అన్వేషించండి

Vehicle Scrappage Policy: మీ కారు రోడ్డెక్కుతుందా.. జాగ్రత్త.. చెక్ చేసుకోకుంటే చెత్తలోకే..

ఇటీవలే కేంద్రం కొత్త వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించింది. దీని ద్వారా వాహనాల కాలం, ఫిట్ నెస్ ను చూస్తారు. లేకుంటే.. స్క్రాప్ లో కలిపేయాల్సిందే.


కేంద్ర ప్రభుత్వం వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని తీసుకొచ్చింది. కాలం చెల్లిన, కాలుష్య కారక వాహనాలను తొలగించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. మెల్లమెల్లగా పాత, అన్ ఫిట్ వాహనాలను తొలగించడమే ఈ పాలసీ లక్ష్యం. మీ వాహనాల రిజిస్ట్రేషన్ పరిమితికాలం పూర్తి కాగానే స్క్రాపేజ్‌ పాలసీ అమలులోకి వచ్చేస్తుంది. తరువాత ఆ వాహనాలకు ఫిట్‌నెస్‌ టెస్ట్ నిర్వహిస్తారు. మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం వాణిజ్య వాహనాలు 15 సంవత్సరాల తర్వాత, ప్రైవేట్ వాహనాలు 20 సంవత్సరాల వరకు పరిమితి ఉంటుంది. ఈ టైమ్ తర్వాత వాహనాలు వాతావరణ కాలుష్యానికి, ప్రమాదాలకు దారి తీస్తాయి. అయితే ఈ పాలసీతో వాహనాలను రీసైక్లింగ్ చేసేందుకు, వినియోగించే వ్యక్తులు ప్రోత్సహకాలను కూడా అందిస్తారు. 

ఏంటీ ఈ స్క్రాప్ విధానం

వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం.. వాహనం వయస్సుతోపాటు ఫిట్‌నెస్ పరీక్ష కూడా చేస్తారు. అనర్హమైనది అయితే స్క్రాప్ చేస్తారు. అయితే ఈ పాలసీ నుంచి వాహన యజమానులు నగదును పొందడమే కాకుండా, ప్రభుత్వం నుంచి కొత్త కారు కొనుగోలుపై రాయితీ కూడా వస్తుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈ పాలసీపై ప్రకటన చేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఉపాధి కల్పన, ఆర్థిక ప్రయోజనాలతో వెహికల్‌ స్క్రాపేజ్‌ పాలసీని ప్రతిపాదించారు. ఈ పాలసీ వల్ల దేశంలో నిరుపయోగంలో ఉన్న వాహనాలు తుక్కుగా మారిపోనున్నాయని తెలిపారు.

దేశంలో 20 ఏళ్లు దాటిన వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లు దాటిన వాహనాలు 34 లక్షల ఉన్నాయి. సిస్టమాటిక్ పద్ధతిలో రీసైక్లింగ్ చేయడం వల్ల స్టీల్, ప్లాస్టిక్, రాగి వంటివి తిరిగి ఉపయోగించుకోవచ్చు. దీంతో తయారీ వ్యయం తగ్గుతుంది. ఈ పాలసీ వల్ల కొత్త అమ్మకాలు ప్రోత్సహించినట్లు అవుతుంది.

ఫిట్‌నెస్ టెస్టు సెంటర్లలో వాహనాల  అన్ని టెస్టులు చేసి పొల్యూషన్ స్థాయి ఏ లెవెల్ ఉందో కూడా నిర్ధారిస్తారు. టెస్ట్‌లో ఫెయిలయితే.. వాహనదారుడు తమ పాత వాహనాలను రిపేర్ చేయించి మూడుసార్లు టెస్ట్ నిర్వహించవచ్చు. స్క్రాపింగ్‌కు ఇవ్వాలనుకున్న వాహనదారులకు.. వెహికల్ ఎక్స్ షోరూం ధర ప్రకారం 4 నుంచి 6 శాతం ప్రోత్సాహకాలు అందుతాయి. రోడ్డు పన్ను నుంచి 25 శాతం, వాణిజ్య వాహనాల కొనుగోలు నుంచి 15 శాతం రాయితీ లభించనుంది.

స్టార్టప్ లు ఏర్పాటు చేయాలి

స్క్రాపింగ్ పాలసీ ఆవిష్కరించిన రోజున ప్రధాని మోదీ మాట్లాడారు. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొత్త పాలసీని తీసుకువచ్చామని వివరించారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు తీసుకువచ్చిన ఈ పాలసీ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. దశల వారీగా నిరుపయోగంగా ఉన్న వాహనాలను తగ్గించాలని ప్రధాని అన్నారు. ఇందు కోసం స్టార్టప్ లను ఏర్పాటు చేయాలని యువతకు ప్రధాని పిలుపునిచ్చారు.

 

టాప్ హెడ్ లైన్స్

FCRA Bill Joint Committee: ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు.. ఏఏ పార్టీల ఎంపీలు ఉన్నారంటే?
ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై జాయింట్ కమిటీ ఏర్పాటు.. ఏఏ పార్టీల ఎంపీలు ఉన్నారంటే?
Budget Family Trip : ఫ్యామిలీతో ట్రిప్​కు ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో ఇండియాలో వెళ్లేందుకు బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే
ఫ్యామిలీతో ట్రిప్​కు ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో ఇండియాలో వెళ్లేందుకు బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
Rahul Gandhi PM Hopes: రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?
రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Telangana Cabinet Expansion:తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
Iran War: సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Embed widget