీ వృద్ధి కావడం విశేషం. కేవలం రెండేళ్ల క్రితం వరకు మూడు కోట్ల మార్కు అనేది ఒక కలలా అనిపించినా, ఇప్పుడు ఆ మైలురాయికి అత్యంత చేరువలో నిలిచామ‌ని తెలుస్తోంది. మొత్తం ఆరు వాహన విభాగాలలో ఐదు విభాగాలు తమ వార్షిక రికార్డులను తిరగరాయడం ఈ ఏడాది ప్రత్యేకతగా చెప్పుకోవ‌చ్చు.

టు-వీలర్స్ కమ్‌బ్యాక్ - ప్యాసింజర్ వాహనాల జోరు..
కోవిడ్ పూర్వపు పీక్ స్టేజ్‌ను టూ-వీలర్ విభాగం మళ్ళీ అందుకుందని తెలుస్తోంది. ఏకంగా 2.14 కోట్ల యూనిట్ల అమ్మకాలతో 13.40 శాతం వృద్ధి సాధించింది. జీఎస్టీ మార్పుల వల్ల ధరలు అందుబాటులోకి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యత పెరగడం దీనికి ప్రధాన కారణాలు. ఇక ప్యాసింజర్ వాహనాల (PVs) విషయానికి వస్తే, చరిత్రలో మొదటిసారిగా 47 లక్షల మార్కును దాటాయి. కొత్త మోడళ్ల రాక, ఎస్‌యూవీల (SUVs) పట్ల ప్రజల్లో పెరిగిన క్రేజ్ ఈ వృద్ధికి ఊతమిచ్చాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

రికార్డు సృష్టించిన ట్రాక్టర్లు - కమర్షియల్ వెహికల్స్..
ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరిచిన విభాగం ట్రాక్టర్లు. మొదటిసారిగా 10 లక్షల యూనిట్ల రిటైల్ విక్రయాలతో 18.95 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మంచి రుతుపవనాలు, రబీ పంట సాగు పెరగడం వల్ల రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం దీనికి నిదర్శనం. అలాగే కమర్షియల్ వాహనాలు (CVs) కూడా 10 లక్షల మార్కును దాటి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పెరగడం వల్ల సరుకు రవాణాకు డిమాండ్ పెరిగింది. త్రీ-వీలర్ విభాగంలో 60 శాతానికి పైగా ఎలక్ట్రిక్ వాహనాలే (EVs) ఉండటం విశేషం. కేవలం కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ విభాగం మాత్రం ప్రాజెక్టుల ఆలస్యం వల్ల 11.70 శాతం క్షీణించింది. లేకపోతే ఈ విభాగంలో కూడా గణనీయమైన పురోగతి ఉండే అవకాశముందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

జీఎస్టీ 2.0 మ్యాజిక్ - రూరల్ వర్సెస్ అర్బన్..
సెప్టెంబర్ నెలలో అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. చిన్న కార్లు, మాస్ సెగ్మెంట్ టూ-వీలర్లపై పన్ను భారం తగ్గడం వల్ల సామాన్యులకు వాహనాలు కొనుగోలు చేయడం సులభమైంది. డిమాండ్ పరంగా చూస్తే, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ భారతంలో అమ్మకాలు వేగంగా పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో గ్రామీణ డిమాండ్ 17.12 శాతం ఉండగా, పట్టణాల్లో అది 10.43 శాతంగా నమోదైంది. ఈ ఏప్రిల్ నెలలో కూడా ఇదే జోరు కొనసాగుతుందని డీలర్లు ఆశిస్తున్నారు. సుమారు 50.56 శాతం మంది డీలర్లు అమ్మకాలు ఇంకా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, భారత్ ఇప్పుడు గ్లోబల్ ఆటోమొబైల్ హబ్‌గా మారుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Embed widget