అన్వేషించండి

Vespa Tech 80th Special Edition: క్లాసిక్ స్టైల్‌లో వెస్పా కొత్త వేరియంట్ - 125cc, 150cc ఇంజిన్లతో 'టెక్ 80th' ఎంట్రీ.. వింటేజ్ కలర్ తో కట్టిపడేస్తున్న లుక్!

ఇటాలియన్ స్కూటర్ దిగ్గజం వెస్పా, తన 80వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియాలో 'టెక్ 80th' స్పెషల్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. వింటేజ్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ కలయికగా ఇది రూపొందింది.

Vespa Tech 80th Special Edition Unveiled in India: ప్రముఖ ఇటాలియన్ టూ-వీలర్ తయారీ సంస్థ వెస్పా (Vespa), భారత మార్కెట్లో తన 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పురస్కరించుకుని 'టెక్ 80th' (Tech 80th) స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. పాత కాలపు డిజైన్ సొగసులను, నేటి తరం టెక్నాలజీతో మేళవించి ఈ సెలబ్రేటరీ మోడల్‌ను రూపొందించారు. స్టైలిష్ గా, ప్రీమియం లుక్ తో నగరాల్లో ప్రయాణించాలనుకునే రైడర్ల కోసం ఈ స్కూటర్ 125cc, 150cc అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ మోడల్, వెస్పా బ్రాండ్ వారసత్వాన్ని ప్రతిబింబిస్తోంది.

ఆకట్టుకునే స్పెషల్ డిజైన్..
ఈ 'టెక్ 80th' ఎడిషన్ ప్రత్యేకత దాని రంగులోనే కనిపిస్తుంది. 1940ల కాలం నాటి తొలి వెస్పా మోడళ్ల నుండి స్ఫూర్తి పొంది 'వెర్డే పాస్టెల్లో' (Verde Pastello) గ్రీన్ పెయింట్ స్కీమ్‌ను దీనికి ఇచ్చారు. ఈ రంగు కేవలం బాడీకే పరిమితం కాకుండా ఫ్రంట్ షీల్డ్ ట్రిమ్, గ్రాబ్ హ్యాండిల్, మిర్రర్స్, స్విచ్ గేర్, ఫ్రంట్ సస్పెన్షన్ లింకేజ్ వంటి భాగాలకు కూడా వర్తింపజేశారు. దీనివల్ల స్కూటర్‌కు పక్కా వింటేజ్ లుక్ వచ్చింది. సీటు అప్హోల్స్టరీ, ఫుట్‌రెస్ట్ ఇన్సర్ట్స్, హ్యాండిల్‌బార్ గ్రిప్స్ పై డార్క్ గ్రీన్ యాక్సెంట్స్ ఉండటం క్లాసిక్ థీమ్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది.

1946 నాటి ఒరిజినల్ వెస్పా 98 మోడల్‌ను తలపించేలా దీని వీల్స్ డిజైన్ చేశారు. అదే గ్రీన్ షేడ్ తో పాటు డైమండ్ కట్ ఎఫెక్ట్ ఈ వీల్స్ కు అదనపు ఆకర్షణను ఇస్తుంది. స్కూటర్ ముందు భాగంలో వెస్పా లోగో పక్కనే '80th' బ్యాడ్జ్ ఉంటుంది. అలాగే వెనుక భాగంలో '80 years of Vespa Est. 1946' అనే ప్రత్యేక లోగోను అమర్చారు. ఇది వెస్పా బ్రాండ్ ప్రారంభమైన ఏడాదిని గుర్తు చేస్తూ స్పెషల్ ఎడిషన్ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.

ఇంజిన్ - పర్ఫార్మెన్స్ వివరాలు..
లుక్ పరంగా వింటేజ్ గా ఉన్నప్పటికీ, లోపల మాత్రం వెస్పా లేటెస్ట్ ప్లాట్‌ఫారమ్ టెక్నాలజీని వాడారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టాండర్డ్ వెస్పా మోడళ్లలోని హార్డ్‌వేర్, సేఫ్టీ ఫీచర్లు ఇందులోనూ కొనసాగుతాయి. 125cc వేరియంట్ లో 124.4cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 9.5 హార్స్ పవర్, 10.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 150cc వెర్షన్ లో 149.5cc ఇంజిన్ ఉండగా, ఇది 11.4 హార్స్ పవర్, 11.6 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లకు సీవీటీ (CVT) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు. దీనివల్ల సిటీ ట్రాఫిక్ లో రైడింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది.

మార్కెట్ పొజిషన్ - ధర..
వెస్పా ఇండియా ఈ 'టెక్ 80th' ఎడిషన్ ఫుల్ ఫీచర్ లిస్ట్ లేదా ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వచ్చే వారం ఈ వివరాలన్నీ అనౌన్స్ చేయనున్నట్లు కంపెనీ హింట్ ఇచ్చింది. ఇది ఒక స్పెషల్ ఎడిషన్ మోడల్ కాబట్టి, సాధారణ వెస్పా స్కూటర్ల కంటే దీని ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బ్రాండ్ వారసత్వాన్ని ఇష్టపడే వారికి, అలాగే రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి ఈ స్కూటర్ ఒక బెస్ట్ ఛాయిస్. లగ్జరీ స్కూటర్ల విభాగంలో వెస్పా తన స్థానాన్ని ఈ కొత్త మోడల్ తో మరోసారి నిరూపించుకోనుంది.

టాప్ హెడ్ లైన్స్

Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Tata Cars: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
కారు టాటాది.. కారు పైన బ్యాడ్జ్‌ మాత్రం హోండా, హ్యుందాయ్‌ది! టెక్నాలజీ షేరింగ్‌ గురూ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Samantha : బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Embed widget