ఇది సిటీ, మ్యాక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. సిటీ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,19,999 కాగా, మ్యాక్స్ వేరియంట్ ధర రూ. 1,55,499.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
VLF Strada EV | భారత్ మార్కెట్లోకి వచ్చిన కొత్త VLF స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ధర, బ్యాటరీ ఆప్షన్లు, పూర్తి వివరాలను తెలుసుకోండి.

- VLF స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్‌లలో విడుదలైంది.
- సిటీ వేరియంట్ 1.2 లక్షలు, 130 కి.మీ రేంజ్ అందిస్తుంది.
- మ్యాక్స్ వేరియంట్ 1.55 లక్షలు, 250 కి.మీ రేంజ్ ఇస్తుంది.
- 85 కి.మీ/గం టాప్ స్పీడ్, పెద్ద చక్రాలు, ఆధునిక ఫీచర్లు.
భారత్‌లో అనేక కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌లోకి కొత్త స్కూటర్ వచ్చింది. VLF కంపెనీ అత్యంత శక్తివంతమైన, స్టైలిష్ స్కూటర్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. లాంగ్ రేంజ్, మోడ్రన్ ఫీచర్ల కారణంగా ఇది హాట్ టాపిక్ అవుతోంది. కొత్త ఈవీ వీఎల్ఎఫ్ స్ట్రాడా ధర, బ్యాటరీ సామర్థ్యం, డ్రైవింగ్ రేంజ్, ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
2 వేరియంట్లలో లాంచ్
వీఎల్‌ఎఫ్ స్ట్రాడా సిటీ, మ్యాక్స్ అనే 2 వేరియంట్లలో లాంచ్ అయింది. హైదరాబాద్‌లో సిటీ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,19,999 కాగా, ఆన్ రోడ్ ధర రూ.1,22,941 నుంచి రూ.1,27,914 వరకు ఉంటుంది. ఇందులో 2.16 kWh సింగిల్ రిమూవబుల్ LFP బ్యాటరీ ఇస్తారు. ఈవీ ఒకే ఛార్జ్‌పై 130 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.
టాప్ వేరియంట్ వీఎల్‌ఎఫ్ స్ట్రాడా మాక్స్ హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,55,499 గా ఉంది. దీని ఆన్ రోడ్ ధర రూ.1,63,195గా ఉంది. ఇందులో వీఎల్‌ఎఫ్ కంపెనీ 4.32 kWh డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీని అందిస్తుంది. ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా ఒకసారి ఈవీ ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు లాంగ్ రేంజ్ అందిస్తుంది. IDC రేంజ్‌ను అందించడానికి బిగ్ బ్యాటరీ పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.
బైక్ తరహాలో స్పీడ్
వీఎల్‌ఎఫ్ స్ట్రాడా సిటీ, మ్యాక్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ విషయంలోనూ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ముందుంది. ఇందులో రియర్ వీల్‌పై 4.8 kW పీక్ పవర్, 34 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే BLDC హబ్ మోటార్ ఇచ్చారు. ఈ మోటార్ కారణంగా ఈవీ స్కూటర్ గంటకు 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో నడుస్తుంది. రైడర్ సౌకర్యం కోసం ఇందులో ఈకో, సిటీ, స్పోర్ట్ అనే 3 వేర్వేరు రైడింగ్ మోడ్లు ఇచ్చారు. మీ అవసరాన్ని బట్టి మోడ్ మార్చుకోవచ్చు.
స్కూటర్‌లో పెద్ద వీల్స్
భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లలో చిన్న చక్రాలే కనిపిస్తుంటాయి. కానీ వీఎల్ఎఫ్ స్ట్రాడా ప్రత్యేకత ఏంటంటే దీని పెద్ద అల్లాయ్ వీల్స్ అని చెప్పవచ్చు. ఈవీలో ముందు వైపు 16 అంగుళాల పెద్ద వీల్, వెనుక 14 అంగుళాల వీల్ ఇచ్చారు.
ముందు భాగంలో ట్విన్-బీమ్ ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్, స్టెప్డ్ టూ-పీస్ సీట్, స్పోర్టీ విండ్‌షీల్డ్, ఇంటెగ్రేటెడ్ లగేజ్ రాక్ వస్తాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 175 మి.మీ కాగా సీటు ఎత్తు 780 మి.మీ అని తెలపింది.
ఫీచర్లు, బుకింగ్ వివరాలు
వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్లలో 5 అంగుళాల ఆధునిక TFT డిస్‌ప్లే ఇవ్వగా, ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ వివరాలను అందిస్తుంది. ఇందులో కీ-లెస్ ఎంట్రీ, ఇల్యూమినేటెడ్ ఇగ్నిషన్, మొబైల్ ఛార్జింగ్ కోసం USB టైప్-ఎ, Type C రెండూ పోర్టులు ఇచ్చారు. ఈ స్కూటర్‌ను కార్బోనియో బ్లాక్, అర్బానో సిల్వర్, టైటానియో గ్రే, లూనా వైట్ అనే 4 రంగులలో తీసుకొచ్చారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలంటే వీఎల్ఎఫ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
Frequently Asked Questions
వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది మరియు వాటి ధరలు ఎంత?
వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఛార్జ్‌తో ఎంత దూరం ప్రయాణించగలదు?
సిటీ వేరియంట్ 130 కి.మీల రేంజ్ ఇస్తుంది. మ్యాక్స్ వేరియంట్ పెద్ద బ్యాటరీతో ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీల వరకు లాంగ్ రేంజ్ అందిస్తుంది.
ఈ స్కూటర్ గరిష్ట వేగం ఎంత? ఇందులో ఎన్ని రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి?
ఈ స్కూటర్ గంటకు 85 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. రైడర్ సౌకర్యం కోసం ఈకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.
వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని కొన్ని ముఖ్య లక్షణాలు ఏమిటి?
ఇందులో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, కీ-లెస్ ఎంట్రీ మరియు USB ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. దీనికి పెద్ద 16 అంగుళాల ముందు చక్రం కూడా ఉంది.
ట్రెండింగ్ వార్తలు























