Toyota Hyruder SUV Latest Updates: రూ.2 లక్షలు కట్టి టయోటా హై రైడర్ సొంతం చేసుకోండి.. అతి తక్కువ వడ్డీతో బ్యాంక్ లోన్ ద్వారా ఈజీ ఈఎంఐలతో..
టయోటా హై రైడర్ సొంతం చేసుకునేందుకు మరింత మంచి ప్రణాళికతో కంపెనీ ముందుకు వచ్చింది. తక్కువ డౌన్ పేమెంట్ తోపాటు ఆకర్షణీయమైన ఫైనాన్స్ సౌకర్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.

Toyota Hyruder SUV Downpayment, Finance Breakup Letest News: ఇండియాలోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ (Mid-size SUV) సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో టయోటా హైరైడర్ (Toyota Hyryder) ఒకటి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ వాహనం బేస్ వేరియంట్ 'E' ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి శుభవార్తని కంపెనీ వర్గాలు తెలిపాయి. కేవలం రెండు లక్షల రూపాయల డౌన్ పేమెంట్ తో ఈ ఎస్‌యూవీని ఇంటికి తీసుకెళ్లవచ్చు. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ (Urban Cruiser Hyryder) బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ (Ex-showroom) ధర ₹10.95 లక్షలుగా కంపెనీ వర్గాలు నిర్ణయించాయి.. ఢిల్లీ వంటి నగరంలో ఈ వాహనం కొనుగోలుకు దాదాపు ₹1.10 లక్షల ఆర్‌టీఓ (RTO) రుసుము, ₹53 వేల బీమా (Insurance) ఇతర ఛార్జీలు కలుపుకుంటే, హైరైడర్ ఆన్-రోడ్ (On-road) ధర సుమారు ₹12.68 లక్షల వరకు అవుతుంది.
ప్రైస్ బ్రేకప్ ఇలా..
ఈ బేస్ వేరియంట్‌ను ₹2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేస్తే, బ్యాంక్ నుంచి ₹10.68 లక్షల రుణం (Loan) తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ 9 శాతం వడ్డీ రేటుతో (Interest Rate) ఏడు సంవత్సరాల కాలవ్యవధికి (Tenure) ఈ మొత్తాన్ని మంజూరు చేస్తే, మీరు ప్రతి నెలా ₹17,188/- ఈఎంఐ (EMI) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్ కారణంగా, హైరైడర్‌ను కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత సులభతరం అయ్యిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
టయోటా హైరైడర్ కేవలం ఆకర్షణీయమైన ధర వద్దే కాకుండా, మైలేజ్ అత్యాధునిక ఫీచర్ల పరంగా కూడా అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. హైరైడర్ యొక్క స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ 27.97 kmpl వరకు క్లెయిమ్ చేయబడిన మైలేజీని అందిస్తుంది. ఇక మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ 20+ kmpl మైలేజీనిస్తుండగా, సీఎన్‌జీ (CNG) వేరియంట్ 26.6 కి.మీ/కేజీ మైలేజీని ఇవ్వగలదు. పూర్తి ట్యాంక్ ఇంధనంతో ఈ వాహనం 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది.
సూపర్ టెక్నాలజీ..
ఫీచర్ల విషయానికొస్తే, టయోటా ఈ ఎస్‌యూవీలో అనేక టెక్నాలజీతో కూడిన అప్‌డేట్లను ఇచ్చిందని తెలుస్తోంది. ఇందులో 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ , వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి, ఇవి వేసవిలో లేదా సుదూర ప్రయాణాలలో సౌకర్యాన్ని అందిస్తాయి. అలాగే, రియర్ డోర్ సన్‌షేడ్స్, యాంబియంట్ లైటింగ్ ,టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఇంటీరియర్‌ను మరింత యూజర్-ఫ్రెండ్లీగా మార్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో టయోటా హైరైడర్ హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్ ,స్కార్పియో ఎన్ వంటి ప్రముఖ ఎస్‌యూవీలతో గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
ఈ కొత్త ఫైనాన్స్ పథకం ,అద్భుతమైన ఫీచర్ల కలయిక హైరైడర్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేయడంలో సహాయపడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంకేం.. టయోటా కొత్త వేరియంట్ ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ ఫైనాన్స్ ప్రణాళిక అద్భుతంగా పనిచేస్తుంది.





















