Upcoming MPV Cars: ఇండియాలో త్వరలో లాంచ్ కానున్న ఎంపీవీలు ఇవే - నాలుగు సూపర్ కార్లు!
Upcoming MPV Cars in India: త్వరలో భారతీయ మార్కెట్లో కొన్ని ఎంపీవీ కార్లు అందుబాటులోకి రానున్నాయి.
New MPVs: భారతీయ కార్ల కొనుగోలుదారులలో ఎంపీవీ సెగ్మెంట్‌కు బాగా డిమాండ్ పెరుగుతోంది. వాటి ప్రాక్టికాలిటీ, ఫ్లెక్సిబిలిటీ, పెద్ద క్యాబిన్ కారణంగా వీటిని ఫ్యామిలీ కార్లు అంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎస్‌యూవీలు, క్రాస్‌ఓవర్‌లకు పెరుగుతున్న ప్రజాదరణ, కొత్త ఉత్పత్తి లాంచ్‌లు లేకపోవడం వల్ల ఎంపీవీ అమ్మకాలు ఎక్కువగా పెరగలేదు. టయోటా ఇన్నోవా హైక్రాస్ 2023లో ఎంపీవీ మార్కెట్ వాటాను నిలుపుకోగలిగింది. ఇది కాకుండా మారుతి సుజుకి, కియా, నిస్సాన్, రెనో కూడా అనేక కొత్త లాంచ్‌లను ప్లాన్ చేస్తున్నాయి. త్వరలో రానున్న ఈ కొత్త కార్ల గురించి తెలుసుకుందాం.
కొత్త తరం కియా కార్నివాల్
నాలుగో తరం కియా కార్నివాల్ 2024లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఉన్న 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. గ్లోబల్ మార్కెట్లలో కొత్త కార్నివాల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఇది 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఎలక్ట్రిక్ మోటారుతో కంబైన్ చేస్తుంది. ఇందులో రీడిజైన్ చేసిన గ్రిల్, అప్‌డేట్ చేసిన ఫ్రంట్, రియర్ బంపర్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్‌లు, అప్‌డేట్ చేసిన టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. దీని ఇంటీరియర్స్‌లో అప్‌డేట్ చేసిన డాష్‌బోర్డ్, మెరుగైన ఓటీఏ అప్‌డేట్‌లతో 12.3 అంగుళాల స్క్రీన్, ఏడీఏఎస్ టెక్నాలజీ, హెచ్‌యూడీ, ఆప్షనల్ 14.6 అంగుళాల స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
రెనో ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్
అప్‌డేట్ చేసిన ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ 2024లో విడుదల లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ ఎంపీవీ పెద్ద కాస్మెటిక్ ఛేంజెస్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లను పొందే అవకాశం ఉంది. ఇందులో 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కిగర్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నుంచి తీసుకోవచ్చు. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ సీట్ బెల్ట్ రిమైండర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రస్తుత భద్రతా ఫీచర్లతో పాటుగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉండవచ్చు.
నిస్సాన్ ట్రైబర్ ఆధారిత ఎంపీవీ
నిస్సాన్ ఇండియా 2024 లాంచ్ ప్లాన్‌లలో రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందిన కొత్త ఎంపీవీ ఉంది. దాని ముందు మోడల్ లాగానే ఇందులో 1.0 లీటర్ 3 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, మాన్యువల్, సీవీటీ, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండవచ్చు. మారుతి సుజుకి ఎర్టిగా, కియా కేరెన్స్ కంటే కాస్త డౌన్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన కొత్త నిస్సాన్ ఎంపీవీ చెన్నైలోని రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ ప్లాంట్‌లో తయారు కానుంది.
మారుతి మినీ ఎంపీవీ
మారుతి సుజుకి జపాన్ స్పెక్ సుజుకీ స్పేసియా ఆధారంగా చిన్న, సరసమైన ఎంపీవీ విభాగంలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి వైడీబీ అనే కోడ్ నేమ్ కూడా పెట్టారు. ఇది 2026 నాటికి భారత మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ మినీ ఎంపీవీ పొడవుగా, బాక్సీ షేప్‌ను కలిగి ఉంటుంది. దీని పొడవు నాలుగు మీటర్ల కంటే కాస్త తక్కువగా ఉంటుంది. సుజుకి కొత్త జెడ్-సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అమర్చిన ఈ మోడల్ నెక్సా-ప్రత్యేకమైన మోడల్ కావచ్చు. ఇది లైనప్‌లో ఎర్టిగా కంటే దిగువన ఉండనుంది.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!