TVS Ntorq 125: యూత్ కోసం సూపర్ సోల్జర్ ఎడిషన్ లాంచ్ - స్పోర్టీ క్యామో స్టైల్, టెక్ ఫీచర్లున్న సూపర్ స్కూటర్!
TVS Ntorq 125 Super Soldier Edition: టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ తాజాగా లాంచ్ అయింది, ఈసారి ఎంచుకున్న థీమ్ 'కెప్టెన్ అమెరికా'. తెలుగు రాష్ట్రాల్లో ధరలను ఈ కథనంలో చూడండి.

TVS Ntorq 125 Super Soldier Edition: సూపర్ హీరోల స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసింది. TVS కంపెనీ, తన ప్రముఖ 125cc స్కూటర్ ‘Ntorq’ కి ప్రత్యేక లుక్‌తో “Super Squad Edition”ను విడుదల చేసింది. మార్వెల్ స్టూడియోస్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ఎడిషన్.. ప్రత్యేకమైన డిజైన్, స్టైల్ ఎలిమెంట్స్‌తో యువతను ఆకట్టుకునేలా ఉంది. ఆవెంజర్స్, కెప్టెన్ అమెరికా, ఐరన్‌మ్యాన్, హల్క్, బ్లాక్ పాంథర్ లాంటి థీమ్‌ల ఆధారంగా ఈ స్కూటర్ల సిరీస్‌ను టీవీఎస్ తీసుకువచ్చింది. యువ మార్వెల్ అభిమానులకు, ముఖ్యంగా జెన్ Z రైడర్లకు కనెక్ట్ కావడం 'సూపర్ సోల్జర్ ఎడిషన్' లక్ష్యం.
డిజైన్‌లో సూపర్ హీరోలా కనిపించే స్కూటర్
ఈ స్కూటర్‌కు రెండు విభిన్న వేరియంట్లు ఉన్నాయి — Combat Blue (Captain America థీమ్), Stealth Black (Black Panther థీమ్). స్కూటర్ బాడీపై హీరోల లాజోస్, స్పెషల్ డెకల్స్, కలర్ కాంబినేషన్లు బాగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ బండిని చూడగానే సూపర్ హీరో గుర్తుకు వచ్చేలా డిజైన్ చేశారు. ఇంకా... ఫ్యూచరిస్టిక్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ సైడ్ ప్యానెల్స్, ప్రీమియం గ్రాఫిక్స్ స్కూటర్‌కు యూత్‌ఫుల్ అప్పీల్ తీసుకువచ్చాయి.
ఇంజిన్ & పనితీరు
TVS Ntorq 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌లో 124.8cc సింగిల్-సిలిండర్, 3 వాల్వ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9.38PS పవర్, 10.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది కాబట్టి నగర ప్రయాణాల్లో చాలా కంఫర్ట్ ఇస్తుంది. స్మూత్ యాక్సిలరేషన్, చక్కని స్టెబిలిటీ దీనిలోని మరో ప్రత్యేకత.
టెక్నాలజీ ఫీచర్లు:
- TVS SmartXonnect: బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌ను స్కూటర్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు
- టర్న్-బై-టర్న్ నావిగేషన్
- ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- కాల్/ SMS అలెర్ట్స్
- లాస్ట్ పార్క్‌డ్ లొకేషన్ అసిస్ట్
సేఫీ ఫీచర్లు:
- డిస్క్ బ్రేక్ ద్వారా మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ
- LED DRLs & టెయిల్‌ల్యాంప్స్
- టిల్డ్-అడ్జస్ట్ హెడ్‌ల్యాంప్స్
- మల్టీ ఫంక్షనల్ బటన్ కంట్రోల్స్
ధర వివరాలు
ఈ ప్రత్యేక ఎడిషన్ స్కూటర్ ధర హైదరాబాద్, విజయవాడలో రూ. 98,117 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ ఈ నెల నుంచి అన్ని TVS డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఆన్-రోడ్ ధరలో కలిసే ఖర్చులు:
- రిజిస్ట్రేషన్
- బీమా
- హ్యాండ్లింగ్ ఛార్జీలు
తెలుగు రాష్ట్రాల వారికి తగ్గ సూట్
హైదరాబాద్, విజయవాడ వంటి రద్దీ నగరాల్లో స్మార్ట్‌నెస్‌తో ప్రయాణించాలనుకునే యూత్, స్టూడెంట్స్, ఫస్ట్‌టైమ్ రైడర్లకు ఇది బెస్ట్ చాయిస్. అటు స్పోర్టీ లుక్, ఇటు టెక్నాలజీ ఫీచర్ల కలయికతో స్కూటర్ రోజువారీ వినియోగానికి సరిగ్గా సరిపోతుంది.
టీవీఎస్ కంపెనీ, 2020లోనే మార్వెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంలో భాగంగా ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, స్పైడర్ మ్యాన్ థీమ్ వేరియంట్‌లను కూడా లాంచ్ చేసింది.





















