అన్వేషించండి

VinFast VF MPV 7 EMI Calculations: విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ.. ఒక్క ఛార్జ్‌తో 517 కిమీ రేంజ్! కొనాలనుకుంటున్నారా..? ఈఎంఐ వివరాలు ఇవే!

వియత్నాం దిగ్గజం విన్‌ఫాస్ట్ తన మూడవ ఎలక్ట్రిక్ వాహనం వీఎఫ్ ఎంపీవీ 7ను విడుదల చేసింది. ఈ ఫ్యామిలీ ఈవీ ఫుల్ ఛార్జ్‌పై 517 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ బండిని కొనాల‌నుకుంటే ఈఎంఐ వివ‌రాలు ఇవిగో.

VinFast VF MPV 7 EMI Calculations: ఇండియ‌న్ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి వియత్నాంకు చెందిన ప్రముఖ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) తన మూడవ కారును ప్రవేశపెట్టింది. ఇప్పటికే వీఎఫ్ 6, వీఎఫ్ 7 వంటి ఎస్‌యూవీలను లాంచ్ చేసిన ఈ కంపెనీ, ఇప్పుడు ఫ్యామిలీ అవసరాల కోసం ‘వీఎఫ్ ఎంపీవీ 7’ (VF MPV 7) ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ కేవలం ఒకే ఒక ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ. 24.49 లక్షలుగా నిర్ణయించారు. ఇది మార్కెట్లో ఉన్న బీవైడీ ఈమ్యాక్స్ 7 (BYD eMax 7), కియా కార్నివాల్ ఈవీ, మహీంద్రా XEV 9S వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే ఈ కారు ప‌వ‌ర్ వివ‌రాలు, కారును డౌన్ పేమెంట్ సాయంతో కొనాల‌నుకుంటున్నారా..? అయితే దీనికి సంబంధించిన వివ‌రాలు తెలుసుకుందాం.

రేంజ్ - బ్యాటరీ పవర్...
విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 కారును చూడటానికి చాలా సింపుల్ గా, మోడ్రన్ గా డిజైన్ చేశారు. మూడు వరుసల సీటింగ్ తో ఉండే ఈ ఎంపీవీలో ఏడుగురు హాయిగా ప్రయాణించవచ్చు. ఇందులో 60.13 kWh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ప్యాక్ కలదు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ వాడితే కేవలం 30 నిమిషాల్లోనే 10 నుండి 70 శాతం వరకు బ్యాటరీ నిండుతుంది. దీని మోటార్ 201 bhp పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల కారు పికప్ చాలా స్మూత్ గా ఉంటుంది.

నెలవారీ ఈఎంఐ లెక్కలు..
మీరు ఈ కారును లోన్ ద్వారా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, మీ ఈఎంఐ ఎంత ఉండవచ్చో ఇక్కడ తెలుసుకోండి. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 24.49 లక్షల మొత్తాన్ని లోన్ గా తీసుకుని, 9.5% వడ్డీ రేటుతో లెక్కిస్తే వేర్వేరు కాలపరిమితులకు ఈఎంఐలు ఇలా ఉంటాయి:

3 ఏళ్ల కాలపరిమితి (36 నెలలు): ప్రతి నెలా మీరు రూ. 78,449 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలో మొత్తం వడ్డీ రూ. 3,75,153 అవుతుంది.

4 ఏళ్ల కాలపరిమితి (48 నెలలు): నెలవారీ ఈఎంఐ రూ. 61,527 గా ఉంటుంది. మొత్తం వడ్డీ రూ. 5,04,275 కట్టాలి.

5 ఏళ్ల కాలపరిమితి (60 నెలలు): నెలవారీ భారం తగ్గి ఈఎంఐ రూ. 51,434 కి చేరుతుంది. ఐదేళ్లలో మొత్తం వడ్డీ రూ. 6,37,014 అవుతుంది.

ఫీచర్లు - పోటీ..
ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు, ఎక్కువ రేంజ్ కోరుకునే వారికి ఈ కారు ఒక బెస్ట్ ఆప్షన్. కియా క్యారెన్స్, ఎంజీ విండ్సర్ ఈవీ వంటి కార్ల కంటే ఇది ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. విన్‌ఫాస్ట్ తన కస్టమర్ల కోసం మంచి కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లను ఈ ఎంపీవీలో పొందుపరిచింది. ప్రస్తుతం నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పెట్రోల్ ఖర్చులు లేకుండా లాంగ్ ట్రిప్స్ వెళ్లాలనుకునే వారికి 517 కిమీ రేంజ్ ఇచ్చే వీఎఫ్ ఎంపీవీ 7 ఒక పక్కా ఫ్యామిలీ కార్ అని చెప్పవచ్చు. త్వరలో దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో ఈ కారు అందుబాటులోకి రానుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget