VIDA కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఈ EV ధర, రేంజ్ పూర్తి వివరాలిలా
Vida Electric Vehicle | విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లాంచ్ చేశారు. ఇది గత మోడల్ కంటే పెద్ద బ్యాటరీతో వస్తుంది, దాంతో మీరు ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

VIDA VX2 Ranga And Price: హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థ అయిన విడా (Vida) VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది. విడా ఈ EVని 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో లాంచ్ చేసింది. VX2 ఈ కొత్త వేరియంట్‌ను కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.02 లక్షలుగా నిర్ణయించారు. విడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ VX2 లైనప్ కొత్త మిడ్-స్పెక్ వేరియంట్, ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్, ఎక్కువ రేంజ్‌తో వచ్చింది.
విడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్
విడా కొత్త స్కూటర్ దాని VX2 Go తరువాతి వేరియంట్. ఇందులో కొత్త 3.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. దాంతో ఇది ఎక్కువ మైలేజ్ రేంజ్ అందిస్తుంది. ఈ EV డ్యూయల్ రీమూవబుల్ బ్యాటరీ సెటప్‌తో వచ్చింది. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అమర్చిన మోటార్ 6 kW శక్తిని, 26 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ 70 kmph గరిష్ట వేగంతో వెళ్తుంది. ఈ EVలో రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, రైడ్ మోడ్స్ ఉన్నాయి. దీంతో రైడర్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
కొత్త Vida VX2 ఫీచర్లు
విడా VX2 Go 3.4 kWh స్కూటర్ గతంలోలాగే కాంపాక్ట్, ఫంక్షనల్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, పొడవైన సీటు మరియు 27.2 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ స్కూటీపై ఒంటరిగా వెళ్తే మంచి రైడింగ్ అనుభవం కలుగుతుంది. అదే సమయంలో వెనుక సీటుపై కొంత సామాను, లేదా మరో వ్యక్తి ఉన్నా సులభంగా తీసుకెళ్లవచ్చు.
విడా ఈ స్కూటర్‌లో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉపయోగించింది. ఇవి ట్యూబ్‌లెస్ టైర్‌లతో వస్తాయి. ఈ EVలో బేసిక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీని డిస్‌ప్లేలో రైడింగ్ సమాచారం లభిస్తుంది.






















