Upcoming Cars in November 2025: నవంబర్ నెలలో లాంచ్ కానున్న కార్లు.. టాటా సియెర్రా నుంచి మహీంద్రా ఎక్స్ఈవీ 7ఈ వరకు
Cars Launching in November 2025: నవంబర్ 2025లో మూడు కొత్త కార్లు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఆ కార్ల ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.

భారత ఆటోమొబైల్ పరిశ్రమకు నవంబర్ 2025 నెల ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ నెలలో 3 ప్రధాన కార్ల తయారీ కంపెనీలు తమ కొత్త కార్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో Hyundai Venue 2025, Tata Sierra కారుతో పాటు Mahindra XEV 7e ఉన్నాయి. ఈ 3 కార్ల ఫీచర్లు, వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హ్యూందాయ్ వెన్యూ (Hyundai Venue 2025)
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ప్రసిద్ధ సబ్-కాంపాక్ట్ SUV Venue సెకండ్ జనరేషన్ మోడల్‌ను నవంబర్ 4, 2025న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు ఈ మోడల్ ప్రస్తుత వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉండనుంది. కొత్త Venueలో Kappa 1.0-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 120 PS శక్తిని, 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ SUV నగరంలో, హైవేపై జర్నీలో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం ఇందులో 2 ఎంపికలు ఉన్నాయి. 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DCT (Dual-Clutch Transmission).
మహీంద్రా కారు (Mahindra XEV 7e)
మహీంద్రా తన బోర్న్ ఎలక్ట్రిక్ శ్రేణిని బలోపేతం చేయడానికి XEV 7eని నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో విడుదల చేయవచ్చు. ఇది 7-సీటర్ EV XUV 700 ఎలక్ట్రిక్ వెర్షన్ అవుతుంది. ఇది INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Mahindra XUV700 EV బయటి డిజైన్ పెట్రోల్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. EVలో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, కనెక్టెడ్ LED లైట్‌బార్, త్రికోణాకార LED హెడ్‌లైట్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 అంగుళాల ఏరో ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ దీనిని ప్రత్యేకంగా మారుస్తున్నాయి. కారు వెనుక భాగంలో కనెక్టెడ్ LED టైల్‌లైట్‌లు, సవరించిన బంపర్ ఉండవచ్చు.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో ఇన్‌స్పైర్డ్ ట్రిపుల్, 12.3 అంగుళాల స్క్రీన్ డాష్‌బోర్డ్, 16-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండవచ్చు.
టాటా సియెర్రా (Tata Sierra)
నవంబర్ 25, 2025న Tata Sierra కారు విడుదల కానుంది. ఈ కారు 1991లో తొలిసారి విడుదలైంది. ఇప్పుడు రెట్రో-మోడ్రన్ డిజైన్‌తో రానుంది. ఈ మిడ్-సైజ్ SUV టాటా శ్రేణిలో కర్వ్, హారియర్ మధ్య సరిపోతుంది. కారులో పలు అద్భుతమైన ఫీచర్లు ఉండవచ్చు. వీటిలో షార్ప్ రూఫ్‌లైన్, షార్ట్ ఓవర్‌హ్యాంగ్స్, స్లిమ్ LED హెడ్‌లైట్‌లతో మోడ్రన్ టచ్ ఉన్నాయి.






















