Upcoming Electric Cars: 2024లో లాంచ్ కానున్న బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు - ఈవీలు కొనాలంటే ఆగడం బెస్ట్!
Upcoming Electric Cars in India: 2024లో మనదేశంలో మంచి ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అవుతున్నాయి. వీటిలో టాటా కర్వ్, మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ8, మారుతి ఈవీఎక్స్ కూడా ఉన్నాయి.
Upcoming Electric Cars in India: మనదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈవీ విభాగంలో ఆప్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది వచ్చే ఏడాది మారనుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై కంపెనీలు దృష్టి సారించాయి. ఇది కొనుగోలుదారులకు మరిన్ని ఆప్షన్లను అందిస్తుంది. వచ్చే సంవత్సరం విడుదల కానున్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
టాటా కర్వ్ (Tata Curvv)
భారతదేశంలో నెక్సాన్ ఈవీ కంటే పై స్థాయిలో కర్వ్ ఉండనుంది. సియెర్రా వచ్చే వరకు టాటా ప్రధాన ఉత్పత్తిగా ఉండనుంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ దాదాపు 500 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇవ్వగలదు. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 500 కిలోమీటర్లు డ్రైవ్ చేసేయవచ్చన్న మాట. ఇది ఆల్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ సెటప్‌తో రానుంది. బేస్ వెర్షన్ సింగిల్ మోటార్ లేఅవుట్‌తో లాంచ్ కానుంది. కర్వ్ ఒక కూపే స్టైల్ ఎస్‌యూవీగా ఉంటుంది. కొంతకాలం క్రితం డిస్‌ప్లే చేసిన కాన్సెప్ట్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఇందులో కొత్త నెక్సాన్ ఈవీ తరహాలో డిజైన్ మార్పులు ఉండనున్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ8 (Mahindra XUV.e8)
టాటా మోటార్స్ లాగానే మహీంద్రా కూడా తన మొదటి ఫుల్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని హారియర్ ఈవీకి పోటీగా తీసుకురానుంది. ఎక్స్‌యూవీ.ఈ8 స్టైలింగ్ ఎక్స్‌యూవీ700 మాదిరిగానే ఉంటుంది. కానీ పూర్తి వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్, రీసెస్డ్ గ్రిల్‌తో విభిన్నంగా ఉంటుంది. మహీంద్రా ఇంతకు ముందు చూపిన కాన్సెప్ట్‌ను ఎక్స్‌యూవీ.ఈ8 పోలి ఉంటుంది. ఈ కారు 80 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ రానుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్‌తో వస్తుంది.
మారుతి ఈవీఎక్స్ (Maruti eVX)
మారుతి మొదటి ఈవీ అయిన ఈవీఎక్స్ 2024 చివరి నాటికి వస్తుంది. భారతదేశంలో అతిపెద్ద ఆటోమేకర్ మారుతినే. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన కారు అవుతుంది. ఈవీఎక్స్ అనేది ఒక స్థానిక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది దాదాపుగా గ్రాండ్ విటారా సైజులో ఉంటుంది. 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు లాంచ్ కానుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 550 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇది అందించనుంది. అయితే ఎంట్రీ లెవల్ వేరియంట్ కోసం చిన్న బ్యాటరీ ప్యాక్ చూడవచ్చు. స్టైలింగ్ పరంగా ఇతర మారుతి కార్ల కంటే భిన్నమైన రూపంలో ఉండనుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300 EV)
అప్‌డేట్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అనేక స్పై ఫొటోలు, వీడియోల్లో కనిపించింది. వీటిని కంపెనీ చాలా అగ్రెసివ్‌గా టెస్ట్ చేస్తుంది. అఫీషియల్ లాంచ్ తేదీ బయటకు రానప్పటికీ ఫేస్‌లిఫ్టెడ్ మహీంద్రా ఎక్స్‌యూవీ300 2024 ఫిబ్రవరి నాటికి లాంచ్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. ఈవీ ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేయాలని మహీంద్రా యోచిస్తోంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!