అన్వేషించండి

Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు

ట్రయంఫ్ బోన్నెవిల్లే T40 & T4 మధ్య రూ.25 వేల ధర తేడా ఉంది. T40లో అదనంగా లభించే ఫీచర్లు, T4లో లేని రైడింగ్ ఎయిడ్స్, ధర వివరాలు ఇవే.

Triumph Bonneville T40 vs Bonneville T4: ట్రయంఫ్ బోన్నెవిల్లే పేరు బైక్ ప్రపంచంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పుడు ఈ పేరుతో రెండు కొత్త 400cc మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. అవే.. బోన్నెవిల్లే T40 & బోన్నెవిల్లే T4. ఈ రెండింటి మధ్య పెద్ద తేడా లేదు అనిపించినా.. ధరలో రూ.25,000 వ్యత్యాసం ఉంది. మరి ఆ అదనపు డబ్బుకు T40లో ఏం లభిస్తుంది? T4లో ఏ ఫీచర్లు మిస్ అవుతాయి?.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. బోన్నెవిల్లే T40 అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంది. బోన్నెవిల్లే T4 మాత్రం భారత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించిన మోడల్. ధర విషయంలో ఎక్కువ విలువ కోరుకునే భారతీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని T4ను తీసుకొచ్చారు. 

ఇంజిన్ పరంగా రెండూ ఒకటే

భారత మార్కెట్లో బోన్నెవిల్లే T40కి 349cc ఇంజిన్‌ అందించారు. ఇదే ఇంజిన్ T4లోనూ ఉంటుంది. ఇది 29hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా 31.2Nm టార్క్ అందిస్తుంది. ఈ రెండు బైక్‌లలో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. 14.5 లీటర్ల ఇంధన ట్యాంక్, స్లిప్ & అసిస్ట్ క్లచ్, రైడ్ బై వైర్ టెక్నాలజీ రెండింటిలోనూ ఉన్నాయి. రెండు బైక్‌ల కెర్బ్ బరువు 195 కిలోలు. సీటు ఎత్తు 790mm. గ్రౌండ్ క్లియరెన్స్ 165mmగా ఉంటుంది.

అయితే ఇంజిన్ ట్యూనింగ్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. బోన్నెవిల్లేలో కొత్త క్యామ్‌షాఫ్ట్, సిలిండర్ హెడ్ & సన్నటి థ్రాటిల్ బాడీలు ఉన్నాయి. ఈ ఇంజిన్‌ను తక్కువ RPMల వద్ద మెరుగైన పనితీరుకు అనుగుణంగా ట్యూన్ చేశారు.

డిజైన్‌లో T40 ప్రత్యేకం

ఈ రెండు బైక్‌ల మధ్య తేడాను సులభంగా గుర్తించాలంటే ముందుగా రంగులనే చూడాలి. బోన్నెవిల్లే T40లో నాలుగు రంగుల ఎంపికలు ఉన్నాయి. బ్లాక్‌తో పాటు బ్లూ/ట్యాంజరిన్, డార్క్ బ్లూ/వైట్ & వైట్/బ్లాక్ రంగులు ఉన్నాయి.

బోన్నెవిల్లే T4 మాత్రం మూడు సింగిల్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. బ్లాక్, గ్రీన్ & రెడ్ రంగుల్లో దీనిని ఎంచుకోవచ్చు.

రెండు బైక్‌లలోనూ హ్యాండ్ ఫినిష్డ్ డిటైల్స్‌ ఉంటాయి. మరింత క్లిష్టమైన డిజైన్ డిటైల్స్‌ T40కు మాత్రమే లభిస్తాయి. అంటే రూ.25 వేల అదనపు ధరలో డిజైన్ పరంగా కూడా కొంత ప్రత్యేకత ఉంటుంది.

ఇది కూడా చదవండి: 350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!

ఫీచర్లలో భారీ తేడా

ఫీచర్లలోనే T40కు, T4కు మధ్య అసలు తేడా కనిపిస్తుంది. బోన్నెవిల్లే T40లో కొత్త 4 అంగుళాల గుండ్రటి TFT డిస్‌ప్లే ఉంటుంది. దీనితో పాటు అధునాతన రైడింగ్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి.

T40లో ఏకంగా ఐదు రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి. కార్నరింగ్ ABS & ట్రాక్షన్ కంట్రోల్ కోసం IMUను కూడా అందించారు. ట్రయంఫ్ ఆధారిత టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. క్రూయిజ్ కంట్రోల్ కూడా ప్రామాణికంగా వస్తుంది.

ఈ ఫీచర్ల కారణంగా T40 కేవలం T4 కంటే మాత్రమే కాకుండా.. ప్రస్తుతం ఉన్న ఇతర ట్రయంఫ్ 400 మోడళ్లతో పోల్చినా మరింత మోడ్రన్‌గా నిలుస్తుంది.

T4లో ఏం తగ్గింది?

బోన్నెవిల్లే T4లో కూడా కొత్త 4 అంగుళాల గుండ్రటి డిస్‌ప్లే ఉంది. అయితే ఇది TFT కాదు. LCD యూనిట్.

T4లో IMU ఉండదు. దీంతో ABS & ట్రాక్షన్ కంట్రోల్‌కు కార్నర్ సెన్సిటివిటీ ఉండదు. క్రూయిజ్ కంట్రోల్ కూడా లేదు.

అలాగని T4ని పూర్తిగా సాధారణ బైక్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో మూడు రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్, డ్యూయల్ ఛానల్ ABS & ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉన్నాయి. కాకపోతే T40లో ఉన్న అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఇందులో కనిపించవు.

ఇది కూడా చదవండి: Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌

ధరలో రూ.25 వేల తేడా

బోన్నెవిల్లే T40 ఎక్స్ షోరూమ్ ధర రూ.2.80 లక్షలు. బోన్నెవిల్లే T4 ధర రూ.2.55 లక్షలు. అంటే T40 కోసం అదనంగా రూ.25,000 చెల్లించాలి.

T40 ఒకే వేరియంట్‌లో నాలుగు రంగులతో లభిస్తుంది. ఈ బైక్ డెలివరీలు 2026 నవంబర్ నుంచి ప్రారంభమవుతాయని ట్రయంఫ్ తెలిపింది.

బోన్నెవిల్లే T4 కూడా ఒకే వేరియంట్‌లో మూడు రంగులతో లభిస్తుంది. ప్రస్తుతం ఈ బైక్ బుకింగ్స్ చేసుకోవచ్చు. డెలివరీలు 2027 జనవరి రెండో వారం నుంచి ప్రారంభమవుతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget